News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

IPL 2022: మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తానంటున్న గౌతమ్‌ గంభీర్‌! 5000 మంది కోసం..!

Gautam Gambhir: ప్రతి నెలా తాను 5000 మందికి అన్నం పెడుతున్నానని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) అంటున్నాడు. వారి కడుపు నింపేందుకు...

FOLLOW US: 
Share:

Gautam Gambhir reveals Selfless Act says no shame working in IPL because I feed 5000 people – Watch video : ప్రతి నెలా తాను 5000 మందికి అన్నం పెడుతున్నానని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) అంటున్నాడు. వారి కడుపు నింపేందుకు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో (IPL) పనిచేస్తే తప్పేంటని ప్రశ్నించాడు. కామెంటరీ చేయడం, మెటార్‌గా పనిచేసేందుకు సిగ్గుపడనని వెల్లడించాడు. ఐపీఎల్‌లో పనిచేయడంపై అతడు మాట్లాడిన వీడియో తాజాగా వైరల్‌ అయింది.

ఈ మధ్యే గౌతమ్‌ గంభీర్‌ మీడియాతో మాట్లాడాడు. సమాజానికి తాను చేస్తున్న సేవల గురించి వివరించాడు. 5000 మందికి అన్నం పెట్టే బాధ్యతను తాను తీసుకున్నానని పేర్కొన్నాడు. ఇందుకు ప్రతి నెలా రూ.25 లక్షలు ఏటా రూ.2.75 కోట్లు ఖర్చవుతుందని వెల్లడించాడు. అందుకే ఐపీఎల్‌లో కామెంటరీ, ఇతర పనులు చేసి నిజాయతీగా సంపాదిస్తున్నానని స్పష్టం చేశాడు. కష్టపడి సంపాదించిన డబ్బే ఉపయోగిస్తున్నాను కాబట్టి తానేమీ సిగ్గుపడటం లేదన్నాడు.

'నేను ఐపీఎల్‌లో పనిచేస్తాను. ఎందుకంటే 5000 మంది కడుపు నింపేందుకు ఏటా రూ.2.75 కోట్లు ఖర్చు చేయాలి. ఈ డబ్బంతా నా జేబులోంచే ఇస్తాను. అందుకే ఐపీఎల్‌లో పనిచేస్తానని చెప్పేందుకు సిగ్గుపడను. నా అత్యున్నత లక్ష్యాల కోసమే ఇదంతా చేస్తాను. ఉచిత భోజనశాలలు, గ్రంథాలయాలు, స్మాగ్‌ టవర్లు నిర్మించేందుకు నిజాయతీగా సంపాదించిన డబ్బు ఖర్చు చేయడం తప్పైతే నేను మళ్లీ మళ్లీ ఇదే తప్పు చేస్తాను' అని వివరించాడు.

టీమ్‌ఇండియా క్రికెటర్‌గా గౌతమ్‌ గంభీర్‌ ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. ఆ తర్వాత తన దృక్పథానికి అనుకూలంగా ఉన్న బీజేపీలో చేరాడు. లోక్‌సభకు ఎన్నికయ్యాడు. సైన్యం, పేదవారికి ఇబ్బంది కలిగితే ఊరుకోడు. తనకు తోచిన సాయం చేసేందుకు ముందుకొస్తాడు. రెండేళ్ల క్రితం జమ్ము కశ్మీర్‌లో జవాన్లు ప్రమాదానికి గురైతే వారి కుటుంబాల బాధ్యతను తీసుకున్నాడు. వారి పిల్లలను చదివిస్తూ అన్నం పెడుతున్నాడు. కరోనా సమయంలోనూ ఆరోగ్య కిట్లు, నిత్యావసర సరుకులు, ఔషధాలను ఉచితంగా పంచాడు. తాజాగా అతడు లక్నో సూపర్‌ జెయింట్స్‌కు మెంటార్‌గా సేవలు అందించాడు.

Published at : 04 Jun 2022 06:04 PM (IST) Tags: IPL Viral video IPL 2022 Gautam Gambhir Selfless Act

ఇవి కూడా చూడండి

Jasprit Bumrah: హార్దిక్‌ పాండ్యా రాకతో బుమ్రా అసహనం! ముంబై ఇండియన్స్‌లో ఏం జరుగుతోంది?

Jasprit Bumrah: హార్దిక్‌ పాండ్యా రాకతో బుమ్రా అసహనం! ముంబై ఇండియన్స్‌లో ఏం జరుగుతోంది?

Pat Cummins: మరవను, మర్చిపోలేను- విరాట్‌ వికెట్టే బౌలర్ కెరీర్ లో అద్భుత క్షణం

Pat Cummins: మరవను, మర్చిపోలేను- విరాట్‌ వికెట్టే బౌలర్ కెరీర్ లో అద్భుత క్షణం

IPL 2024: నాకూ ఐపీఎల్‌ ఆడాలని ఉంది, పాక్‌ క్రికెటర్‌ మనసులో మాట

IPL 2024: నాకూ ఐపీఎల్‌ ఆడాలని ఉంది, పాక్‌ క్రికెటర్‌ మనసులో మాట

India vs Australia 3rd T20 : సిరీస్‌పై యువ టీమిండియా కన్ను, ఆసిస్‌ పుంజుకుంటుందా..?

India vs Australia 3rd T20 : సిరీస్‌పై యువ టీమిండియా కన్ను,  ఆసిస్‌ పుంజుకుంటుందా..?

Virat Kohli : ముఖానికి గాయాలతో కోహ్లీ పోస్ట్‌ , సోషల్‌ మీడియాలో వైరల్‌

Virat Kohli : ముఖానికి గాయాలతో కోహ్లీ పోస్ట్‌ , సోషల్‌ మీడియాలో వైరల్‌

టాప్ స్టోరీస్

Telangana Elections 2023 : కేటీఆర్ ప్రచార వ్యూహాలతో బీఆర్ఎస్ దూకుడు - అంతా తానై నడిపించిన వర్కింగ్ ప్రెసిడెంట్ !

Telangana Elections 2023 :  కేటీఆర్ ప్రచార వ్యూహాలతో బీఆర్ఎస్ దూకుడు - అంతా తానై నడిపించిన వర్కింగ్ ప్రెసిడెంట్ !

Mansoor Ali Khan: పార్టీ పెట్టి కోట్లు సంపాదించారు, పేదల కోసం పైసా ఖర్చు చేయలేదు - చిరంజీవిపై మన్సూర్ అలీ తీవ్ర వ్యాఖ్యలు

Mansoor Ali Khan: పార్టీ పెట్టి కోట్లు సంపాదించారు, పేదల కోసం పైసా ఖర్చు చేయలేదు - చిరంజీవిపై మన్సూర్ అలీ తీవ్ర వ్యాఖ్యలు

Telangana Elections Holiday: పోలింగ్ రోజు సెలవు ఇవ్వని కంపెనీలపై చట్ట ప్రకారం చర్యలు: సీఈవో వికాస్‌ రాజ్‌

Telangana Elections Holiday: పోలింగ్ రోజు సెలవు ఇవ్వని కంపెనీలపై చట్ట ప్రకారం చర్యలు: సీఈవో వికాస్‌ రాజ్‌

Aishwarya Marriage: రెండో పెళ్లికి హీరో కుమార్తె రెడీ - దర్శకుడితో ఐశ్వర్య ప్రేమ!

Aishwarya Marriage: రెండో పెళ్లికి హీరో కుమార్తె రెడీ - దర్శకుడితో ఐశ్వర్య ప్రేమ!