అన్వేషించండి

FIFA World Cup Dispute: ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!

ఫిఫా వరల్డ్ కప్ రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ లో ఈజిప్ట్‌పై అర్జెంటీనా 3-2 తేడాతో ఊహించని విధంగా కంబ్యాక్ విక్టరీ సాధించింది. అయితే ఈ మ్యాచ్ పై ఈజిప్ట్ ప్లేయ‌ర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు.

Argentina Beat Egypt In Dramatic World Cup Clash: ఫిఫా వరల్డ్ కప్ 2026 రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ లో తాజాగా అత్యంత నాటకీయమైన హై-వోల్టేజ్ పోరు జరిగింది. ఈజిప్ట్‌తో జరిగిన బిగ్ ఫైట్ లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా 0-2 తో వెనుకబడినప్పటికీ లాస్ట్ మినిట్స్ లో మైండ్ బ్లోయింగ్ కంబ్యాక్ ఇస్తూ 3-2 తేడాతో సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో లెజెండ్ లియోనెల్ మెస్సి ఒక పెనాల్టీని మిస్ చేయగా, ఈజిప్ట్ కొట్టిన ఒక క్రూషియల్ గోల్ ను వీఏఆర్ రిజెక్ట్ చేసింది. అంపైర్ డెసిషన్స్ పై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు. మ్యాచ్ ముగిశాక ఈజిప్ట్ ఫార్వర్డ్ ప్లేయర్ మోస్తఫా జికో రిఫరీ ఫ్రాంకోయిస్ లెటెక్సియర్ పై తీవ్రమైన ఆరోపణలు చేశాడు. ఈ వరల్డ్ కప్ ఆల్రెడీ ఫిక్స్ అయిందని, కప్ ను బలవంతంగా అర్జెంటీనా చేతిలో పెడుతున్నారంటూ జికో సంచలన కామెంట్స్ చేయడం ప్రెజెంట్ వరల్డ్ ఫుట్‌బాల్ లో షాక్ కు గురిచేస్తోంది.

రిఫరీ అన్యాయం చేశాడు.. వరల్డ్ కప్ ఫిక్స్ అన్న మోస్తఫా జికో
మ్యాచ్ 60వ నిమిషంలో మోస్తఫా జికో ఈజిప్ట్ తరఫున థర్డ్ గోల్ కొట్టి టీమ్‌కు 3-0 లీడ్ ఇచ్చేలా కనిపించాడు. అయితే వీఏఆర్ రివ్యూలో ఈజిప్ట్ ప్లేయర్ హైసెం హసన్, అర్జెంటీనా డిఫెండర్ లిసాండ్రో మార్టినెజ్ ను ఫౌల్ చేసినట్లు తేలడంతో ఆ గోల్ క్యాన్సిల్ అయింది. దీనిపై ప్రముఖ ఇటాలియన్ జర్నలిస్ట్ ఫాబ్రిజియో రొమానో షేర్ చేసిన పోస్ట్ లో జికో తన అసంతృప్తిని వెళ్లగక్కాడు. "రిఫరీ కంప్లీట్‌గా అన్యాయం చేశాడు, ఒక దేశం పడిన కష్టాన్ని అతను బూడిదలో పోసిన పన్నీరు చేశాడు. ఈ వరల్డ్ కప్ కప్ ను అర్జెంటీనాకే ఇచ్చేస్తున్నారు, వాళ్లే విన్నర్ అవుతారు. ఇక్కడ ఎలాంటి ఫెయిర్ గేమ్ జరగడం లేదు. మ్యాచ్ స్టార్టింగ్ నుంచే రిఫరీ మాకు అగైనెస్ట్ గా ఉన్నాడు. అర్జెంటీనాపై మేము 2-0 తో గెలిచి బయటకు వెళ్లడం వారికి ఇష్టం లేదు, ఈ టోర్నమెంట్ మొత్తం ఫిక్స్ అయింది" అని జికో ఆరోపించాడు.

మెస్సి కన్నీళ్లు.. అర్జెంటీనా చారిత్రాత్మక కంబ్యాక్ విధ్వంసం
మంగళవారం జరిగిన ఈ మ్యాచ్ లో చాలా సమయం వరకు 39 ఏళ్ల లియోనెల్ మెస్సి ఆడుతున్న లాస్ట్ వరల్డ్ కప్ లో అర్జెంటీనా దారుణంగా ఎగ్జిట్ అవుతుందని అందరూ అనుకున్నారు. ఈజిప్ట్ ప్లేయర్లు యాసర్ ఇబ్రహీం, మోస్తఫా జికో చెరో గోల్ కొట్టి అర్జెంటీనాను గట్టి దెబ్బకొట్టారు. వీఏఆర్ రివ్యూ లేకపోతే ఈజిప్ట్ 3-0 తో లీడ్ లో ఉండేది. 1958, 1962 లో బ్రెజిల్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ వరల్డ్ కప్ లు గెలిచిన ఫస్ట్ టీమ్‌గా నిలవాలన్న అర్జెంటీనా ఆశలు దాదాపు క్లోజ్ అయినట్లే కనిపించాయి. కానీ 79వ నిమిషంలో డిఫెండర్ క్రిస్టియన్ రొమేరో హెడర్ ద్వారా ఫస్ట్ గోల్ కొట్టి అర్జెంటీనా ఫైట్‌బ్యాక్ స్టార్ట్ చేశాడు.

మెస్సి ఆల్ టైమ్ వరల్డ్ రికార్డ్.. 
ఆ తర్వాత 83వ నిమిషంలో కెప్టెన్ లియోనెల్ మెస్సి తన క్లాసిక్ షాట్ తో ఈ టోర్నమెంట్‌లో 8వ గోల్ సాధించాడు. ఈ గోల్ తో వరల్డ్ కప్ హిస్టరీలోనే తన ఓవరాల్ గోల్స్ సంఖ్యను 21 కి పెంచుకుని ఆల్ టైమ్ రికార్డును మరింత ప‌టిష్టం చేసుకున్నాడు. స్కోరు 2-2 తో ఈక్వల్ అయిన తర్వాత మ్యాచ్ ఇంజరీ టైమ్ లో ఎంజో ఫెర్నాండెజ్ మైండ్ బ్లాకింగ్ విన్నింగ్ గోల్ కొట్టి అర్జెంటీనాకు 3-2 తో ఊహించని విక్టరీ అందించాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే మెస్సి ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈజిప్ట్ మ్యాచ్ లో అర్జెంటీనా లక్ నెక్స్ట్ లెవెల్ లో వర్కౌట్ అయిందని, క్వార్టర్స్ లో వారి అటాకింగ్ గేమ్ మరింత డేంజరస్ గా మారబోతుందని తెలుస్తోంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Advertisement

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
Embed widget