అన్వేషించండి

Vaibhav Explosive Knock: ఆయా షేర్.. నాకౌట్ మ్యాచ్ ల్లో మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్.. 15 ఏళ్ల వండర్ కిడ్ వైభ‌వ్ రూటే స‌ప‌రేట్..

దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో వైభవ్ సూర్యవంశీ అద్భుత బ్యాటింగ్‌తో చెలరేగడంతో సెంట్రల్ జోన్‌పై ఈస్ట్ జోన్ 4 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్లోకి ప్ర‌వేశించింది.

15 Years Vaibhav Sooryavanshi Shines In Duleep Trophy Semifinal:  బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వేదికగా జరిగిన దులీప్ ట్రోఫీ తొలి సెమీఫైనల్లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన మెరుపు ఇన్నింగ్స్‌లతో మరోసారి స‌త్తా చాటాడు. సెంట్రల్ జోన్‌తో జరిగిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ తరఫున ఆడిన వైభవ్, కెప్టెన్ ఇషాన్ కిషన్ గైర్హాజరీలో కొద్దిసేపు తాత్కాలిక కెప్టెన్సీ బాధ్యతలు కూడా నిర్వహించాడు. రెండు ఇన్నింగ్స్‌లలో 92, 40 పరుగులతో సూపర్ నాక్స్ ఆడి జట్టు విజయంలో కీ రోల్ పోషించాడు. ఇండియా అండర్-19, ఇండియా ఏ, రాజస్థాన్ రాయల్స్ తరఫున వైట్ బాల్ ఫార్మాట్‌లో సత్తా చాటిన ఈ యంగ్ స్టార్, ఇప్పుడు ప్రతిష్టాత్మక రెడ్ బాల్ టోర్నీలోనూ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 

నాకౌట్ మ్యాచ్ ల్లో మైండ్ బ్లోయింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌..
ముఖ్యమైన నాకౌట్ మ్యాచ్‌లలో నిలకడగా రాణించడంలో వైభవ్ సూర్యవంశీ రికార్డు అద్భుతంగా ఉందని గ‌ణాంకాలు చెబుతున్నాయి. అన్ని ఫార్మాట్లలో కలిపి ఆడిన 10 నాకౌట్ మ్యాచ్‌లలోని 11 ఇన్నింగ్స్‌లలో 65.18 సగటుతో 717 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు న‌మోదు చేశాడు. గరిష్ట స్కోరు 175 రన్స్ కావ‌డం విశేషం. అండర్-19 ఆసియా కప్, 2026 అండర్-19 వరల్డ్ కప్ సెమీస్, ఫైనల్స్ తో పాటు ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పై 97, క్వాలిఫైయర్ 2 లో గుజరాత్ టైటాన్స్ పై 96 పరుగులు బాది బిగ్ మ్యాచ్ ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్నాడు.

తొలి ఇన్నింగ్స్ లో టై స్కోరు..
సెమీస్ లో తొలి ఇన్నింగ్స్‌లో సెంట్రల్ జోన్ 266 పరుగులు చేయగా, ఈస్ట్ జోన్ కూడా సరిగ్గా 266 పరుగులే చేసింది. ఈస్ట్ జోన్ తరఫున వైభవ్ సూర్యవంశీ కేవలం 81 బంతుల్లోనే 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 92 పరుగులు సాధించాడు. దీంతో దులీప్ ట్రోఫీ చరిత్రలోనే హాఫ్ సెంచరీ సాధించిన అత్యంత పిన్న వయస్కుడైన బ్యాటర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ 159 పరుగుల లక్ష్య ఛేదనలో 43 బంతుల్లో 40 పరుగులు చేసి అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. సెంట్రల్ జోన్ కెప్టెన్ రజత్ పాటిదార్ అద్భుతమైన రన్నింగ్ క్యాచ్ పట్టడంతో వైభవ్ ఇన్నింగ్స్ ముగిసింది.

పేస‌ర్ల దెబ్బ‌..
రెండో ఇన్నింగ్స్‌లో సెంట్రల్ జోన్‌ను 158 పరుగులకే కుప్పకూల్చడంలో పేసర్లు ముకేష్ కుమార్ (4/44), మహమ్మద్ షమీ (3/56) కీల‌క పాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌లో మొత్తం ఐదు వికెట్లు పడగొట్టిన షమీ టీమ్ ఇండియాలోకి రీఎంట్రీ ఇవ్వడానికి తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. లక్ష్య ఛేదనలో హర్ష్ దూబే 4 వికెట్లు తీసి ఒత్తిడి తెచ్చినా, కెప్టెన్ ఇషాన్ కిషన్ 39 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజ‌య‌ప‌థంలో న‌డిపాడు. మహమ్మద్ షమీ విన్నింగ్ షాట్ కొట్టడంతో ఈస్ట్ జోన్ 162/6 స్కోరుతో 4 వికెట్ల తేడాతో విజయం సాధించి ఘనంగా ఫైనల్‌లోకి అడుగుపెట్టింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sreesanth VS Sanju Samson, Kerala League Rift:  శ్రీశాంత్-సంజూ మ‌ధ్య విబేధాలు..!! వేదికపై షేక్ హ్యాండ్ ఇవ్వ‌ని శ్రీశాంత్.. వీడియో వైరల్
శ్రీశాంత్-సంజూ మ‌ధ్య విబేధాలు..!! వేదికపై షేక్ హ్యాండ్ ఇవ్వ‌ని శ్రీశాంత్.. వీడియో వైరల్
Asia Cup Deadlock: ఆసియాక‌ప్ లో మరోసారి ట్రోఫీ రగడ మొదలయ్యే చాన్స్.. ఫైనల్‌కు మొహ్సిన్ నఖ్వీ హాజరుతో నయా టెన్ష‌న్
ఆసియాక‌ప్ లో మరోసారి ట్రోఫీ రగడ మొదలయ్యే చాన్స్.. ఫైనల్‌కు మొహ్సిన్ నఖ్వీ హాజరుతో నయా టెన్ష‌న్
Duleep Trophy Final:  షాకింగ్.. వైభవ్ సూర్యవంశీని స్లెడ్జ్ చేసిన‌ తిలక్ వర్మ .. దులీప్ ట్రోఫీ ఫైనల్లో హై ఓల్టేజ్ డ్రామా
షాకింగ్.. వైభవ్ సూర్యవంశీని స్లెడ్జ్ చేసిన‌ తిలక్ వర్మ .. దులీప్ ట్రోఫీ ఫైనల్లో హై ఓల్టేజ్ డ్రామా
PCB Mobile Confiscation: మ్యాచ్ ముగిసేవరకు ఫోన్లు ఇచ్చేది లేదు.. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌కు ముందు పాక్ ప్లేయర్ల మొబైల్స్ సీజ్ చేసిన పీసీబీ
మ్యాచ్ ముగిసేవరకు ఫోన్లు ఇచ్చేది లేదు..ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌కు ముందు పాక్ ప్లేయర్ల మొబైల్స్ సీజ్ చేసిన పీసీబీ
Advertisement

వీడియోలు

Ishan Kishan Century Duleep Trophy Final | సెలెక్టర్లకు గట్టి కౌంటర్ ఇచ్చిన ఇషాన్ కిషన్
Vaibhav Suryavanshi Duleep Trophy Final Knock | దులీప్ ట్రోఫీ ఫైనల్లో వైభవ్ విధ్వంసం
PCB Takes Custody Of Team Phones | పాకిస్తాన్ ప్లేయర్స్ ఫోన్లు సీజ్
Gundenininda Gudigantalu Serial September 7 | వరలక్ష్మీ వ్రతంలో రోహిణికి ట్విస్ట్
Cybercab Autonomous Robotaxi USA Public Rides | అమెరికాలో సైబర్ క్యాబ్ రైడ్స్ హల్‌చల్.. డ్రైవర్ కాదు స్టీరింగే లేని టెస్లా కార్ల విప్లవం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS MLC Tatha Madhu Disqualification: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలి: మంత్రి సీతక్క డిమాండ్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలి: మంత్రి సీతక్క డిమాండ్
Section 22A Land Controversy: 22ఏ భూములపై విచారణకు బీజేపీ డిమాండ్! కాళేశ్వరంపై సైలెన్స్ ఎందుకుని కాంగ్రెస్ ఎదురుదాడి
22ఏ భూములపై విచారణకు బీజేపీ డిమాండ్! కాళేశ్వరంపై సైలెన్స్ ఎందుకుని కాంగ్రెస్ ఎదురుదాడి
Miss World 2027 : మిస్ వరల్డ్ 2027లో పోటీ చేయాలనుకుంటున్నారా? అర్హత, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ వివరాలు ఇవే
మిస్ వరల్డ్ 2027లో పోటీ చేయాలనుకుంటున్నారా? అర్హత, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ వివరాలు ఇవే
MLA Sunitha Laxma Reddy: పోలీసులు చీర పట్టి లాగారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కంటతడి
పోలీసులు చీర పట్టి లాగారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కంటతడి
Vijayasai Reddy Political Party: కమ్మ, కాపులే సీఎం అవ్వాలా? విజయదశమి తరువాత పార్టీ పేరు అనౌన్స్: విజయసాయిరెడ్డి
కమ్మ, కాపులే సీఎం అవ్వాలా? విజయదశమి తరువాత పార్టీ పేరు అనౌన్స్: విజయసాయిరెడ్డి
Asia Cup Deadlock: ఆసియాక‌ప్ లో మరోసారి ట్రోఫీ రగడ మొదలయ్యే చాన్స్.. ఫైనల్‌కు మొహ్సిన్ నఖ్వీ హాజరుతో నయా టెన్ష‌న్
ఆసియాక‌ప్ లో మరోసారి ట్రోఫీ రగడ మొదలయ్యే చాన్స్.. ఫైనల్‌కు మొహ్సిన్ నఖ్వీ హాజరుతో నయా టెన్ష‌న్
AP Local Body Elections: ఏపీ లోకల్ పోల్స్ ప్రభుత్వ పాలనకు రిఫరెండం - అధికార, ప్రతిపక్షాలు అంగీకరిస్తాయా?
ఏపీ లోకల్ పోల్స్ ప్రభుత్వ పాలనకు రిఫరెండం - అధికార, ప్రతిపక్షాలు అంగీకరిస్తాయా?
Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10'కు నాగార్జున రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? కింగ్‌కు కోట్లలో ఇస్తున్న స్టార్ మా
'బిగ్ బాస్ 10'కు నాగార్జున రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? కింగ్‌కు కోట్లలో ఇస్తున్న స్టార్ మా
Embed widget