French Open: పీవీ సింధుకు షాక్! టకహాషి చేతిలో పోరాడి ఓడిన ఒలింపిక్ విజేత!
ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లో పీవీ సింధు ఓటమి పాలైంది. జపాన్ షట్లర్ సయాకా టకహాషి చేతిలో పోరాడి ఓడింది. మూడు గేముల ఈ పోరు గంటా ఎనిమిది నిమిషాలు సాగింది.
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు చుక్కెదురైంది! ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లో ఓటమి పాలైంది. జపాన్ షట్లర్, అన్‌సీడెడ్ సయాకా టకహాషి చేతిలో 21-18, 16-21, 12-21 తేడాతో పోరాడి ఓడింది. ఫైనల్ చేరేందుకు సింధు శాయశక్తులా శ్రమించింది. కానీ ప్రత్యర్థి మెరుగ్గా ఆడి విజయం అందుకుంది. గంటా ఎనిమిది నిమిషాల పాటు సాగిన ఈ పోరాటంలో ఇద్దరు షట్లర్లు ఒకరిపై మరొకరు ఆధిపత్యం చాటారు.
తొలి గేమ్‌లో ఇద్దరు ప్రత్యర్థులు నువ్వా నేనా అన్నట్టు తలపడ్డారు. విరామ సమయానికి టకహాషి 11-10తో కాస్త ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ క్రమంలో సింధు 16-16తో స్కోరు సమం చేసింది. ఆపై వరుసగా రెండు పాయింట్లు సాధించింది. తెలివిగా ఆడి గేమ్ గెలిచింది.
రెండో గేమ్ ఆరంభంలో సింధు వేగంగా పాయింట్లు సాధించింది. రెండు పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే తెలివిగా ఆడిన టకహాషి గేమ్ విరామానికి 14-18తో పుంజుకుంది. వేగంగా క్రాస్ కోర్టు షాట్లు ఆడుతూ వరుసగా పాయింట్లు సాధించి 21-16తో గేమ్ గెలిచింది. ఇక ఆఖరి గేములో టకహాషి దుమ్మురేపింది. అలసిపోయిన సింధును కోర్టంతా తిప్పించింది. 6-6 వద్ద ఇద్దరు స్కోరు సమమైనా.. ఆపై టకహాషి ఎక్కడా ఆగలేదు. వరుసగా పాయింట్లు సాధించి 21-12తో గేమ్‌తో పాటు మ్యాచును గెలిచింది.
Also Read: IPL 2022 Retention Rules: కొత్త రూల్స్ ఇవే! ఐపీఎల్ జట్లు ఎంతమందిని అట్టిపెట్టుకోవచ్చంటే..?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
🆃🅷🆁🅾🆄🅶🅷 🆃🅷🅴 🅻🅴🅽🆂
— BWF (@bwfmedia) October 30, 2021
YONEX French Open 2021 - Day 4️⃣#BWFWorldTour #FrenchOpen2021 #RaiseARacket 🏸
📸 @badmintonphoto pic.twitter.com/JK5yNjf9Vd
— BWF (@bwfmedia) October 30, 2021