Virat Kohli Mask: స్పెషల్ మాస్క్ తో విరాట్ కోహ్లీ - ఎన్నో ప్రయోజనాలు, కానీ సొంతంగా మీరు ట్రై చేస్తే అంతే సంగతి
విరాట్ కోహ్లీ అతని ఫేస్ కు ఓ డిఫరెంట్ మాస్క్ వేసుకుని ఉన్నాడు. ఆ మాస్క్ వేసుకుని గ్రౌండ్ లో కొన్ని ల్యాప్స్ పరిగెత్తాడు. ఆ పరిగెత్తే సమయంలో తన స్మార్ట్ వాచ్ లో టైం కూడా చెక్ చేసుకుంటూ కనిపించాడు.
నేడు ఇండియా, పాక్ మధ్య సూపర్-4
ప్రాక్టీస్ లో కొత్త రకమైన మాస్క్ తో విరాట్ కోహ్లీ
హై ఆల్టిట్యూడ్ మాస్క్ వేసుకుని విరాట్ రన్నింగ్
ఊపిరితిత్తులు, గుండె పనితీరు పెంచే మాస్క్ ఇది
బ్రీతింగ్ ఎబిలిటీ పెంచేందుకు అథ్లెట్స్ వాడే మాస్క్
మాస్క్ వాడేముందు వైద్యుల సలహా ఉంటే మేలు
ఆసియా కప్ 2022లో భారత్ - పాకిస్థాన్ సూపర్-4 మ్యాచ్ ముందు ప్రాక్టీస్ సెషన్లలో విరాట్ కోహ్లీ ధరించిన స్పెషల్ మాస్క్ అందర్నీ ఆకర్షించింది. అసలు ఆ మాస్క్ ఏంటి..? దాని వల్ల ఉపయోగాలేంటి అని నెటిజన్లు గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. నేడు ఇండియా పాకిస్థాన్ మధ్య సూపర్-4 మ్యాచ్ జరగబోతోంది. మ్యాచ్ కు ముందు రోజు టీమిండియా ఆటగాళ్లు నెట్స్ లో బాగా శ్రమించారు. కానీ ఎప్పట్లానే మరోసారి అందరి దృష్టీ విరాట్ కోహ్లీ మీద పడింది. అయితే ఈసారి వేరే రీజన్ కోసం. నెట్స్ లో సుమారు గంటకుపైగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిన కోహ్లీ.. కాస్త బ్రేక్ తీసుకుని మళ్లీ గ్రౌండ్ లోకి వచ్చాడు.
స్పెషల్ మాస్క్‌తో విరాట్ కోహ్లీ
బ్రేక్ అనంతరం విరాట్ కోహ్లీ అతని ఫేస్ కు ఓ డిఫరెంట్ మాస్క్ వేసుకుని ఉన్నాడు. ఆ మాస్క్ వేసుకుని గ్రౌండ్ లో కొన్ని ల్యాప్స్ పరిగెత్తాడు. ఆ పరిగెత్తే సమయంలో తన స్మార్ట్ వాచ్ లో టైం కూడా చెక్ చేసుకుంటూ కనిపించాడు. ప్రాక్టీస్ చూసేందుకు గ్రౌండ్ కు వచ్చిన ఫ్యాన్స్ ఈ వీడియోను తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అప్పుడు అందర్లోనూ ఆసక్తి రేపిన పాయింట్ ఒక్కటే. విరాట్ వేసుకున్న మాస్క్ ఏంటా అని. ఈ మాస్క్ ను హై ఆల్టిట్యూడ్ మాస్క్ అంటారు. దీన్ని సాధారణంగా అథ్లెట్స్ వాడుతుంటారు. దీని వల్ల స్పెషల్ యూజ్ ఏంటంటారా.
మాస్క్ వల్ల ప్రయోజనాలు..
ఆ స్పెషల్ హై ఆల్టిట్యూడ్ మాస్క్‌తో ఓ ప్రత్యేకమైన యూజ్ ఉంటుంది. ఈ మాస్క్ వేసుకోవడం వల్ల మన నోరు, ముక్కు పూర్తిగా కవర్ అవుతాయి. మన ఆక్సిజన్ ఇన్ టేక్ ను ఈ మాస్క్ చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. అంటే సాధారణం కన్నా తక్కువ తీసుకునేలా. ఉదాహరణకు చెప్పాలంటే.. ఎత్తైన ప్రదేశాలు, పర్వతాల మీదకు వెళ్లినప్పుడు మన బ్రీతింగ్ ఎలా ఉంటుందో అలాంటి సిట్యుయేషన్ ను ఈ మాస్క్ క్రియేట్ చేస్తుంది. ఇలా చేయడం వల్ల మన ఊపిరితిత్తులు (లంగ్స్), హార్ట్ ఫంక్షనింగ్ మెరుగువుతుందని చాలా పరిశోధనల్లో తేలింది.
క్రీడాకారులు, ముఖ్యంగా చెప్పాలంటే మారథాన్ రన్నర్స్ తమ ప్రాక్టీస్ లో ఈ మాస్కులు ధరించి ప్రాక్టీస్ చేస్తారు. తమ శ్వాస తీసుకునే సామర్థ్యాన్ని మెరుగు పరుచుకోవడమే కాక ఎండ్యూరెన్స్ కూడా పెంచుకోవడమే వారి లక్ష్యం. విరాట్ కోహ్లీ ఫిట్ నెస్ కు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో మనం స్పెషల్ గా చెప్పుకోవాలా. తను కెప్టెన్ అయిన తర్వాత టీమిండియాలో ఫిట్ నెస్ మీద అవేర్ నెస్ పెరిగిందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు తనను తాను ఫిట్ గా ఉంచుకునేందుకు ఇలా హై ఆల్టిట్యూడ్ మాస్క్ ఉపయోగించి గ్రౌండ్ లో రన్నింగ్ చేశాడు. తన టైమింగ్ ను ఎప్పటికప్పుడు వాచ్ లో చూసుకున్నాడు. అయితే ఈ హై ఆల్టిట్యూడ్ మాస్క్ ఎవరుపడితే వారు వాడొచ్చా..? అంటే వాడకూడదు అని చెప్పవచ్చు. హై బీపీ ఉన్నవాళ్లు, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవాళ్లు దీని జోలికి వెళ్లకూడదు. ఆరోగ్యంగా ఉన్నవారు కూడా దీన్ని వాడే ముందు డాక్టర్ కన్సల్టేషన్ తీసుకుంటే మేలు.