అన్వేషించండి

Injury Fitness Boost: అఫ్గాన్ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు డబుల్ ధమాకా.. వాషింగ్టన్ సుందర్ నితీష్ రెడ్డి ఫిట్, బుమ్రా, హర్షిత్ ల‌పై స‌స్పెన్స్..

అఫ్గానిస్తాన్‌తో జరిగే టీ20 సిరీస్‌కు వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి పూర్తి ఫిట్‌నెస్ సాధించి గురువారం ఢిల్లీలోని భారత జట్టుతో చేరనున్నారు.

Fitness Boost For Team India Ahead Of Afghanistan T20Is:  అఫ్గానిస్తాన్‌తో సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు భారీ ఊరట ద‌క్కింది. స్టార్ ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్, తెలుగు స్టార్  నితీష్ కుమార్ రెడ్డి గాయాల నుంచి పూర్తిగా కోలుకుని ఫిట్‌నెస్ సర్టిఫికెట్ సాధించారు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)లో నిర్వహించిన ఫిట్‌నెస్ పరీక్షలు, కఠినమైన మ్యాచ్ సిమ్యులేషన్స్‌ను వీరిద్దరూ విజయవంతంగా పూర్తి చేశారు. గురువారం వీరు దేశ రాజధాని ఢిల్లీలో భారత జట్టుతో కలవనున్నారు. జూలైలో కార్డిఫ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డే సందర్భంగా హ్యామ్‌స్ట్రింగ్ గాయానికి గురైన వాషింగ్టన్ సుందర్, ఇటీవల శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్ నుంచి త‌ప్పుకున్నాడు. మరోవైపు జూన్‌లో అఫ్గానిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్ తర్వాత ఎడమ క్వాడ్రిసెప్స్ సమస్యతో సతమతమైన నితీష్ రెడ్డి, ఐర్లాండ్, ఇంగ్లాండ్, శ్రీలంక పర్యటనలకు దూర‌మ‌య్యాడు. ఇప్పుడు వీరిద్దరూ తిరిగి జట్టులోకి రావడం భారత శిబిరంలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.

Read Also: KL Rahul Future Clarity: ట్రేడింగ్ రూమర్లకు చెక్ పెట్టిన రాహుల్..తన ట్వీట్ తో క్లారిటీ , ఇక హార్దిక్ పాండ్యా ఇష్యూలో మ‌రో ట్విస్ట్

బుమ్రా ఎప్పుడు..?
సుందర్, నితీష్ రెడ్డి అందుబాటులోకి వచ్చినప్పటికీ, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పునరాగమనంపై ఇంకా స్పష్టత ల‌భించ‌డం లేదు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ మోకాలికి తగిలిన గాయం కారణంగా బుమ్రా ఇంకా ఆటకు దూరంగానే ఉన్నాడు. పేస్ ఆల్‌రౌండర్ హర్షిత్ రాణా కూడా ఇంగ్లాండ్ టూర్‌లో తగిలిన హ్యామ్‌స్ట్రింగ్ గాయం నుంచి ఇంకా రిక‌వర్ కాలేదు. ఈ ఇద్దరిలో ఎవరైనా జట్టుతో కలవకపోతే, లోకల్ పేసర్ ప్రిన్స్ యాదవ్‌ను చివరి నిమిషంలో జట్టులోకి తీసుకునే అవకాశాలను సెలెక్టర్లు పరిశీలిస్తున్నారు.

Read Also: Tactical Mastermind Sooryavanshi: బ్యాట్‌తో తగ్గినా బుర్రతో కొట్టాడు.. మైదానంలో వైభవ్ సూర్యవంశీ మైండ్ గేమ్ తో ర‌చ్చ‌..

రిహార్స‌ల్ గా ఈ సిరీస్..
ఇబ్రహీం జద్రాన్ సారథ్యంలోని అఫ్గానిస్తాన్‌తో పొట్టి ఫార్మాట్‌లో భారత్‌కు ఇదే మొదటి ద్వైపాక్షిక సిరీస్ కావడం విశేషంగా చెప్పుకోవ‌చ్చు. జపాన్ పర్యటనకు బయలుదేరే ముందు శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టుకు ఈ మూడు మ్యాచ్‌లు సన్నాహకంగా ఉపయోగపడనున్నాయి. సెప్టెంబర్ 22న తోచిగిలోని సానో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్‌లో జపాన్‌తో ఏకైక టీ20 ఆడిన తర్వాత, సెప్టెంబర్ 28 నుంచి కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో ప్రారంభమయ్యే ఆసియా క్రీడల పతక పోరులో భారత్ ఆడ‌నుంది. 

ఢిల్లీకి దులీప్ ట్రోఫీ స్టార్లు..
ప్రస్తుతం చెన్నైలోని చేపాక్ స్టేడియంలో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ముగిసిన వెంటనే ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ, తిలక్ వర్మ ఢిల్లీలోని టీమ్ ఇండియాతో క‌ల‌వ‌నున్నారు. చేపాక్ వేదికగా సాగుతున్న ఈ పోరు డ్రాగా ముగిసే సమయాన్ని బట్టి ఈ ముగ్గురు ఆటగాళ్లు రాజధానికి చేరుకోనున్నారు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ben Stokes IPL: రెండేళ్ల విరామం తర్వాత ఐపీఎల్లోకి స్టోక్స్ రీఎంట్రీ.. అన్‌క్యాప్డ్ విభాగంలోకి సీనియర్ పేసర్ ఇషాంత్ 
రెండేళ్ల విరామం తర్వాత ఐపీఎల్లోకి స్టోక్స్ రీఎంట్రీ.. అన్‌క్యాప్డ్ విభాగంలోకి సీనియర్ పేసర్ ఇషాంత్ 
Vaibhav Sooryavanshi World Record: చరిత్రను తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 52 బంతుల్లో డబుల్ సెంచరీతో అరుదైన ప్రపంచ రికార్డు, 28 బంతుల్లో శతకంతో పాటు 28 సిక్సర్లతో సునామీ
చరిత్రను తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 52 బంతుల్లో డబుల్ సెంచరీతో అరుదైన ప్రపంచ రికార్డు, 28 బంతుల్లో శతకంతో పాటు 28 సిక్సర్లతో సునామీ
Blair Tickner Injury:  రెండోటెస్టుకు ముందు  కివీస్ కు భారీ షాక్.. గాయంతో స్టార్ పేసర్అవుట్, అత‌ని స్థానంలో ఆ ప్లేయ‌ర్ కు చాన్స్..
రెండోటెస్టుకు ముందు  కివీస్ కు భారీ షాక్.. గాయంతో స్టార్ పేసర్అవుట్, అత‌ని స్థానంలో ఆ ప్లేయ‌ర్ కు చాన్స్..
Priyansh Arya Record: రాహుల్ రికార్డును బద్దలు కొట్టిన ప్రియాంశ్ ..19 సిక్సర్లతో ప్రపంచ రికార్డు సమం చేసిన ఢిల్లీ కెప్టెన్
రాహుల్ రికార్డును బద్దలు కొట్టిన ప్రియాంశ్ ..19 సిక్సర్లతో ప్రపంచ రికార్డు సమం చేసిన ఢిల్లీ కెప్టెన్
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Venkatesh: డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
నేపాల్ లేనిదే రాముడు అసంపూర్ణం అన్న మోదీ! భారత్-నేపాల్ పుణ్యక్షేత్రాల పవిత్ర బంధం
నేపాల్ లేనిదే రాముడు అసంపూర్ణం అన్న మోదీ! భారత్-నేపాల్ పుణ్యక్షేత్రాల పవిత్ర బంధం
Hyderabad Crime News: హైదరాబాద్‌లో పీజీ హాస్టళ్లపై ఈగల్ టీం మెరుపు దాడులు.. ఆరుగురికి గంజాయి పాజిటివ్
హైదరాబాద్‌లో పీజీ హాస్టళ్లపై ఈగల్ టీం మెరుపు దాడులు.. ఆరుగురికి గంజాయి పాజిటివ్
Rajiv Gandhi Security: రాజీవ్ గాంధీ హత్యకు కుట్ర.. ఉద్దేశపూర్వకంగానే సెక్యూరిటీ తొలగింపు.. వారి పేర్లు బయటపెడతా?- రాహుల్ గాంధీ
రాజీవ్ గాంధీ హత్యకు కుట్ర.. ఉద్దేశపూర్వకంగానే సెక్యూరిటీ తొలగింపు.. వారి పేర్లు బయటపెడతా?- రాహుల్ గాంధీ
Atmakur Municipal Vice Chairperson: రెండోరోజూ హైడ్రామా.. ఆత్మకూరు వైస్ ఛైర్‌పర్సన్‌గా కొలగాని శిరీష ఎన్నిక
రెండోరోజూ హైడ్రామా.. ఆత్మకూరు వైస్ ఛైర్‌పర్సన్‌గా కొలగాని శిరీష ఎన్నిక
Seethakka: కావాలని అన్న మాట కాదు, పొరపాటుకు చింతిస్తున్నాను: కవిత వ్యాఖ్యలపై మంత్రి సీతక్క వివరణ
కావాలని అన్న మాట కాదు, పొరపాటుకు చింతిస్తున్నాను: కవిత వ్యాఖ్యలపై మంత్రి సీతక్క వివరణ
YS Sharmila Daughters Wedding: నేడు వైఎస్ షర్మిల కుమార్తె వివాహం.. వివాహ వేదికను ఎక్కడికి మార్చారు
నేడు వైఎస్ షర్మిల కుమార్తె వివాహం.. వివాహ వేదికను ఎక్కడికి మార్చారు
Hanamkonda BRS Vs Congress: వరంగల్ పశ్చిమలో రాజకీయ రసాభాస.. అభివృద్ధి సవాళ్ల నుంచి దాడుల దాకా.. హన్మకొండలో హైటెన్షన్!
వరంగల్ పశ్చిమలో రాజకీయ రసాభాస.. అభివృద్ధి సవాళ్ల నుంచి దాడుల దాకా.. హన్మకొండలో హైటెన్షన్!
Embed widget