T20 World Cup 2024: సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌తో టీమిండియా మ్యాచ్, వానొస్తే జరిగేదిదే?
IND vs ENG: T20 ప్రపంచ కప్ 2024 రెండవ సెమీఫైనల్జూ న్ 27 గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో భారతదేశం, ఇంగ్లాండ్ మధ్య జరుగనుంది. అయితే ఇక్కడ కూడా వర్షం ముప్పు వెంటాడుతూనే ఉంది.
![T20 World Cup 2024: సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌తో టీమిండియా మ్యాచ్, వానొస్తే జరిగేదిదే? What Happens If India vs England T20 World Cup 2024 Semifinal Is Washed Out T20 World Cup 2024: సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌తో టీమిండియా మ్యాచ్, వానొస్తే జరిగేదిదే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/eeb6ba441f2c225bf20ee46032d6f16017193009782111036_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
If India vs England T20 World Cup 2024 Semifinal Is Washed Out: టీ 20 ప్రపంచ కప్ (T20 World Cup) ఆసక్తికరంగా సాగుతోంది. ఇది చిన్న జట్టు అది పెద్ద జట్టు అని తేడా లేకుండా ప్రతి మ్యాచ్ లోనూ అదరగొడుతున్నారు ఆటగాళ్ళు. మరోవైపు వర్షం కూడా టీములతో ఆటాడుకుంటోంది. కొన్ని మ్యాచ్ లు అయితే చివరివరకు జరుగుతాయా, జరగవా అనేంత ఉత్కంఠతో జరిగాయి. గ్రూప్ లలో కూడా కొన్ని వర్షం కారణంగా రద్దు అయినవీ ఉన్నాయి. అలాగే డక్ వర్త్ లూయిస్ ప్రకారం కుదించి ఆడిన మ్యాచ్ లు కూడా ఉన్నాయి.
ఇక సెమీస్ సంబరం మొదలయ్యింది. సూపర్ -8లో ఆస్ట్రేలియా(AUS)పై ఘన విజయం సాధించిన భారత జట్టు ఇంగ్లాండ్(ENG) తో సెమీస్ లో తలపడనుండగా, దక్షిణాఫ్రికా(SA), ఆఫ్ఘనిస్తాన్(AFG) తో తలపడనుంది. ఇక మొదటి సెమీ ఫైనల్ జూన్ 26 బుధవారం నాడు గ్రూప్ 1లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన దక్షిణాఫ్రికా-అఫ్గానిస్తాన్ మధ్య జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఇది ఉదయం అయిదు గంటలకు తరుబాలోని బ్రియాన్ లారా స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
గ్రూప్ టూలో రెండో సెమీఫైనల్‌లో టీమిండియా-ఇంగ్లాండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ . గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో జరగనుంది. మన టీం ఇండియా ఆడనున్న మ్యాచ్ సమయంలో వాతావరణం విషయానికి వస్తే, గురువారం (జూన్ 27), గయానా లో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది, సుమారు 88% వర్షం పడే అవకాశం మరియు 18% ఉరుములు వచ్చే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనాలు సూచిస్తున్నాయి. ఈ IND vs ENG T20 ప్రపంచ కప్ 2024 మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 08:00 PM కి జరుగుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే మొదటి సెమీ ఫైనల్ కి రిజర్వ్ డే ఉంది గానీ 2 వ సెమీ ఫైనల్ కు రిజర్వ్ డే లేదు. కానీ ప్రతి సెమీ-ఫైనల్‌కు 250 నిమిషాల అదనపు సమయం అందుబాటులో ఉంటుంది. ఒకవేళ వర్షం వస్తే ఈ సమయం వినియోగించుకోవచ్చు. ఒకవేళ ఒక్క బంతి కూడా వేయకుండానే వర్షం మ్యాచ్‌ను పూర్తిగా వాష్ చేస్తే, టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్‌కు చేరుకుంటుంది. ఎందుకంటే టీం ఇండియా ఇప్పటికే తన అద్భుత ప్రదర్శనతో సూపర్ ఎయిట్ గ్రూప్‌లలో దక్షిణాఫ్రికాతో కలిసి అగ్ర స్థానంలో ఉంది.
ఆ పరాభవానికి ప్రతీకారమా
మీకు గుర్తున్నట్టు అయితే టీ20 ప్రపంచకప్ 2022 సెమీఫైనల్‌లో భారత్ మరియు ఇంగ్లండ్‌లు పోరాడాయి. అప్పుడు ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఘోరంగా 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆ ఘోరమైన ఓటమిని ఇప్పటికీ మరచిపోలేము అని చెబుతారు మాజీలు. ఇప్పుడు టీం ఇండియా ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)