అన్వేషించండి

Mexico World Cup Magic:  మెక్సికో వీరవిహారం.. ఈక్వెడార్ ను క్రష్ చేస్తూ 40 ఏళ్ల తర్వాత నాకౌట్ లో గెలుపు, ఫ్యాన్స్ కు పూనకాలు!

మెక్సికో తమ హోమ్ గ్రౌండ్ లో ఈక్వెడార్ ను 2-0 తో చిత్తు చేసి 40 ఏళ్ల తర్వాత ఫిఫా వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్ లో అఫీషియల్ గా విక్టరీ కొట్టింది.

Mexico Defeats Ecuador To Break Knockout Curse:  ఫిఫా వరల్డ్ కప్ 2026 రౌండ్ ఆఫ్ 32 నాకౌట్ మ్యాచ్ లో కో-హోస్ట్ మెక్సికో సంచలన విజయం సాధించింది. మంగళవారం తమ ఐకానిక్ అజ్టెకా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో ఈక్వెడార్ ను 2-0 తేడాతో ఊచకోత కోసింది. ఈ బిగ్ విక్టరీతో మెక్సికో ఏకంగా 40 ఏళ్ల నాకౌట్ శాపాన్ని బద్దలు కొట్టింది. లాస్ట్ టైమ్ మెక్సికో 1986 లో తాము వరల్డ్ కప్ ఆర్గనైజ్ చేసినప్పుడు మాత్రమే నాకౌట్ మ్యాచ్ లో గెలిచింది, ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఆ మ్యాజిక్ రిపీట్ అయింది. తుఫాను వాతావరణం వల్ల మ్యాచ్ ఒక గంట లేట్ గా స్టార్ట్ అయినప్పటికీ హోమ్ టీమ్ ప్లేయర్లు గ్రౌండ్ లోకి రాగానే అటాకింగ్ గేమ్ తో ఈక్వెడార్ ను వణికించారు.

జూలియన్  సూపర్ గోల్.. రావుల్ జిమెనెజ్ రాకెట్ షాట్
మ్యాచ్ స్టార్టింగ్ నుంచే మెక్సికో ఫుల్ డామినేషన్ చూపించింది. 17 ఏళ్ల వండర్ కిడ్ గిల్బెర్టో మోరా ఈ మ్యాచ్ ప్లేయింగ్ ఎలెవన్ లో ఛాన్స్ దక్కించుకుని, 1958 లో పీలే తర్వాత వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్ లో ఆడిన సెకండ్ యంగెస్ట్ ప్లేయర్‌గా హిస్టరీ క్రియేట్ చేశాడు. మ్యాచ్ 22వ నిమిషంలో రోబెర్టో అల్వరాడో ఇచ్చిన పాస్ ను అందుకున్న జూలియన్ క్వినోన్స్ లెఫ్ట్ వింగ్ నుంచి దూసుకెళ్లి ఈక్వెడార్ కీపర్ హెర్నాన్ గాలిండెజ్ ను దాటించి ఒక మైండ్ బ్లోయింగ్ గోల్ కొట్టాడు. దీంతో స్టేడియం అంతా ఫ్యాన్స్ అరుపులతో హోరెత్తిపోయింది. ఆ తర్వాత 30వ నిమిషంలో జూలియ‌న్ ఇచ్చిన అద్భుతమైన అసిస్ట్ తో ఫుల్హామ్ స్ట్రైకర్ రావుల్ జిమెనెజ్ బాల్ ను టాప్ కార్నర్ లోకి రాకెట్ లా పంపి మెక్సికోకు 2-0 లీడ్ ఇచ్చాడు.

Read Also: FIFA Shootout Drama: ఫిఫా వరల్డ్ కప్‌లో పెనాల్టీల ఊచకోత.. పరాగ్వే చేతిలో జర్మనీ ఔట్, నెదర్లాండ్స్ ను దెబ్బకొట్టిన మొరాకో!

క్లీన్ షీట్ తో మెక్సికో సరికొత్త రికార్డ్
సెకండ్ హాఫ్ లో ఈక్వెడార్ కోచ్ సెబాస్టియన్ బెక్కాసెక్ చాలా చేంజెస్ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. మెక్సికో డిఫెండర్ సీజర్ మోంటెస్. ఈక్వెడార్ అటాక్ ను పక్కాగా బ్లాక్ చేశాడు. ఈక్వెడార్ ప్లేయర్ జాన్ యెబోవా కొట్టిన కొన్ని షాట్లను మెక్సికో కీపర్ రావుల్ రాంజెల్ సూపర్ సేవ్స్ తో అడ్డుకున్నాడు. ఈ టోర్నీలో ఫ్రాన్స్, అర్జెంటీనాలతో పాటు గ్రూప్ స్టేజ్ లో ఆడిన మూడు మ్యాచులూ గెలిచిన ఏకైక థర్డ్ టీమ్ మెక్సికో కావడం విశేషం, పైగా ఇప్పటివరకు ఒక్క గోల్ కూడా సమర్పించుకోకుండా క్లీన్ షీట్ మెయింటైన్ చేస్తోంది. మ్యాచ్ లాస్ట్ మినిట్స్ లో ఈక్వెడార్ ప్లేయర్ పీరో హింకాపీ అంపైర్ తో గొడవపడి రెడ్ కార్డ్ తెచ్చుకోవడంతో వారి కథ కంప్లీట్‌గా ముగిసింది.

రౌండ్ ఆఫ్ 16 లో ఇంగ్లాండ్ తో ఫైట్.. క్వార్టర్స్ నుంచి అమెరికాలోనే మ్యాచ్ లు
అజ్టెకా స్టేడియంలో ఆడిన లాస్ట్ 10 వరల్ڈ కప్ మ్యాచుల్లో మెక్సికోకు ఇప్పటివరకు ఓటమనేదే లేదు. 1970, 1986 వరల్డ్ కప్ ఫైనల్స్ కు హోస్ట్ గా ఉన్న ఈ గ్రౌండ్ సెంటిమెంట్ ఆదివారం జరగబోయే రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ లోనూ తమను గెలిపిస్తుందని మెక్సికో ఫ్యాన్స్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. నెక్స్ట్ రౌండ్ లో ఇంగ్లాండ్ లేదా డీఆర్ కాంగో టీమ్ తో మెక్సికో తలపడనుంది. క్వార్టర్ ఫైనల్స్ నుంచి జరగబోయే వరల్డ్ కప్ మ్యాచ్ లన్నీ కంప్లీట్‌గా యునైటెడ్ స్టేట్స్ (అమెరికా) లోనే జరగబోతున్నాయని, కాబట్టి హోమ్ గ్రౌండ్ లో ఆడే లాస్ట్ మ్యాచ్ లో ఈక్వెడార్ ను దెబ్బకొట్టడం చాలా హ్యాపీగా ఉందని మెక్సికో ఫ్యాన్స్ అంటున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Kolkata Stampede: కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
BJP Candidates List: ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kolkata Stampede: కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
BJP Candidates List: ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
AP Elections: నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలినికి ఫుల్ కోంటింగ్! నీతూకి చీవాట్లు! త్రిగుణ్ దెబ్బకి ఏడ్చేసిన రోహిత్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలినికి ఫుల్ కోంటింగ్! నీతూకి చీవాట్లు! త్రిగుణ్ దెబ్బకి ఏడ్చేసిన రోహిత్!
Jio Platforms IPO: జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్
జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Embed widget