అన్వేషించండి

IND vs ENG: గిల్ మెరుపులతో 587 పరుగులు! ఇంగ్లండ్ గడ్డపై భారత్ టాప్ స్కోర్లు ఇవే!

India vs England Highest Test Score: భారత జట్టు ఇంగ్లాండ్ లో అత్యధిక స్కోరు 2007 లో చేసింది. ఓవల్ మైదానంలో ఈ రికార్డు నెలకొల్పింది.

India vs England Highest Test Score: భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో మ్యాచ్ బుధవారం నుంచి బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు గురువారం రెండో రోజున 587 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఈ ఇన్నింగ్స్‌లో భారత జట్టు 600 మార్కును దాటుతుందని అంతా అంచనా వేశారు. కానీ కెప్టెన్ గిల్ అవుట్ అయిన తర్వాత ఎక్కువ సమయం భారత్ బ్యాట్స్‌మెన్‌ పోరాడలేకపోయారు. 

ఇప్పటి వరకు ఇంగ్లండ్‌లో భారత జట్టు మూడుసార్లు మాత్రమే 600 మార్కును దాటింది. మరోసారి 600 స్కోరు చూస్తామని క్రికెట్ అభిమానులు ఆశగా ఎదురు చూశారు. కానీ ఆ ముచ్చట తీరలేదు. ఇప్పటి వరకు టీమ్ ఇండియా 2007లో ఓవల్ మైదానంలో ఇంగ్లండ్‌లో అత్యధిక స్కోరు సాధించింది.

18 సంవత్సరాల క్రితం అత్యధిక స్కోరు 
భారత జట్టు 2007లో ఓవల్ మైదానంలో అత్యధిక స్కోరు సాధించింది. భారత జట్టు ఈ మైదానంలో 664 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో దినేష్ కార్తీక్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, ఎంఎస్ ధోనీ అద్భుతమైన అర్ధ సెంచరీలు చేశారు. అదే సమయంలో అనిల్ కుంబ్లే ఈ మ్యాచ్‌లో సెంచరీ చేశాడు. అందరి అద్భుతమైన ఆట తీరుతో భారత్ పెద్ద స్కోరు చేయగలిగింది. 

ఇంగ్లండ్‌లో భారత్ రెండో అత్యధిక స్కోరు లీడ్స్ మైదానంలో 628 పరుగులు చేసింది. మూడో అత్యధిక స్కోరు ఓవల్ మైదానంలో 606 పరుగులు చేసింది.

ఎడ్జ్‌బాస్టన్‌లో 587 పరుగులు  
ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టు రెండో రోజున భారత జట్టు ఏడు వికెట్ల నష్టానికి 564 పరుగులు చేసింది. ఆ సమయంలో ఇంకా శుభ్‌మన్‌ గిల్‌ క్రీజ్‌లో ఉన్నాడు. అతను ట్రిపుల్ సెంచరీ చేస్తాడు. భారత్ స్కోర్ కూడా 600 దాటిపోతుందని అంతా భావించారు. కానీ అప్పుడే శుభ్‌మన్‌ గిల్ అవుటం... అనంతరం రెండు వికెట్లు పడటానికి ఎక్కువ సమయం పట్టలేదు. 

దీంతో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 151 ఓవర్లలో 587 పరుగులు సాధించింది. శుభ్‌మాన్ గిల్ డబుల్ సెంచరీకి తోడు యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా అద్భుతమైన సహాకారం అందించారు. 

ఎలైట్ క్లబ్‌లో చేరిన శుభ్‌మన్ గిల్
భారత్ టెస్టు జట్టు కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్‌ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న రెండో టెస్ట్‌లో అద్భుతమైన డబుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ట్రిపుల్ సెంచరీ సాధిస్తాడని అంతా భావించారు. కానీ అనూహ్యంగా 269 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఇప్పటి వరకు 1979లో ది ఓవల్‌లో సునీల్ గవాస్కర్ చేసిన 221 పరుగులే ఇంగ్లండ్‌లో అత్యధిక స్కోరు. ఇప్పుడు దాన్ని గిల్ అధిగమించాడు. 

ఇంగ్లాండ్‌లో భారత ఆటగాళ్ళు చేసిన 10 అతిపెద్ద నాక్‌లు:
శుబ్‌మన్ గిల్ - 269 (ఎడ్జ్‌బాస్టన్, 2025)
సునీల్ గవాస్కర్ - 221 (ది ఓవల్, 1979)
రాహుల్ ద్రవిడ్ - 217 (ది ఓవల్, 2002)
సచిన్ టెండూల్కర్ - 193 (లీడ్స్, 2002)
రవి శాస్త్రి - 187 (ది ఓవల్, 1990)
వినూ మన్కడ్ - 184 (లార్డ్స్, 1952)
మహమ్మద్ అజారుద్దీన్ - 179 (మాంచెస్టర్, 1990)
సచిన్ టెండూల్కర్ - 177 (నాటింగ్‌హామ్, 1996)
దిలీప్ వెంగ్‌సర్కార్ - 157 (లార్డ్స్, 1982)
విరాట్ కోహ్లీ – 149 (ఎడ్జ్‌బాస్టన్, 2018)

విదేశాల్లో అరుదైన ఫీట్
గిల్ డబుల్ సెంచరీ మైలురాయి 2016లో నార్త్ సౌండ్‌లో విరాట్ కోహ్లీ డబుల్‌ సెంచరీ తర్వాత విదేశీ టెస్టులో భారత కెప్టెన్ చేసిన రెండో డబుల్ సెంచరీ.

టాప్ హెడ్ లైన్స్

Jaiswal Mind Games: ఐపీఎల్ ఆఫర్ తో జైస్వాల్ స్లెడ్జింగ్.. డిక్వెల్లాను ట్రాప్ చేసి వికెట్ పడగొట్టిన వైనం.. టీమిండియా మైండ్ గేమ్ అదుర్స్!
ఐపీఎల్ ఆఫర్ తో జైస్వాల్ స్లెడ్జింగ్.. డిక్వెల్లాను ట్రాప్ చేసి వికెట్ పడగొట్టిన వైనం.. టీమిండియా మైండ్ గేమ్ అదుర్స్!
Historic Test Victory: సుతార్ 10 వికెట్ల మాయాజాలంతో లంక చిత్తు.. 165 రన్స్ తేడాతో భారత్ ఘనవిజయం, 600వ టెస్టులో టీమిండియా బంపర్ విక్టరీ!
సుతార్ 10 వికెట్ల మాయాజాలంతో లంక చిత్తు.. 165 రన్స్ తేడాతో భారత్ ఘనవిజయం, 600వ టెస్టులో టీమిండియా బంపర్ విక్టరీ!
Historic Cricket Diplomacy: కరాచీలో టెస్ట్ కావాలన్న ముషారఫ్.. అద్వానీ ఫోన్ కాల్ తో ఆగిన ప్లాన్, 2004 పాకిస్తాన్ టూర్ సీక్రెట్స్ పై తాజా బుక్ లో వెల్ల‌డి!
కరాచీలో టెస్ట్ మ్యాచ్ కావాలన్న ముషారఫ్.. అద్వానీ ఫోన్ కాల్ తో ఆగిన ప్లాన్, 2004 పాకిస్తాన్ టూర్ సీక్రెట్స్ పై తాజా బుక్ !
Jadeja Costly No-Ball:  అద్భుత‌మైన బంతితో వికెట్ తీసిన‌ జడేజా.. క‌ట్ చేస్తే నోబాల్‌.. గౌతమ్ గంభీర్ రియాక్ష‌న్ వైరల్..
అద్భుత‌మైన బంతితో వికెట్ తీసిన‌ జడేజా.. క‌ట్ చేస్తే నోబాల్‌.. గౌతమ్ గంభీర్ రియాక్ష‌న్ వైరల్..

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget