News
News
X

ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌లో రౌడీ స్టార్

దుబాయ్ క్రికెట్ మైదానంలో లైగర్ సందడి చేశాడు. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కు విజయ్ హాజరై ఆటగాళ్లను ఉత్సాహపరిచాడు.

FOLLOW US: 

ఆసియా కప్ లో భాగంగా భారత్- పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ కు ప్రత్యేక అతిథి హాజరయ్యారు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మైదానంలో దర్శనమిచ్చాడు. భారత ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూ కనిపించాడు. 

భారత్-పాక్ మ్యాచ్ అంటే ఎప్పుడూ ఉత్కంఠగానే ఉంటుందని విజయ్ అన్నారు. ఏ ఫార్మాట్ లో అయినా దాయాదుల పోరు ఆసక్తికరంగానే ఉంటుందన్నాడు. భారత్ మ్యాచ్ గెలవాలని అందరిలా తాను కోరుకుంటానని ఈ రౌడీ బాయ్ వివరించాడు.

ఇటీవల లైగర్ సినిమాతో ప్రేక్షకులకు పలకరించాడు విజయ్ దేవరకొండ. అయితే ఆ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. జోరుగా ప్రచార కార్యక్రమాలతో సినిమాకు ఊపు తెచ్చినా.. విడుదల అయ్యాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సినిమాకు మొదటి షో నుంచే నెగెటివ్ టాక్ రావడం మైనస్ పాయింట్ అయింది. సినిమా ఆశించిన మేర లేకపోవడంతో కలెక్షన్లపై ప్రభావం చూపుతోంది. అయినా తొలి రోజు కలెక్షన్లు బాగానే వచ్చాయి. అనుకున్న దానికంటే కాస్త తక్కువగా వచ్చినా ఫర్వాలేదు అనిపించాయి. కానీ, మూడో రోజు వచ్చే సరికి పరిస్థితి మరింత దిగజారింది. సినిమా హాళ్లకు ప్రేక్షకులు రావడమే మానేశారు. కలెక్షన్లు సైతం దారుణంగా పడిపోయాయి.

సినిమాకు మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 33.12 కోట్ల రూపాయలను సాధించినట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. రెండో రోజు, తొలి రోజు వచ్చిన సగం కలెక్షన్లు కూడా రాలేదు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం కలిపి రూ. 3.5 కోట్లు వచ్చాయి. హిందీలో రూ. 3.82 కోట్లు, తమిళంలో రూ. 20 లక్షలు, మలయాళంలో రూ. 8 లక్షలు వసూళు చేసింది. మూడో రోజు మొత్తంగా ఏడున్నర కోట్ల వరకు డబ్బులు రాబట్టింది. విచిత్రం ఏంటంటే.. రెండో రోజు బాలీవుడ్ లో ఈ సినిమా బాగానే ఆడింది. మళ్లీ మూడో రోజుకు వచ్చే సరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రేక్షకులు లేక థియేటర్ల వెలవెలబోయాయి.

ఇక మూడో రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. భారీగా పడిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా రూ. 5 నుంచి 6 కోట్ల షేర్ సాధించింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో రూ. 1.5 నుంచి 3 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక మూడు రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.5 నుంచి 23.51 కోట్ల షేర్ అందుకుంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు సంబంధించిన వసూళ్లు చాలా వరకు తగ్గాయి. అన్ని ప్రాంతాల్లోనూ థియేటర్లకు ప్రేక్షకులు బాగా తగ్గిపోయారు. విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కెరీర్ కు ఈ సినిమా మైనస్ గా నిలుస్తుందనే టాక్ సినీ పరిశ్రమలో వినిపిస్తోంది. ఈ ఫ్లాప్ సినిమాను ప్రదర్శించడం కంటే మరో సినిమాను షో వేయడం మంచిదని కొన్ని ప్రాంతాల్లో థియేటర్ల యజమానులు భావిస్తున్నారట.  

మొత్తంగా లైగర్ సినిమా యూనిట్‌కు ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. సినిమాలో కంటెంట్ లేకపోయినా.. భారీ ప్రమోషన్స్ తో ప్రేక్షకుల్లో సినిమా మీద భారీగా అంచనాలు పెరిగేలా చేసింది పూరి అండ్ టీమ్.  ఎన్నో అంచనాలతో సినిమా థియేటర్లకు వెళ్లిన అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురయ్యింది. మొత్తంగా సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. రిలీజ్ కు ముందే ఓటీటీలో భారీ ఆఫర్ వచ్చినా థియేటర్‌లో అంతకుమించి వసూళ్లు సాధిస్తామని మూవీ యూనిట్ ధీమా వ్యక్తం చేసింది. ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. 

Published at : 28 Aug 2022 09:02 PM (IST) Tags: Vijay Devarakonda vijay devarakonda news vijay devarakonda in dubai rowday boy vijay in dubai india pak match

సంబంధిత కథనాలు

వైరల్‌ అవుతున్న కోహ్లీ నిర్ణయం- అందుకే కింగ్ అయ్యాడంటున్న ఫ్యాన్స్‌

వైరల్‌ అవుతున్న కోహ్లీ నిర్ణయం- అందుకే కింగ్ అయ్యాడంటున్న ఫ్యాన్స్‌

మిల్లర్ కిల్లర్ ఇన్నింగ్స్ సరిపోలేదు - మ్యాచ్, సిరీస్ రెండూ మనవే!

మిల్లర్ కిల్లర్ ఇన్నింగ్స్ సరిపోలేదు - మ్యాచ్, సిరీస్ రెండూ మనవే!

IND Vs SA 2nd T20 Highlights: దక్షిణాఫ్రికాని కమ్మేసిన స్కై, కింగ్ - టీమిండియా భారీ స్కోరు!

IND Vs SA 2nd T20 Highlights: దక్షిణాఫ్రికాని కమ్మేసిన స్కై, కింగ్ - టీమిండియా భారీ స్కోరు!

IND Vs SA 2nd T20 Toss: ఈసారి టాస్ దక్షిణాఫ్రికాది - బౌలింగ్‌కు మొగ్గు చూపిన ప్రొటీస్!

IND Vs SA 2nd T20 Toss: ఈసారి టాస్ దక్షిణాఫ్రికాది - బౌలింగ్‌కు మొగ్గు చూపిన ప్రొటీస్!

IND vs SA 2nd T20 Live Streaming: ఇండియా, దక్షిణాఫ్రికా మ్యాచ్ లైవ్ ఎలా చూడవచ్చంటే?

IND vs SA 2nd T20 Live Streaming: ఇండియా, దక్షిణాఫ్రికా మ్యాచ్ లైవ్ ఎలా చూడవచ్చంటే?

టాప్ స్టోరీస్

Kishan Reddy: కొత్త పార్టీ ఏర్పాటు అందుకే, ప్రధాని అయినట్లు పగటి కలలు - కిషన్ రెడ్డి ఎద్దేవా

Kishan Reddy: కొత్త పార్టీ ఏర్పాటు అందుకే, ప్రధాని అయినట్లు పగటి కలలు - కిషన్ రెడ్డి ఎద్దేవా

Chinta Mohan: శశిథరూర్ దళిత వ్యతిరేకి, మల్లిఖార్జున ఖర్గేనే విజయం సాధిస్తారు: కాంగ్రెస్ మాజీ ఎంపీ

Chinta Mohan: శశిథరూర్ దళిత వ్యతిరేకి, మల్లిఖార్జున ఖర్గేనే విజయం సాధిస్తారు: కాంగ్రెస్ మాజీ ఎంపీ

MLA Kotamreddy: ఆ సెంటిమెంట్ ని గౌరవిస్తా, అందుకే అలా చేశా: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి

MLA Kotamreddy: ఆ సెంటిమెంట్ ని గౌరవిస్తా, అందుకే అలా చేశా: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి

Mrunal Thakur: ఆ సమయంలో చనిపోవాలనుకున్న మృణాల్‌ - ‘సీతారామం’ సక్సెస్ వరకు ‘సీత’ పడిన కష్టాలెన్నో!

Mrunal Thakur: ఆ సమయంలో చనిపోవాలనుకున్న మృణాల్‌ - ‘సీతారామం’ సక్సెస్ వరకు ‘సీత’ పడిన కష్టాలెన్నో!