By: ABP Desam | Updated at : 27 Nov 2022 09:54 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
గోల్ కొట్టిన ఆనందంలో మొరాకో ఆటగాడు
Morocco vs Belgium Match Report: ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో మరో పెద్ద జట్టుకు షాక్ తగిలింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మొరాకో 2-0 తేడాతో బెల్జియం జట్టును ఓడించింది. ఫిఫా ర్యాంకింగ్స్‌లో బెల్జియం జట్టు రెండో స్థానంలో ఉండగా, మొరాకో జట్టు 22వ స్థానంలో ఉంది, అయితే ఈ మ్యాచ్‌లో బెల్జియం జట్టును 2-0 తేడాతో ఓడించి మొరాకో పెద్ద సంచలనాన్ని సృష్టించింది. ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో మొరాకోకు ఇదే తొలి విజయం. అంతకుముందు క్రొయేషియాతో మొరాకో తొలి మ్యాచ్ డ్రాగా ముగించింది. కాగా బెల్జియం తన తొలి మ్యాచ్‌లో కెనడాను 1-0తో ఓడించింది.
మొరాకో తరఫున అబ్దెల్‌హమిద్ సబిరి తొలి గోల్
ఈ మ్యాచ్‌లో మొరాకో జట్టు తొలి గోల్ చేసింది. 73వ నిమిషంలో మొరాకో గోల్ చేసి ఆధిక్యంలోకి వెళ్లింది. మొరాకో తరఫున అబ్దెల్‌హమిద్ సబిరి ఈ గోల్ సాధించాడు. 73వ నిమిషంలో అబ్దెల్‌హమిద్ సబిరి ఫ్రీ-కిక్ ద్వారా డైరెక్ట్ గోల్ చేశాడు. ఈ ప్రపంచకప్‌లో డైరెక్ట్ ఫ్రీ కిక్ ద్వారా వచ్చిన తొలి గోల్ ఇదే. అంతకు ముందు 70 నిమిషాల పాటు ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. ఈడెన్ హజార్డ్, థోర్గాన్ హజార్డ్, కెవిన్ డి బ్రూయిన్ వంటి వెటరన్ ఆటగాళ్లు బెల్జియం జట్టులో ఆడుతున్నప్పటికీ తమ జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయారు.
బెల్జియం ప్రారంభ XI
థిబౌట్ కోర్టోయిస్ (గోల్ కీపర్), తిమోతీ కాస్టాగ్నే, జాన్ వెర్టోంఘెన్, టోబీ ఆల్డర్‌వీరెల్డ్, థామస్ మెయునియర్, ఆక్సెల్ విట్సెల్, అమాడౌ ఒనానా, థోర్గాన్ హజార్డ్, కెవిన్ డి బ్రూయిన్, ఈడెన్ హజార్డ్ (కెప్టెన్), మిచీ బాట్షువాయి
మొరాకో ప్రారంభ XI
యాసిన్ బౌనౌ (గోల్‌కీపర్), అష్రఫ్ హకీమి, నుస్సైర్ మజ్రౌయి, సోఫియానే అమ్ర్బత్, నయెఫ్ అగ్యిర్డ్, రొమైన్ సైస్ (కెప్టెన్), హకీమ్ జీచ్, అజ్జెడిన్ ఒనాహి, సెలిమ్ అమల్లా, సౌఫియన్ బౌఫాల్, యూసఫ్ ఆన్-నెస్రీ
Best FIFA Football Awards: ఫిఫా అవార్డ్స్- ఉత్తమ ఆటగాడిగా నిలిచిన లియోనెల్ మెస్సీ
Number 10 Jersey: జెర్సీ నెంబర్ 10తో పీలె, సచిన్, డిగో, మెస్సీ, రొనాల్డినో లవ్‌స్టోరీ!
Pele Demise: దివికేగిన దిగ్గజం - ఫుట్‌బాల్ గ్రేటెస్ట్ పీలే కన్నుమూత!
Lionel Messi - Ziva: ధోనీ కుమార్తె జివా కోసం జెర్సీ పంపిన మెస్సీ- ఫొటోలు వైరల్
Personal Finance tips: మార్కెట్లో మెస్సీని గుర్తించి పెట్టుబడి పెట్టండి - 2023 కోసం ఫిఫా చెప్పిన డబ్బు పాఠాలు!
Magunta Raghav : మాగుంట రాఘవ్ మధ్యంతర బెయిల్ రద్దు - 12న సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ఆదేశం !
సునీత పిటిషన్ స్వీకరించిన సుప్రీంకోర్టు- అవినాష్ ముందస్తు బెయిల్‌పై మంగళవారం విచారణ
టీడీపీకి మరో సన్‌స్ట్రోక్- చేరికలను వాయిదా వేసిన చంద్రబాబు
Priyanka Gandhi: 2024 ఎన్నికలకు దూరంగా ప్రియాంక గాంధీ! ప్రచారంపైనే ఫుల్ ఫోకస్