అన్వేషించండి

Hasin Jahan: షమీ మంచి ఆటగాడే, కానీ ఆ విషయంలో కాదు - మాజీ భార్య  హసిన్ సంచలన వ్యాఖ్యలు

Hasin Jahan Comments on Shami: మహ్మద్ షమీ ప్రదర్శనపై ఆయన మాజీ భార్య హసిన్ జహాన్ మరోసారి విమర్శలు చేశారు. మహమ్మద్ షమీ మంచి వ్యక్తే అయితే.. తాము మంచి జీవితాన్ని గడిపేవాళ్లమని జహాన్ తెలిపారు.

Hasin Jahan Comments on Shami: వన్డే ప్రపంచకప్‌ (Cricket World Cup)లో దుమ్మరేపుతున్న టీమిండియా (Team India) స్టార్ బౌలర్ మహ్మద్ షమీ (Mohammad Shami) ప్రదర్శనపై ఆయన మాజీ భార్య హసిన్ జహాన్ (Hasin Jahan) మరోసారి విమర్శలు చేశారు. షమీ గురించి తరచుగా స్పందిస్తున్న జహాన్, తాజాగా తీవ్ర విమర్శలు చేశారు. మహమ్మద్ షమీ మంచి వ్యక్తే అయితే.. తాము మంచి జీవితాన్ని గడిపేవాళ్లమని జహాన్ అన్నారు. అతను మంచి వ్యక్తి అయితే తన కూతురు, తన భర్త, తాను సంతోషకరమైన జీవితాన్ని గడిపేవాళ్లమని పేర్కొన్నారు. 

షమీ మంచి ఆటగాడు మాత్రమే కాకుండా మంచి భర్త, మంచి తండ్రిగా కూడా ఉంటే అది మరింత గౌరవంగా ఉండేదని హసిన్ జహాన్ తెలిపారు. షమీ చేసిన తప్పులు, దురాశ, వ్యక్తిత్వం కారణంగా తాము ముగ్గురం పరిణామాలను ఎదుర్కోవలసి వచ్చిందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా.. షమీ దగ్గర చాలా డబ్బు ఉందని, దాని ద్వారా తన ప్రతికూల అంశాలను బయటకు రాకుండా దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని వ్యాఖ్యలు చేశారు.

న్యూజిలాండ్‌ (New Zealand)పై సెమీ ఫైనల్ (Semi Final) మ్యాచ్‌లో షమీ ఏడు వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. దీని గురించి స్పందించమని అడిగినప్పుడు.. షమీ ప్రదర్శన తనకు ప్రత్యేకంగా ఏమీ అనిపించ లేదన్నారు. అయితే సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడం విశేషం అన్నారు. ఫైనల్‌లోనూ భారత్‌ విజయం సాధించాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఇటీవల రాజకీయాల్లోకి వచ్చిన పాయల్ ఘోష్ విషయంపై స్పందిస్తూ.. సెలబ్రిటీల విషయంలో ఇలాంటివి తరచు జరుగుతూనే ఉంటాయని, ఇది సాధారణమైనదని, దానిపై తాను వ్యాఖ్యానించదలుచుకోలేదని తెలిపారు. 

ప్రపంచ కప్‌లో షమీ అత్యుత్తమ ప్రదర్శన ఇస్తున్నారు. మొదటి నాలుగు మ్యాచ్‌ల్లో ఆడకపోయినా, వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. బంతితో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటి వరకు 23 వికెట్లు పడగొట్టారు. 

ఇద్దరి మధ్య విభేదాలు
షమీకి వివాహేతర సంబంధం ఉందంటూ హసీన్ జహాన్ ఆరోపించారు. 2018 మార్చి 7న ఆమె విడుదల చేసిన స్క్రీన్‌షాట్లు సంచలం అయ్యాయి. హసీన్ ఆరోపణలను షమీ ఖండించారు. కెరీర్ ను నాశనం చేయటానికే తన భార్య కుట్ర పన్నిందని ఆరోపించాడు. షమీపై అతడిపై లైంగిక వేధింపులు, గృహహింస ఆరోపణలు చేసింది. షమీకి నాన్ బెయిల్‌బుల్ ఛార్జీలను విధించారు. తనను షమీతో పాటు అతడి కుటుంబ సభ్యులు తీవ్రంగా వేధించారని ఆరోపించింది.

తాను ఉత్తరప్రదేశ్‌లోని పుట్టించికి ఎప్పుడు వెళ్లినా హింసించే వారని ఫిర్యాదులో పేర్కొంది. కావాలంటే షమీ ఇరుగుపొరుగువారినైనా అడగండని తెలిపింది. అలాగే షమీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడంటూ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో బీసీసీఐ షమీ కాంట్రాక్ట్‌ను పెండింగ్‌ పెట్టింది. మ్యాచ్‌ఫిక్సింగ్ ఆరోపణలు అబద్ధమని తేల్చి బీసీసీఐ కాంట్రాక్ట్‌ను తిరిగి కొనసాగించింది. 

షమీతో వివాహం జరగానికి ముందు అతని భార్య హసీన్ జహాన్.. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు చీర్‌గాళ్‌గా పనిచేసింది. ఆ సమయంలో షమీతో పరిచయం పెళ్లికి దారి తీసింది. 2014లో షమీని పెళ్లాడిన అనంతరం హసీన్ మోడలింగ్‌కు గుడ్ బై చెప్పింది. 2018లో ఐపీఎల్‌కు ముందే వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే షమీ నుంచి హసీనా దూరంగా ఉంటూ కేసులు పెట్టింది.  

నెలకు రూ.10 లక్షలు డిమాండ్
షమీ నుంచి విడిపోవాలనుకుంటున్నానని, తనకు నెలవారీ భరణం ఇప్పించాలని హసీన్ జహాన్ కోర్టును ఆశ్రయించింది. తనకు నెలవారీ ఖర్చుల కింద రూ.10 లక్షల షమీని ఇప్పించాల్సిందిగా తన పిటిషన్‌లో పేర్కొంది. ఇందులో రూ.7 లక్షలు తన వ్యక్తిగత ఖర్చుల కోసం కాగా.. రూ.3 లక్షలు తన కూతురు నిర్వహణ కోసం ఇప్పించాల్సిందికి కోరింది. కానీ న్యాయస్థానం రూ.50 వేలు భరణంతో సరిపెట్టింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget