GT vs CSK IPL 2023: మొదటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన హార్దిక్ - బౌలింగ్‌కే మొగ్గు!
ఐపీఎల్ 2023 మొదటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఐపీఎల్ పండగ ప్రారంభం అయిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతున్న తొలి మ్యాచ్‌లో గుజరాత్ టాస్ గెలిచింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. హార్దిక్ కాయిన్‌ను గాల్లోకి ఎగరేశాడు. ధోని హెడ్స్ ఎంచుకున్నాడు. కానీ టెయిల్స్ పడింది. దీంతో టాస్ గుజరాత్‌కు దక్కింది.
గుజరాత్ టైటాన్స్ తుది జట్టు
వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్, కేన్ విలియమ్సన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, జాషువా లిటిల్, యశ్ దయాల్, అల్జారీ జోసెఫ్
సబ్‌స్టిట్యూట్స్ (వీరిలో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకోవచ్చు)
ఆర్ సాయి సుదర్శన్, జయంత్ యాదవ్, మోహిత్ శర్మ, అభినవ్ మనోహర్, శ్రీకర్ భరత్
చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు
డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, రాజ్‌వర్ధన్ హంగర్గేకర్
సబ్‌స్టిట్యూట్స్ (వీరిలో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకోవచ్చు)
తుషార్ దేశ్‌పాండే, సుభ్రంషు సేనాపతి, షేక్ రషీద్, అజింక్య రహానే, నిషాంత్ సంధు
ఈ లీగ్‌లో అత్యంత అనుభవం ఉన్న జట్టు చెన్నై సూపర్ కింగ్స్. దాదాపు ప్రతి సీజన్‌లోనూ చెన్నై ప్రదర్శన అద్భుతంగా ఉంది.
ఐపీఎల్ టోర్నమెంట్‌లో రెండు సీజన్‌లు మినహా ప్రతి సీజన్‌లో CSK ప్లేఆఫ్‌లకు చేరుకుంది. దీంతోపాటు రెండు సీజన్లలో టోర్నీలో ఆడలేదు. కాగా సురేష్ రైనా అందుబాటులో లేని రెండు సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్‌కు చేరుకోలేదు.
సురేష్ రైనా ఐపీఎల్ తొలి సీజన్ లోనే అరంగేట్రం చేశాడు. అరంగేట్రం మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై వేగంగా బ్యాటింగ్ చేసి వార్తల్లో నిలిచాడు. రైనా కేవలం 13 బంతుల్లోనే మూడు సిక్సర్లు, రెండు ఫోర్ల సాయంతో 32 పరుగులు చేశాడు. అప్పటి నుండి సురేష్ రైనా మంచి ప్రదర్శనను కొనసాగించాడు. అందుకే రైనాకు 'మిస్టర్ ఐపీఎల్' అనే పేరు వచ్చింది.
ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సురేష్ రైనా జట్టులో ఉన్నప్పుడల్లా చెన్నై ప్లేఆఫ్‌కు చేరుకుంది. కానీ అతను జట్టులో రెండు సీజన్లు భాగం కాలేదు. ఆ రెండు సీజన్లలోనూ చెన్నై ప్లేఆఫ్‌కు చేరుకోలేకపోయింది.
2008 నుండి 2015 వరకు ఆడిన ప్రతి సీజన్‌లో చెన్నై ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఈ సమయంలో సురేష్ రైనా జట్టులో భాగమయ్యాడు. అయితే ఆ తర్వాత చెన్నై మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగా రెండేళ్ల నిషేధానికి గురైంది. CSK 2016, 2017లో IPLలో భాగం కాలేదు. దీని తర్వాత అతను తిరిగి వచ్చాడు. 2018, 2019లో చెన్నై ప్లేఆఫ్స్‌కు చేరుకుంది.
కానీ ఆ తర్వాత 2020 సంవత్సరంలో సురేష్ రైనా జట్టులో భాగం కాలేదు. చెన్నై సూపర్ కింగ్స్ కూడా అప్పుడు ప్లేఆఫ్‌కు చేరుకోలేకపోయింది. దీని తర్వాత 2021లో రైనా తిరిగి వచ్చిన తర్వాత జట్టు మళ్లీ ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. కానీ 2022లో మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్‌లో సురేష్ రైనా జట్టులో భాగం కాలేదు. ఈ సీజన్‌లో చెన్నై కూడా ప్లేఆఫ్స్‌కు చేరలేదు. ఇప్పటి వరకు సురేష్ రైనా ఐపీఎల్‌లో 205 మ్యాచ్‌లు ఆడి 5528 పరుగులు చేశాడు.