ఫిఫా ప్రపంచకప్- కీలక మ్యాచులో సెనెగల్ తో తలపడనున్న ఖతార్
FIFA WC 2022 QATAR: ఫిఫా ప్రపంచకప్ లో నేడు ఆతిథ్య ఖతార్, సెనెగల్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. దోహాలోని అల్ తుంబనా మైదానంలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి.
FIFA WC 2022 QATAR: ఫిఫా ప్రపంచకప్ లో నేడు ఆతిథ్య ఖతార్, సెనెగల్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. దోహాలోని అల్ తుంబనా మైదానంలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఖతార్- సెనెగల్ మధ్య ఇది మొదటి మ్యాచ్. అలాగే ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో సెనెగల్ తొలిసారిగా ఆతిథ్య దేశంతో తలపడుతోంది. గత 2 వరల్డ్ కప్ లలో ఆతిథ్య దేశంతో తలపడిన సెనెగెల్ రెండింటిలోనూ ఓడిపోయింది.
ఈ మ్యాచ్ ఖతార్ కు చాలా ముఖ్యమైనది. తన మొదటి మ్యాచులో 2-0 తేడాతో ఈక్వెడార్ చేతిలో ఖతార్ ఓడిపోయింది. ఫిఫా ప్రపంచకప్ లో ఆతిథ్య జట్టు తమ తొలి మ్యాచులో ఓడిపోవడం ఇదే తొలిసారి. కాబట్టి ఈ మ్యాచులో గెలవాలనే పట్టుదలతో ఆ జట్టు ఉంది.
You can be sure Senegal fans will be bringing the party against Qatar 🇸🇳 🥁 #Qatar2022 | #FIFAWorldCup pic.twitter.com/YJaH0VSnTB
— FIFA World Cup (@FIFAWorldCup) November 25, 2022
వివాదాల ఫిఫా
ప్రపంచవ్యాప్తంగా ఫిపా వరల్డ్ కప్‌కు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మ్యాచ్ షెడ్యూల్ విడుదలైన మరుక్షణం నుంచే చాలా దేశాల్లో సాకర్ ఫీవర్ మొదలైపోతోంది. అయితే కేవలం మ్యాచ్‌లో స్టన్నింగ్ గోల్స్‌కు మాత్రమే కాదు.. షాకింగ్ వివాదాలకు కూడా ఫిఫా వరల్డ్‌కప్ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. విజయాలతో పాటు వివాదాలకు దారి తీసిన సందర్భాలు చరిత్రలో చాలా మిగిలిపోయాయి. అలా ఫిఫా వరల్డ్‌కప్ చరిత్రలో మాయని మచ్చలా మిగిలిపోయిన వివాదాలు, నిరసనలు చాలానే ఉన్నాయి. అంతెందుక.. తాజాగా జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ 2022లో కూడా గందరగోళం నెలకొంది.
ఈ విషయం మరింత ముదిరితే మాత్రం టోర్నమెంట్ మధ్యలో 7 దేశాలు ప్రపంచ కప్ నుంచి తప్పుకునే అవకాశం ఉంది. వన్ లవ్ ఆర్మ్ బ్యాండ్‌లు ధరించి ఏ ఆటగాళ్లైననా మైదానంలోకి దిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఫుట్‌బాల్ అత్యున్నత సంస్థ ఫిఫా-7, యూరోపియన్ దేశాలను హెచ్చరించింది. ఏడు యూరోపియన్ దేశాలలో జర్మనీ కూడా దీనిపై నిరసన వ్యక్తం చేసింది. జపాన్‌తో మ్యాచ్‌కు ముందు తీసిన గ్రూప్ ఫొటోలో ఆ జట్టు ఆటగాళ్లు నోరు మూసుకుని ఫోటోలకు ఫోజు ఇచ్చారు. ఆటగాళ్లతో పాటు జర్మనీ మంత్రి నాన్సీ ఫీజర్ కూడా నిరసన వ్యక్తం చేశారు. ఆమె ‘వన్ లవ్ ఆర్మ్‌బ్యాండ్’ ధరించి మ్యాచ్ చూడటానికి స్టేడియానికి చేరుకుంది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. ఇలా గతంలో కూడా చాలానే నినాదాలు, వివాదాలు జరిగి, ఏకంగా టోర్నీలు ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి.
అలాంటి ఓ వివాదమే.. ఉరుగ్వే 1934 ఇటలీలో జరిగి, ఏకంగా పోటీని బహిష్కరించారు అప్పటి ఫీఫా అధికారులు. ఇక 1966లో జరిగిన ఏకైక ప్రపంచకప్‌ను యావత్ ఆఫ్రికా ఖండం బహిష్కరించింది. 16-జట్లు ఫైనల్స్‌కు లైనప్‌లో యూరప్ నుండి 10 జట్లు, ఆతిథ్య ఇంగ్లాండ్‌తో సహా, లాటిన్ అమెరికా నుండి నాలుగు, సెంట్రల్ అమెరికన్, కరేబియన్ ప్రాంతం నుండి ఒకటి ఉండాలని ఫిఫా నిర్ణయించింది. ఫైనల్స్ ముగిసిన రెండు సంవత్సరాల తర్వాత, ఆఫ్రికాకు ప్రపంచ కప్ స్థానాన్ని అందజేయాలని అది ఏకగ్రీవంగా ఓటు వేసింది. ఆసియాకు కూడా ఒకటి లభించి, బహిష్కరణ పని చేసింది. ఇక 2002లో రికార్డు స్థాయిలో అయిదో ప్రపంచకప్‌ను సాధించాక సాంబా జట్టు మళ్లీ కప్పు నెగ్గలేదు.
You can be sure Senegal fans will be bringing the party against Qatar 🇸🇳 🥁 #Qatar2022 | #FIFAWorldCup pic.twitter.com/YJaH0VSnTB
— FIFA World Cup (@FIFAWorldCup) November 25, 2022
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)