DC vs RR live score:20 ఓవర్లకు రాజస్థాన్ 121-6; 33 పరుగుల తేడాతో ఓటమి
ఐపీఎల్‌లో నేడు మధ్యాహ్నం 3:30 గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఢిల్లీ, ముంబై రెండు జట్లు గత రెండు మ్యాచ్‌ల్లో గెలిచి ఊపు మీదున్నాయి.
LIVE

Background
20 ఓవర్లకు రాజస్థాన్ 121-6; 33 పరుగుల తేడాతో ఓటమి
అవేశ్ ఖాన్ 11 పరుగులు ఇచ్చాడు. ఐదో బంతిని సంజు శాంసన్ (70; 53 బంతుల్లో 8x4, 1x6) అద్భుతమైన సిక్సర్‌గా మలిచాడు. తబ్రైజ్ శంషీ (2*) అతడికి తోడుగా నిలిచాడు. దిల్లీ 33 పరుగుల తేడాతో విజయం అందుకుంది.
19 ఓవర్లకు రాజస్థాన్ 110-6
రబాడా 9 పరుగులు ఇచ్చాడు. రెండు వైడ్లు వేశాడు. రెండో బంతిన సంజు (60) బౌండరీకి పంపించాడు. శంషీ (1) అతడికి తోడుగా ఉన్నాడు.
18 ఓవర్లకు రాజస్థాన్ 101-6
నార్జ్ కేవలం 2 పరుగులే ఇచ్చి వికెట్ తీశాడు. సంజు (53) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. శంషీ (1) క్రీజులోకి వచ్చాడు.
తెవాతియా ఔట్
నార్జ్ వేసిన 17.2వ బంతికి తెవాతియా (9; 15 balls) ఔటయ్యాడు. హెట్‌మైయిర్ క్యాచ్ అందుకున్నాడు.
17 ఓవర్లకు రాజస్థాన్ 99-5
అవేశ్ ఖాన్ రంగంలోకి దిగాడు. ఎనిమిది పరుగులు ఇచ్చాడు. సంజు (52) అర్ధశతకం సాధించాడు. తెవాతియా (9) షాట్లకు ప్రయత్నించినా బాల్ మిడిల్ అవ్వడం లేదు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

