Yashasvi Jaiswal century: యశస్వి జైస్వాల్ సెంచరీతో టెస్టుల్లో ఇండియా అరుదైన ఘనత, సిరీస్ లో బాదుడే బాదుడు
Ind vs eng 5th test: ఇంగ్లండ్తో జరుగుతున్న 5వ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో జైస్వాల్ సెంచరీ సాధించాడు. ఇది టెస్ట్ సిరీస్‌లో భారత్కు 19వ శతకం అయింది.

Yashasvi Jaiswal century | కెన్నింగ్టన్ ఓవల్ టెస్ట్‌లో ఇండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీ సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో జైస్వాల్ కేవలం 127 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. లెఫ్ట్ హ్యాండ్ బాటర్ జైస్వాల్ 11 ఫోర్లు, రెండు సిక్సర్లతో శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్‌లో ఇది 19వ సెంచరీ, కాగా ఇది ఒక పెద్ద రికార్డును సృష్టించింది.
సిరీస్‌లో 19వ సెంచరీతో బిగ్ రికార్డు
భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో ఇప్పటివరకు 19 సెంచరీలు నమోదయ్యాయి. జైస్వాల్ సెంచరీతో రికార్డు నమోదయింది. ఈ సిరీస్‌లో భారత ఓపెనర్ జైస్వాల్‌కు ఇది రెండో సెంచరీ. అదే సమయంలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న సిరీస్ లో ఇండియాకు ఇది 12వ సెంచరీ. ఇంగ్లండ్ తరఫున సిరీస్‌లో 7 సెంచరీలు నమోదయ్యాయి. ఒక సిరీస్‌లో అత్యధిక వ్యక్తిగత సెంచరీల పరంగా ఈ సిరీస్ టెస్ట్ క్రికెట్‌లో 3వ స్థానంలో నిలిచింది. గతంలో 1955లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య జరిగిన సిరీస్‌లో 21 సెంచరీలు నమోదయ్యాయి. 2003-04లో వెస్టిండీస్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన టెస్ట్ సిరీస్‌లో 20 సెంచరీలు ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. భారత్, ఇంగ్లండ్ మధ్య తాజాగా జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో 19 సెంచరీలు నమోదయ్యాయి, ఇంకా ఇంగ్లండ్ ఇన్నింగ్స్ మిగిలి ఉంది. అదే సమయంలో భారత్ కూడా 6 వికెట్లు కోల్పోయింది.
ఒక పెద్ద రికార్డును సమం చేసిన భారత్
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భారత్ తరఫున ఇప్పటివరకు 12 సెంచరీలు నమోదయ్యాయి. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక జట్టు ఒక సిరీస్‌లో 12 సెంచరీలు సాధించడం ఇది కేవలం నాల్గవసారి. ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డు ప్రస్తుతం పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, భారత్, ఆస్ట్రేలియాల పేరిట ఉంది. ఈ నాలుగు జట్లు ఒక సిరీస్‌లో 12 సెంచరీలు చొప్పున సాధించారు.
ఆస్ట్రేలియా 1955లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 12 సెంచరీలు చేసింది. పాకిస్తాన్ 1982-83లో స్వదేశంలో భారత్‌తో ఆడుతూ 12 సెంచరీలు సాధించింది. దక్షిణాఫ్రికా 2003-04లో స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్లో 12 సెంచరీలు సాధించింది. ఇప్పుడు భారత్ ఇంగ్లండ్ గడ్డమీద ఈ ఫీట్ సాధించింది. అయితే, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురేల్, వాషింగ్టన్ సుందర్ లలో సెంచరీ సాధిస్తే, అప్పుడు టెస్టు సిరీస్లో సెంచరీల జాబితాలో భారత్ అగ్రస్థానానికి దూసుకెళ్తుంది.





















