అన్వేషించండి
FIFA WC 2022: ట్యునీషియాపై ఆస్ట్రేలియా విక్టరీ - మ్యాచ్‌లో నమోదైన రికార్డులు ఇవే!
2022 ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌లో ట్యునీషియాపై ఆస్ట్రేలియా 1-0తో విజయం సాధించింది.
గోల్ కొట్టిన ఆనందంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు
FIFA వరల్డ్ కప్ 2022లో ట్యునీషియాతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 1-0 తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా రౌండ్ ఆఫ్ 16 లోకి వెళ్లాలనే ఆశను నిలుపుకుంది.ఇక ఈ ఓటమితో ట్యునీషియా ప్రపంచకప్ ప్రయాణం దాదాపుగా ముగిసినట్లే. ఈ మ్యాచ్‌కి సంబంధించిన కొన్ని ప్రత్యేక విషయాలను తెలుసుకుందాం.
- ఫిఫా ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా సాధించిన మూడు విజయాలు వివిధ ఖండాల (ఆసియా, యూరప్, ఆఫ్రికా) జట్లపైనే వచ్చాయి. దీంతో అల్జీరియా, ఇరాన్‌ల సరసన ఆస్ట్రేలియా నిలిచింది.
- ప్రపంచ కప్‌లో ట్యునీషియా 53% మ్యాచ్‌లలో స్కోర్ చేయడంలో విఫలమైంది (9/17). అయితే 1998 తర్వాత టోర్నమెంట్‌లో తమ తొలి రెండు మ్యాచ్‌ల్లో స్కోర్ చేయడంలో విఫలమవడం ఇది రెండోసారి మాత్రమే.
- 2022 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా తమ రెండు మ్యాచ్‌లలో మొదటి గోల్ చేసింది. వారు గత 16 ప్రపంచకప్ మ్యాచ్‌లలో కేవలం రెండింటిలో మాత్రమే 1-0 ఆధిక్యంలో ఉన్నారు.
- ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా సాధించిన 15 గోల్స్‌లో తొమ్మిదిటిని 30 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల ఆటగాళ్లు సాధించారు. పోటీలో ఒకటి కంటే ఎక్కువసార్లు స్కోర్ చేసిన ఏ జట్టులోనూ ఇదే అత్యధిక శాతం (60% - సెల్ఫ్ గోల్స్ మినహా).
- మిచెల్ డ్యూక్ అన్ని పోటీలలో ఆస్ట్రేలియా కోసం తన చివరి ఎనిమిది ఆరంభాలలో ఐదు గోల్స్ చేశాడు. వాటిలో నాలుగు హెడర్లు ఉండటం విశేషం.
- యూసఫ్ మస్కానీ ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఆరు షాట్లు కొట్టాడు. ప్రపంచ కప్ మ్యాచ్‌లో ఒక ట్యునీషియా ఆటగాడు కొట్టిన అత్యధిక షాట్లు ఇవే.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఎడ్యుకేషన్
అమరావతి
ఓటీటీ-వెబ్సిరీస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement


Nagesh GVDigital Editor
Opinion