అన్వేషించండి
Advertisement
Virat Kohli: కోహ్లీనే అండగా నిలిచాడు, విరాట్ మద్దతు నా అదృష్టమన్న నగాల్
Sumit Nagal: విరాట్ కోహ్లీ ఫౌండేషన్ తనకు మద్దతు ఇస్తోందనిగతంలో చేసిన ఓ ఇంటర్వ్యూలో సుమిత్ తెలిపాడు. నాగల్ తన జేబులో కేవలం ఆరు డాలర్లు మాత్రమే ఉన్న సమయంలో కోహ్లీ ఫౌండేషన్ తనకు మద్దతు ఇచ్చిందన్నాడు.
ఆస్ట్రేలియా ఓపెన్(Australian Open 2024)లో ఇండియన్ టెన్నిస్ స్టార్ సుమిత్ నగాల్(Sumit Nagal) చరిత్ర సృష్టించాడు. తొలి రౌండ్‌లో ప్రపంచ 27వ ర్యాంకర్‌ను ఓడించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. మెన్స్ సింగిల్స్‌లో కజికిస్థాన్‌కు చెందిన దిగ్గజ ఆటగాడు అలెగ్జాండర్ బబ్లిక్(Sumit Nagal vs Alexander Bublik) ను మట్టికరిపించాడు. 6-4, 6-2, 7-6 (5)తో వరుస సెట్లలో గెలిచి చరిత్ర సృష్టించాడు. 1989 తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఓ సీడెడ్ ప్లేయర్‌ను భారత ఆటగాడు ఓడించడం ఇదే తొలిసారి. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 139వ స్థానంలో ఉన్న నగాల్.. 27వ ర్యాంకర్ అలెగ్జాండర్ బబ్లిక్‌పై గెలిచి సంచలనం సృష్టించాడు. సుమిత్ 6-4, 6-2, 7-6 (7-5)తో గెలుపొంది రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్ చరిత్రలో దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత ఓ సీడెడ్ ఆటగాడిని భారత క్రీడాకారుడు ఓడించడం ఇదే తొలిసారి. జబ్లిక్‌ను ఓడించిన రెండో రౌండ్‌లో దూసుకెళ్లిన సుమిత్ తర్వాత మెకెంజీ మెక్‌డొనాల్డ్, షాంగ్ జున్‌చెంగ్ లతో తలపడనున్నాడు. అయితే తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు విరాట్ కింగ్ కోహ్లీ (Virat Kohli) అండగా నిలిచినట్లు సుమిత్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
కోహ్లీనే అండగా నిలిచాడు...
విరాట్ కోహ్లీ ఫౌండేషన్ 2017 నుంచి తనకు మద్దతు ఇస్తోందని 2019లో చేసిన ఓ ఇంటర్వ్యూలో సుమిత్ తెలిపాడు. నాగల్ తన జేబులో కేవలం ఆరు డాలర్లు మాత్రమే ఉన్న సమయంలో కోహ్లీ, అతని ఫౌండేషన్ తనకు ఎలా మద్దతు ఇచ్చాయో చెప్పాడు. 2017 నుంచి విరాట్ కోహ్లీ ఫౌండేషన్ తనకు మద్దతు ఇచ్చినట్లు వెల్లడించారు. తాను గత రెండేళ్లుగా రాణించలేక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నట్లు తెలిపారు. కోహ్లీ సపోర్ట్ ఇవ్వకపోతే ఏం చేయాలనే దానిపై కూడా తనకు స్పష్టత లేదని నగాల్ ఆనాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. 2019 ప్రారంభంలో ఒక టోర్నమెంట్ ముగిసిన తర్వాత కెనడా నుంచి జర్మనీకి విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు తన దగ్గర కేవలం ఆరు డాలర్లు మాత్రమే ఉన్నాయని ఆ ఇంటర్వ్యూలో నగాల్ తెలిపాడు. ఇంతకు ముందు కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నానని. కానీ, వాటి నుంచి ఎలాగోలా బయటపడ్డానని. పరిస్థితులు మెరుగుపడుతున్నాయని అన్నాడు. అథ్లెట్లకు నిధులు సమకూరిస్తే దేశంలో క్రీడారంగం అభివృద్ధి చెందుతుందని కూడా అన్నాడు. విరాట్ నుంచి మద్దతు పొందడం తన అదృష్టమని’సుమిత్ పేర్కొన్నాడు.
బబ్లిక్‌పై విజయంతో రూ.98 లక్షలు
ఆస్ట్రేలియా ఓపెన్‌లో పాల్గొనడానికి సుమిత్ క్వాలిఫికేషన్ మ్యాచ్‌లు ఆడాడు. మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి టోర్నీకి అర్హత సాధించడంతోపాటు దాదాపు రూ.65 లక్షలు సంపాదించాడు. తొలి రౌండ్‌లో బబ్లిక్‌పై విజయం సాధించడం ద్వారా రూ.98 లక్షలు సొంతం చేసుకున్నాడు. రెండో రౌండ్‌లో జున్‌చెంగ్ షాంగ్ చైనాతో తలపడనున్న సుమిత్.. ఈ మ్యాచ్‌లో గెలిస్తే దాదాపు 2,55,000 ఆస్ట్రేలియా డాలర్లు అంటే రూ. 1.40 కోట్లు దక్కించుకుంటాడు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion