అన్వేషించండి

Googles Year In Search 2023 : 2023 లో గూగుల్‌ అత్యధికంగా వెతికిన అథ్లెట్లు వీళ్లే, రోహిత్‌, కోహ్లీకి దక్కని స్థానం

Google's Year In Search 2023, Sports: సెర్చ్‌ ఇంజన్‌ దిగ్గజం గూగుల్... 2023లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్‌ చేసిన టాప్ టెన్‌ అథ్లెట్ల జాబితాను వెల్లడించింది.

ఇంట‌ర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్(Google) 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా  సెర్చ్‌ ఇంజన్‌ దిగ్గజం గూగుల్... 2023లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్‌ చేసిన టాప్ టెన్‌ అథ్లెట్ల జాబితాను వెల్లడించింది. ఈ జాబితాలో ఫుట్‌ బాల్‌ స్టార్లు క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీ వంటి పేర్లు లేకపోవడం విశేషం. భారత క్రికెట్‌ స్టార్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ పేర్లు కూడా ఈ టాప్‌ టెన్‌ జాబితాలో లేవు. అయితే టీమిండియా సూపర్‌ ఓపెనర్‌ శుభమన్‌ గిల్‌... గూగుల్‌లో సెర్చ్‌ చేసిన టాప్ టెన్‌ అథ్లెట్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. గత ఏడాది భీకర ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్‌గిల్‌ ఆ ఏడాది అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు. గిల్ ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర 2023లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా గూగుల్ చేసిన అథ్లెట్ల జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచాడు.

2023లో అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్‌ చేసిన టాప్ టెన్‌ అథ్లెట్లు:
1) డమర్ హామ్లిన్ 
2)  కైలియన్ ఎంబాపె
3) ట్రావిస్ కెల్సే 
4)  జా మోరాంట్ 
5)  హ్యారీ కేన్ 
6)  నోవాక్ జకోవిచ్ 
7)  కార్లోస్ అల్కరాజ్ 
8) రచిన్ రవీంద్ర 
9) శుభమన్ గిల్
10)  కైరీ
గత నెలలో భారత్‌ వేదికగా ముగిసిన ప్రపంచకప్‌లో విరాట్‌ కోహ్లీ అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అద్భుత ఆటతీరుతో ఆ మెగా టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నవ చరిత్ర లిఖించాడు. సచిన్‌‌కు దరిదాపుల్లో నిలిచే బ్యాటర్ రావడం కష్టమని క్రీడా పండితులు తేల్చేశాక తానున్నానని దూసుకొచ్చిన విరాట్‌ కింగ్‌ కోహ్లీ... ఆ క్రికెట్‌ దేవుడి రికార్డును సగర్వంగా దాటేశాడు. ప్రపంచకప్‌ సెమీఫైనల్లో తీవ్ర ఒత్తిడిలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ అద్భుత శతకంతో సచిన్‌ రికార్డును అధిగమించేశాడు. సచిన్‌ సృష్టించిన రికార్డులను తన పరుగుల ప్రవాహంతో బద్దలు కొట్టిన కోహ్లీ వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్‌ టెండూల్కర్‌ రికార్డును కూడా తిరగరాసి తన పేరిట లిఖించుకున్నాడు. ఇదే ప్రపంచకప్‌లో సచిన్‌ 49 వన్డే సెంచరీల రికార్డును సమం చేసిన కోహ్లీ... 50 సెంచరీలతో దానిని అధిగమించాడు. తాను ఎంతటి గొప్ప ఆటగాడినో మరోసారి క్రికెట్‌ ప్రపంచానికి చాటి చెప్పాడు. డిసెంబర్‌ నెలకు గానూ ప్రముఖ మ్యాగజైన్ ఔట్‌లుక్ బిజినెస్ రూపొందించిన ఛేంజర్ మేకర్స్-2023 జాబితాలో విరాట్‌ కోహ్లీకి చోటు దక్కింది. భారత్‌లో అత్యంత ప్రభావవంతంగా మార్పు తీసుకురాగల వ్యక్తులతో ఔట్‌ లుక్‌ బిజెనెస్‌ ఈ జాబితా రూపొందించగా అందులో కోహ్లీకి స్థానం దక్కింది.  

అత్యధిక మంది వెతికిన ఆటగా ఫుట్‌బాల్‌ నిలిచింది. పోర్చుగల్‌ స్టార్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడు, లెజెండ్‌ క్రిస్టియానో రొనాల్డో తాజాగా ప్రొఫెష‌న‌ల్ ఫుట్‌బాల్‌లో 1200వ మ్యాచ్ ఆడిన ఆటగాడిగా నూతన చరిత్ర సృష్టించాడు. ఆల్ న‌స్రీ క్లబ్ త‌ర‌ఫున ఆడుతున్న రొనాల్డో సౌదీ ప్రో లీగ్‌లో ఈ ఘనత సాధించాడు. అల్ రియాద్‌తో జరిగిన మ్యాచ్‌తో 1200 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌ ద్వారా అత్యధిక ఫుట్‌బాల్‌ ప్రొఫెష‌న‌ల్ మ్యాచ్‌లు ఆడిన రెండో ఆట‌గాడిగా క్రిస్టియానో రొనాల్డో రికార్డు నెల‌కొల్పాడు. అంతేకాదు  క్రిస్టియానో రొనాల్డో రాక ముందు అల్‌-నాసర్‌ జట్టు ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య కేవలం 8.6 లక్షలు మాత్రమే. కనీసం మిలియన్‌ కూడా లేదు. కానీ, డీల్‌ జరిగిన నాటి నుంచి దాని ఇన్‌స్టాగ్రామ్‌కు ఫాలోవర్ల సునామీ మొదలైంది. ఆ సంఖ్య మిలియన్లలో పెరుగుతోంది. డీల్‌ జరిగిన 48 గంటల్లో దాదాపు 30 లక్షలకు చేరగా.. 72 గంటల్లో అది 78 లక్షలకు ఎగబాకింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Politics: మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
KTR On HCU: హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
HCA : ఐపీఎల్ టిక్కెట్ల గోల్‌మాల్ - పోలీసులకే ఇస్తున్నామని ప్రచారం - విజిలెన్స్ డీజీ లెక్క తేల్చేశారా ?
ఐపీఎల్ టిక్కెట్ల గోల్‌మాల్ - పోలీసులకే ఇస్తున్నామని ప్రచారం - విజిలెన్స్ డీజీ లెక్క తేల్చేశారా ?
 IPL 2025 KKR VS CSK Result Update: సీఎస్కే ఘోర పరాభవం.. 8 వికెట్లతో కేకేఆర్ చేతిలో చిత్తు.. సునీల్ నరైన్ ఆల్ రౌండ్ షో
సీఎస్కే ఘోర పరాభవం.. 8 వికెట్లతో కేకేఆర్ చేతిలో చిత్తు.. సునీల్ నరైన్ ఆల్ రౌండ్ షో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs KKR Match Highlights IPL 2025 | చెన్నై పై 8వికెట్ల తేడాతో కేకేఆర్ గ్రాండ్ విక్టరీ | ABP DesamCSK vs KKR Match Preview IPL 2025 | KKR తో మ్యాచ్ నుంచి CSK కెప్టెన్ గా ధోని | ABP DesamRCB Home Ground Sad Story IPL 2025 | సొంత మైదానంలోనే ఆర్సీబీకి షాకులుKL Rahul 93* vs RCB IPL 2025 | కేఎల్ రాహుల్ మాస్ ఇన్నింగ్స్ కు అసలు రీజన్ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Politics: మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
KTR On HCU: హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
HCA : ఐపీఎల్ టిక్కెట్ల గోల్‌మాల్ - పోలీసులకే ఇస్తున్నామని ప్రచారం - విజిలెన్స్ డీజీ లెక్క తేల్చేశారా ?
ఐపీఎల్ టిక్కెట్ల గోల్‌మాల్ - పోలీసులకే ఇస్తున్నామని ప్రచారం - విజిలెన్స్ డీజీ లెక్క తేల్చేశారా ?
 IPL 2025 KKR VS CSK Result Update: సీఎస్కే ఘోర పరాభవం.. 8 వికెట్లతో కేకేఆర్ చేతిలో చిత్తు.. సునీల్ నరైన్ ఆల్ రౌండ్ షో
సీఎస్కే ఘోర పరాభవం.. 8 వికెట్లతో కేకేఆర్ చేతిలో చిత్తు.. సునీల్ నరైన్ ఆల్ రౌండ్ షో
AP Intermediate Results 2025: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలు వాట్సాప్‌లో ఎలా తెలుసుకోవాలి?
ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలు వాట్సాప్‌లో ఎలా తెలుసుకోవాలి?
Vontimitta SeetharRama Kalyanam: ఒంటిమిట్టలో కన్నుల పండుగగా రాములోరి కల్యాణం.. రామరాజ్యం తెస్తానన్న చంద్రబాబు
ఒంటిమిట్టలో కన్నుల పండుగగా రాములోరి కల్యాణం.. రామరాజ్యం తెస్తానన్న చంద్రబాబు
Fact Check :తత్కాల్ టికెట్ల బుకింగ్ టైమింగ్ మార్చలేదు - ఫేక్ వార్తలు నమ్మొద్దు : రైల్వే క్లారిటీ
తత్కాల్ టికెట్ల బుకింగ్ టైమింగ్ మార్చలేదు - ఫేక్ వార్తలు నమ్మొద్దు : రైల్వే క్లారిటీ
TG TET Schdule: తెలంగాణ టెట్-2025 పరీక్షల షెడ్యూల్ విడుద‌ల‌, వివరాలు ఇలా
తెలంగాణ టెట్-2025 పరీక్షల షెడ్యూల్ విడుద‌ల‌, వివరాలు ఇలా
Embed widget