KL Rahul Future Clarity: ట్రేడింగ్ రూమర్లకు చెక్ పెట్టిన రాహుల్..తన ట్వీట్ తో క్లారిటీ , ఇక హార్దిక్ పాండ్యా ఇష్యూలో మరో ట్విస్ట్
ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు ట్రేడింగ్ వార్తలకు ముగింపు పలుకుతూ తాను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోనే కొనసాగుతున్నట్లు కేఎల్ రాహుల్ స్పష్టం చేశాడు.

Delhi Capitals Retain KL Rahul Ahead Of Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2027 మినీ వేలానికి ముందు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ భవితవ్యంపై నెలకొన్న ఎండ్ కార్డు పడింది. గత 2026 సీజన్ ముగిసిన నాటి నుంచి ఫ్రాంచైజీల మధ్య ఆటగాళ్ల ట్రేడింగ్ గురించి పలు రకాల ప్రచారాలు జరిగాయి. ఇప్పటికే రిషభ్ పంత్ తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్ గూటికి చేరగా, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టులోకి వెళ్లే భారీ ట్రేడ్ అధికారికంగా స్పష్టమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో రాహుల్ కూడా వేరే ఫ్రాంచైజీలోకి వెళ్తాడనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే రాబోయే సీజన్‌లో తాను ఢిల్లీ క్యాపిటల్స్ తరఫునే బరిలోకి దిగుతానని రాహుల్ స్వయంగా తేల్చిచెప్పాడు.
🚨 BIG NEWS FOR DC FANS! 🚨 KL Rahul will reportedly stay with the Delhi Capitals for IPL 2027! 💙 Can’t wait to see him back in action and creating more memorable moments. 🏏🔥
— cricketfastliveline (@cfll_official) September 8, 2026
.
.
.#KLRahul #KLRahul #DelhiCapitals #DC #IPL #IPL2027 #Cricket #IndianCricket #CricketFans pic.twitter.com/V0CmOUZBKh
ట్వీట్ తో రాహుల్ కన్ఫర్మేషన్..
ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్థ్ జిందాల్ సోషల్ మీడియా వేదికగా రాహుల్‌ను ప్రశంసిస్తూ పెట్టిన పోస్ట్‌తో ఈ చర్చలకు తెరపడింది. రాహుల్‌ను అత్యుత్తమ క్లచ్ ప్లేయర్‌గా అభివర్ణించిన జిందాల్, ఫ్రాంచైజీతో ఇంకా సాధించాల్సింది చాలా ఉందని రాసుకొచ్చాడు. "కేఎల్ రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు నిజమైన ఆస్తి. జట్టు ప్రయోజనాలను ఎల్లప్పుడూ ముందుంచే వ్యక్తి. రాబోయే సీజన్‌లో ఢిల్లీని గర్వపడేలా చేయడానికి కలిసి శ్రమిస్తాం" అని జిందాల్ పేర్కొన్నాడు. దీనికి రాహుల్ స్పందిస్తూ "థ్యాంక్స్, వచ్చే సీజన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా" అని బదులిచ్చాడు. దీంతో అతడు ఢిల్లీ క్యాపిటల్స్ జెర్సీలోనే కొనసాగుతాడన్న విషయం అధికారికంగా రూఢీ అయింది. 2025 సీజన్‌లో రూ. 14 కోట్లకు ఢిల్లీలో చేరిన రాహుల్, తొలి ఏడాది 539 రన్స్, 2026 సీజన్‌లో 593 రన్స్ చేసి అద్భుత ఫామ్ కనబరిచాడు.
ముంబైలోనే హార్దిక్ .. రోహిత్ శర్మ కీలక పాత్ర
మరోవైపు ముంబై ఇండియన్స్ స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ వ్యవహారంలో కీలక మలుపు తిరిగింది. సరైన డీల్ కుదరకపోవడంతో హార్దిక్ మరో ఏడాది పాటు ముంబై ఇండియన్స్ జట్టులోనే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే 2027 సీజన్ కోసం జట్టు నాయకత్వంలో మార్పులు జరగనున్నాయని, కొత్త కెప్టెన్ ఎంపిక ప్రక్రియలో మాజీ సారథి రోహిత్ శర్మ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాడని తెలుస్తోంది. కెప్టెన్సీ కోల్పోయినప్పటికీ హార్దిక్ జట్టులో ఒక ఆటగాడిగా కొనసాగే అవకాశాలను ఫ్రాంచైజీ పరిశీలిస్తోంది.
ట్రేడింగ్ పుకార్లు..
ఫ్రాంచైజీలు తమ కోర్ గ్రూప్‌ను పటిష్టం చేసుకునే క్రమంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. రిషభ్ పంత్ రీఎంట్రీ, రాహుల్ కొనసాగింపుతో ఢిల్లీ క్యాపిటల్స్ మరింత బలంగా మారగా, మిగిలిన జట్లు సైతం సమతుల్యత కోసం ట్రేడింగ్ మార్గాలను అన్వేషిస్తున్నాయి.
ట్రెండింగ్ వార్తలు



















