By: ABP Desam | Updated at : 27 Dec 2022 09:02 PM (IST)
Edited By: nagavarapu
సూర్యకుమార్ యాదవ్ (source: twitter)
Team India Battar Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్.. భారత టీ20 క్రికెట్ లో ఇప్పుడొక సంచలనం. జాతీయ జట్టులోకి అరంగేట్రం చేసి ఏడాదే అవుతున్నా తన మార్క్ ఆటతో పేరు సంపాదించుకున్నాడు. టీ20ల్లో విధ్వంసకర ఆటతో జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. విభిన్న షాట్లు ఆడుతూ టీమిండియా డివిలియర్స్ గా పేరు తెచ్చుకున్నాడు. 2022లో ఇప్పటివరకు 31 టీ20 మ్యాచులు ఆడిన సూర్య 187.43 స్ట్రైక్ రేట్ తో 1164 పరుగులు చేశాడు. ప్రస్తుతం టీ20 ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో ఉన్నాడు.
అందుకు నేను లక్కీ
క్రికెటర్ గా తన ఎదుగుదలలో భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ప్రభావం చాలా ఉందని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. వారిద్దరితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం తన అదృష్టమని పేర్కొన్నాడు. అంతేకాక వారిద్దరిని క్రికెట్లో వారొక ప్రత్యేకమైన జాతి అని అభివర్ణించాడు. 'రోహిత్, కోహ్లీలతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం నా అదృష్టం. వారు అంతర్జాతీయ క్రికెట్ లో భిన్నమైన జాతి. వారు సాధించినవాటిని నేనప్పటికీ సాధించగలనో నాకు తెలియదు. ఇటీవల విరాట్ భాయ్ తో కలిసి కొన్ని మంచి భాగస్వామ్యాలను నిర్మించాను. అతనితో బ్యాటింగ్ ను నేను ఆస్వాదిస్తాను. అలాగే రోహిత్ నాకు అన్నయ్యలాంటివాడు. నాకు ఆటలో ఏమైనా సందేహాలంటే అతన్నే అడుగుతాను. 2018 ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ లో చేరినప్పటి నుంచి రోహిత్ తో నాకు మంచి బంధం ఏర్పడింది. అప్పటి నుంచి నాకతను మార్గదర్శకంగా ఉన్నాడు.' అని సూర్య చెప్పాడు.
'ప్రపంచ నెంబర్ వన్ టీ20 బ్యాటర్' ఇదింకా నాకు కలలానే ఉంది
'ప్రపంచంలోనే టీ20ల్లోనే నన్ను నెంబర్ వన్ బ్యాటర్ గా పిలవడం నాకింకా కలగానే అనిపిస్తోంది. ఈ ఫార్మాట్ లో ఆడుతున్నప్పుడు అత్యుత్తమంగా ఆడాలని కోరుకున్నాను. అలాగే ఆడుతున్నాను. ఇందుకోసం నేను చాలా శ్రమించాను.' అని సూర్య అన్నాడు. దేశవాళీల్లో నిలకడగా రాణించినప్పటికీ సూర్యకు అంతర్జాతీయ జట్టులో త్వరగా చోటు దక్కలేదు. అయితే ఇప్పుడు వచ్చిన అవకాశాలను అద్భుతంగా ఉపయోగించుకుని మేటి క్రికెటర్ గా ఎదుగుతున్నాడు. ప్రస్తుతం సూపర్ ఫాంలో ఉన్న సూర్య శ్రీలంకతో టీ20 సిరీస్ కు సన్నద్ధమవుతున్నాడు.
Surya Kumar Yadav said, "Things that Virat and Rohit Bhai have achieved, I don't know I will ever be able to achieve it." #ViratKohli𓃵 #RohitSharma𓃵 #SuryakumarYadav #cricket #cricketnews #sports #sportsnews #news pic.twitter.com/tp0kVTXPz1
— CricInformer(Cricket News & Fantasy Tips) (@CricInformer) December 26, 2022
Sixer king#sky #SuryakumarYadav 💥🔥 pic.twitter.com/1ZqYXYslja
— SURYA KUMAR YADAV FANS (@mr360_SURYA) December 27, 2022
IND vs AUS Test: అహ్మదాబాద్ లో భారత్- ఆస్ట్రేలియా ఆఖరి టెస్ట్- వీక్షించనున్న ఇరు దేశాల ప్రధానులు!
Women's T20 World Cup 2023 Schedule: ఫిబ్రవరి 10 నుంచి ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్- 12న చిరకాల ప్రత్యర్థితో భారత్ ఢీ
Hardik Pandya: నిర్ణయాలు నావే, ఫలితానికి బాధ్యతా నాదే: హార్దిక్ పాండ్య
WPL Auction 2023: ఫిబ్రవరి 13న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలం!
IND vs NZ 3rd T20: శుభ్‌మన్ గిల్ సెంచరీ నుంచి న్యూజిలాండ్ పతనం వరకు సోషల్ మీడియాలో రెచ్చిపోయిన మీమర్స్!
Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!
K.Viswanath: చిరంజీవితో విశ్వనాథ్‌కు ప్రత్యేక అనుబంధం - కళా తపస్విని కన్నతండ్రిలా భావించే మెగాస్టార్!
Anil Kumar On Kotamreddy : దమ్ముంటే రాజీనామా చెయ్, కోటంరెడ్డికి అనిల్ కుమార్ సవాల్
K Viswanath Death: టాలీవుడ్‌ను ఖండాంతరాలకు తీసుకు వెళ్ళారు, తీరని లోటు - విశ్వనాథునికి చిరంజీవి, ఎన్టీఆర్, మమ్ముట్టి నివాళులు