అన్వేషించండి
Advertisement
WPL 2024 Final : ఆనందం పట్టలేక కోహ్లీ వీడియో కాల్ - ఉబ్బితబ్బిబయిన ప్లేయర్స్
RCB Women: స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు విజయం తరువాత సూపర్ ఉమెన్అని సోషల్ మీడియా వేదికగా పోస్టు చేసి ఆనందం వ్యక్తం చేశాడు.
Virat Kohli congratulates Smriti Mandhana and Co as RCB lift trophy: ఐపీఎల్(IPL) ప్రారంభమైనప్పటి నుంచి... రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) బరిలో దిగినప్పటి నుంచి వినిపిస్తున్న ఒకే మాట. ఈ సాలా కప్ మనదే అంటూ హంగామా చేసి.... తీరా కీలక మ్యాచ్‌లలో ఓడిపోతూ పురుషుల జట్టుకు అందని ద్రాక్షగా ఉన్న టైటిల్ విజేత కలను ఉమెన్స్ ప్రీమియర్‌ల లీగ్‌లో అమ్మాయిలు నెరవేర్చారు. కోహ్లీ, డివిలియర్స్ సహా దిగ్గజ ఆటగాళ్లతో చాలా పటిష్టంగా కనింపించిన RCB... ఐపీఎల్‌లో ప్రతీసారి టైటిల్ ఫేవరెట్‌గానే బరిలోకి దిగేది. కానీ విరాట్ కోహ్లీ(Virat kohli), అనిల్ కుంబ్లే(Anil Kumble), ఏబీ డివిలియర్స్(ABD), ఫాఫ్ డుప్లెసిస్ వంటి దిగ్గజాలు.. ఈ కలను సాకారం చేయలేకపోయారు. దాదాపుగా 16 ఏళ్లుగా దిగ్గజ క్రికెటర్లకు సాధ్యంకాని కలను ఆర్సీబీ అమ్మాయిలు సాకారం చేశారు. దశాబ్దంన్నర కాలంగా పురుషుల జట్టు సాధించలేకపోతున్న ట్రోఫీ కలను.. డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసి నిజం చేశారు. WPL 2024 టైటిల్ గెలిచిన తర్వాత ఆర్సీబీ ఆటగాళ్లుభావోద్వేగానికి గురయ్యారు. టీమిండియా స్టార్ బ్యాటర్, RCB స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా సూపర్ ఉమెన్(Super Women) అని సోషల్ మీడియా వేదికగా పోస్టు చేసి ఆనందం వ్యక్తం చేశాడు.
వీడియోకాల్‌లో అభినందనలు
మహిళల జట్టు టైటిల్ గెలిచిన అనంతరం అర్సీబీ ప్లేయర్లతో కింగ్ కోహ్లీ వీడియో కాల్ చేసి మాట్లాడాడు. కెప్టెన్ స్మృతి మంధానతో కాసేపు మాట్లాడిన ఈ స్టార్ బ్యాటర్... అనంతరం ఇతర ప్లేయర్లతో కూడా మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తమ ఫ్రాంచైజీకి డబ్ల్యూపీఎల్ టైటిల్ దక్కడంతో ఐపీఎల్ ఆర్‌సీబీ స్టార్స్ విరాట్ కోహ్లి, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మాజీ సభ్యులు క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, మాజీ యాజమాని విజయ్ మాల్యా తదితరులు అభినందనలు తెలిపారు.
అభిమానుల సంబరాలు
ఈ సాలా కప్ మనదే అని ప్రతి ఏటా ఎదురుచూస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు ఈసాలా కప్ దక్కడంతో ఎక్కడా ఆగడం లేదు. కోట్లాది మంది అభిమానుల కల నెరవేరడంతో సోషల్ మీడియా మోతెక్కిపోతోంది. కంగ్రాచ్యులేషన్ ఆర్సీబీ.. ఈసాలా కప్ మనదే.. ఈసాలా కప్ నమదే హ్యాష్‌ట్యాగ్‌లతో సోషల్ మీడియాలో ఆర్సీబీ అభిమానులు రచ్చ చేస్తున్నారు. ఎట్టకేలకు సాధించామని ఒకరు భావోద్వేగ పోస్టులు పెడుతున్నారు. తమ అభిమాన జట్టు కప్పు గెలవడం పట్ల ఆర్సీబీ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆర్సీబీ అనే పదం ట్రెండింగ్‌గా మారింది. బెంగళూరులోని వీధుల్లో యువత విజయోత్సవ ర్యాలీలు చేస్తున్నారు. దాదాపుగా 16 ఏళ్లుగా దిగ్గజ క్రికెటర్లకు సాధ్యంకాని కలను ఆర్సీబీ అమ్మాయిలు సాకారం చేశారు. దశాబ్దంన్నర కాలంగా పురుషుల జట్టు సాధించలేకపోతున్న ట్రోఫీ కలను.. డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసి నిజం చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు ఆ జట్టు ఫ్యాన్స్ సగర్వంగా కాలర్ ఎగరేసే ప్రదర్శన చేసింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
బిజినెస్
సినిమా
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion