IND vs PAK, 1 Innings Highlight: క్లాస్ చూపించిన కింగ్ కోహ్లీ.. పాకిస్తాన్ ముంగిట కష్టమైన లక్ష్యం
ICC T20 WC 2021, IND vs PAK: టీ20 వరల్డ్ కప్‌లో భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.
టీ20 వరల్డ్ కప్‌లో భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 151 పరుగులు చేసింది. పాకిస్తాన్ గెలవాలంటే 120 బంతుల్లో 152 పరుగులు చేయాల్సిందే. టాస్ గెలిచిన పాకిస్తాన్ బౌలింగ్‌ను ఎంచుకుంది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగిలాయి. మొదటి ఓవర్‌లో రోహిత్ శర్మ(0: 1 బంతి), మూడో ఓవర్లో ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్‌లను (3: 8 బంతుల్లో) అవుట్ చేసి షహీన్ అఫ్రిది పాకిస్తాన్‌కు మంచి బ్రేక్ అందించాడు. ఒక సిక్సర్, ఫోర్ కొట్టి ఊపు మీద కనిపించిన సూర్యకుమార్ యాదవ్ (11: 8 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) కూడా ఆరో ఓవర్లలో అవుటయ్యాడు. దీంతో పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి భారత్ మూడు వికెట్లు కోల్పోయి 36 పరుగులు మాత్రమే చేసింది.
ఆ తర్వాత రిషబ్ పంత్ (39: 30 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు), విరాట్ కోహ్లీ (57: 49 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) కలిసి ఇన్నింగ్స్ ముందుకు నడిపించారు. వికెట్లు పడిన ఒత్తిడి లేకుండా స్కోరింగ్ రేట్ పడకుండా వీరిద్దరూ బ్యాటింగ్ చేశారు. ఏడు, ఎనిమిది ఓవర్లు కలిపి ఏడు పరుగులు మాత్రమే వచ్చినా.. ఆ తర్వాత తొమ్మిది, పది ఓవర్లలో 17 పరుగులు రాబట్టారు. దీంతో పది ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 60 పరుగులను భారత్ సాధించింది.
ఆ తర్వాత పంత్ పూర్తిగా టాప్ గేర్‌కు వెళ్లిపోయాడు. హసన్ అలీ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో రెండు వరుస సిక్సర్లు రాబట్టారు. దీంతో 38 బంతుల్లోనే వీరి భాగస్వామ్యం 50 పరుగులకు చేరుకుంది. అయితే ఆ తర్వాతి ఓవర్లోనే షాదబ్ ఖాన్ బౌలింగ్‌లో రిషబ్ పంత్ భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ అవ్వడంతో.. భారత్ మరోసారి కష్టాల్లో పడింది.
జడేజా (13: 11 బంతుల్లో, ఒక ఫోర్), కోహ్లీ కాసేపు నిదానంగా ఆడారు. దీంతో 15 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు 100కు చేరుకుంది. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో 45 బంతుల్లో కోహ్లీ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అదే ఓవర్లో జడేజా కూడా అవుటయ్యాడు. ఆ తర్వాత షహీన్ అఫ్రిది వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో విరాట్ కోహ్లీ అవుటయినా 17 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్లో హార్దిక్ పాండ్యా అవుట్ కావడంతో.. కేవలం ఏడు పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. పాకిస్తాన్ విజయానికి 152 పరుగులు చేయాల్సిందే.
Also Read: ENG Vs WI, Match Highlights: వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ విజయం.. ఆ రికార్డు బ్రేక్!
Also watch: T20 World Cup 2021: పదేళ్ల తర్వాత ప్రపంచకప్ గెలిచే సత్తా కోహ్లీసేనకు ఉందా? ధోనీ మెంటారింగ్‌తో లాభం ఏంటి?