(Source: ECI/ABP News/ABP Majha)
Hima das Suspended: హిమాదాస్‌పై నిషేధం! నాడా రూల్స్ ఉల్లంఘనే రీజన్
Hima das Suspended: అనతి కాలంలోనే పరుగుల రాణిగా గుర్తింపు పొందిన హిమాదాస్‌కు షాక్! నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) ఆమెపై ఏడాది వరకు నిషేధం విధించినట్టు తెలిసింది.
Hima das Suspended:
అనతి కాలంలోనే పరుగుల రాణిగా గుర్తింపు పొందిన హిమాదాస్‌కు షాక్! నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) ఆమెపై ఏడాది వరకు నిషేధం విధించినట్టు తెలిసింది. డోపింగ్ నిరోధక సంస్థ నియమాలను మూడు సార్లు ఉల్లంఘించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
సాధారణంగా అథ్లెట్లు టోర్నీలకు ముందు డోపింగ్ టెస్టులు చేయించుకోవాలి. టోర్నీలు లేనప్పుడు ప్రతి 90 రోజులకు ఒకసారి పరీక్ష చేయించుకోవాలి. ఇందుకు గంట సమయం పడుతుంది. ఇలా మూడు సార్లు పరీక్షలకు హాజరుకాకుంటే వేర్‌అబౌట్స్ ఫెయిల్యూర్ కింద చర్యలు తీసుకుంటారు. గరిష్ఠం రెండేళ్ల వరకు నిషేధం విధిస్తారు. కొన్ని సార్లు అప్పీల్ మేరకు లేదా తక్కువ తప్పు జరిగితే శిక్షను ఏడాదికి తగ్గిస్తారు.
'అవును, హిమాదాస్ ఒక ఏడాదిలో మూడు సార్లు పరీక్షలకు హాజరవ్వలేదు. ఆమెపై నాడా నిషేధం విధించింది' అని ఒక అధికారి పీటీఐకి సమాచారం ఇచ్చారు. ఆమెకు గరిష్ఠంగా రెండేళ్లు శిక్ష పడొచ్చన్నారు. చేసిన తప్పును బట్టి నిషేధాన్ని ఏడాదికి తగ్గించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
హిమాదాస్ 2028 జకార్తా ఏసియన్ గేమ్స్‌లో 400 మీటర్ల వ్యక్తిగత పరుగులో రజత పతకం గెలిచిన సంగతి తెలిసిందే. ఇదే టోర్నీలో స్వర్ణం గెలిచిన మహిళల 4x400 మీటర్లు, రజతం గెలిచిన మిక్స్‌డ్ 4x400 మీటర్ల రిలేలో ఆమె సభ్యురాలు. అయితే గాయం కారణంగా మరికొన్ని రోజుల్లో చైనాలోని హాంగ్జౌలో జరిగే ఆసియా క్రీడలకు వెళ్లడం లేదు.
అంతకు ముందు స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఆసియా క్రీడలకు దూరమైన సంగతి తెలిసిందే. గాయపడటంతో శస్త్ర చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 'నేను మీతో ఓ బాధాకరమైన వార్తను పంచుకుంటున్నాను. 2023, ఆగస్టు 13న ప్రాక్టీస్ చేస్తుండగా నా మోకాలు గాయపడింది. స్కానింగ్, పరీక్షలు నిర్వహించాక శస్త్రచికిత్స చేయడమే మార్గమని వైద్యులు తెలిపారు. ఆగస్టు 17న ముంబయిలో నేను శస్త్రచికిత్స చేయించుకుంటున్నాను. 2018లో జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో నేను పతకం సాధించాను. మళ్లీ దానిని రీటెయిన్ చేసుకోవాలన్నది నా లక్ష్యం. దురదృష్టవశాత్తు గాయపడటంతో టోర్నీ నుంచి తప్పుకుంటున్నాను' అని వినేశ్ ఫొగాట్ ఎక్స్ వేదికగా తెలిపింది.
'అభిమానులు నాకు ఇలాగే అండగా ఉండాలని కోరుకుంటున్నాను. అప్పుడే నేను ఘనంగా పునరాగమనం చేస్తాను. 2024 ప్యారిస్ ఒలింపిక్స్‌కు త్వరగా సన్నద్ధం అవుతాను. మీ మద్దతు నాకెంతో బలం ఇస్తుంది' అని వినేశ్ పేర్కొంది. ఇక బజరంగ్ పునియా సోనెపత్‌లోని నేవీ రాయపుర్ కేంద్రంలో శిక్షణ పొందుతున్నాడని తెలిసింది.
Also Read: మ్యాచ్ విన్నర్‌ను పక్కనబెట్టారు - టీమిండియా వరల్డ్ కప్ జట్టులో అతడు లేకపోవడంపై మాజీల విసుర్లు