అన్వేషించండి
Advertisement
USA vs ENG, T20 World Cup 2024: ఛాంపియన్‌లా సెమీస్ చేరిన ఇంగ్లాండ్, బట్లర్ మెరిశాడు, జోర్డాన్ కూల్చాడు
United States vs England: సూపర్ 8 లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ సూపర్ విక్టరీ కొట్టింది. బార్బడోస్‌లో అమెరికాపై 10 వికెట్లతో గెలిచిన బట్లర్ సేన సెమీఫైనల్లో అడుగుపెట్టింది.
England thrash USA by 10 wickets to reach T20 World Cup semis: టీ 20 ప్రపంచకప్(T20 World Cup 2024)లో ఇంగ్లాండ్(England) బ్యాటర్ జోస్ బట్లర్(Jos Buttler) చెలరేగిపోయాడు. పసికూన అమెరికాపై పిడుగులా పడ్డాడు. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బట్లర్ విధ్వంసం సృష్టించాడు. అసలే స్కోరు బోర్డుపై తక్కువ పరుగులు చేసి కాస్త పోరాడుదామనుకున్న అమెరికాకు అసలే ఆ అవకాశమే ఇవ్వలేదు. దొరికిన బంతిని దొరికినట్లు బాదేశాడు. అమెరికా బౌలర్ హర్మీత్ సింగ్‌ను ఊచకోత కోశాడు. ఒకే ఓవర్లో 32 పరుగులు బాది బ్రిటీష్ జట్టుకు భారీ విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో ఘన విజయంతోపాటు రన్‌రేట్ కూడా కీలకం కావడంతో ఇంగ్లాండ్ సమష్టిగా రాణించింది. తొలుత బంతితో అమెరికాను తక్కువ పరుగులకే కట్టడి చేసిన ఇంగ్లాండ్.. ఆ తర్వాత బ్యాట్‌తోనూ చెలరేగిపోయింది. దీంతో టీ 20 ప్రపంచకప్‌లో సెమీస్‌కు క్వాలిఫై అయిన తొలి జట్టుగా ఇంగ్లాండ్ నిలిచింది.
రాణించిన బౌలర్లు
కెన్సింగ్‌టన్ ఓవల్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అమెరికాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. తొలి ఓవర్‌లోనే వికెట్ పడింది. అండ్రీస్ గౌస్‌ను టోప్లీ అవుట్ చేయడంతో అమెరికా తొమ్మిది పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత అమెరికా బ్యాటర్లు టేలర్-నితీశ్‌కుమార్ కాస్త మెరుగ్గానే బ్యాటింగ్ చేశారు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. నితీశ్‌కుమార్ 24 బంతుల్లో ఒక ఫోర్, 2 సిక్సులతో 30 పరుగులు చేసి అవుటవ్వగా... టేలర్ 12 పరుగులు చేసి అవుటయ్యారు. 56 పరుగుల వద్ద మూడు వికెట్లు కోల్పోయిన అమెరికా .. ఆ తర్వాత కూడా వరుసగా వికెట్లు కోల్పోయింది. క్రిస్ జోర్డాన్ అమెరికా బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. కేవలం 17 బంతులు వేసిన జోర్డాన్ పదే పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. అమెరికా బ్యాటర్ కోరీ అండర్సన్ మినహా మిగిలిన అమెరికా బ్యాటర్లు అందరూ విఫలమయ్యారు. కోరి అండర్సన్ 28 బంతుల్లో 29 పరుగులు చేశాడు. జోర్డాన్ హ్యాట్రిక్ తీసి అమెరికా వెన్ను విరిచాడు. 115 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోగా.. అదే స్కోరు వద్ద అమెరికాను జోర్డాన్ ఆలౌట్ చేశాడు. 18., 18.4, 18.5 ఓవర్‌లో వరుసగా వికెట్లు తీసిన జోర్డాన్ అమెరికాను 115 పరుగులకే పరిమితం చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్ కమిన్స్ హ్యాట్రిక్ తీసిన రోజే జోర్డాన్(Chris Jordan) కూడా మరో హ్యాట్రిక్ తీసి చరిత్ర సృష్టించాడు. టీ 20 ప్రపంచ క్రికెట్‌లో ఒకే రోజు రెండు హ్యాట్రిక్‌లు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం విశేషం.
బటర్ల్ బాదేశాడు
116 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన ఇంగ్లాండ్ ఓపెనర్లు బట్లర్-సాల్ట్ ఆ తర్వాత మాత్రం విధ్వంసం సృష్టించారు. ముఖ్యంగా ఈ ప్రపంచకప్‌లో పెద్దగా ఫామ్‌లో లేని బట్లర్ ఈ మ్యాచ్‌లో మాత్రం మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 38 బంతుల్లో ఆరు ఫోర్లు, ఏడు సిక్సర్లతో బట్లర్ 83 పరుగులు చేశాడు. లక్ష్యమే 116 పరుగులు కాగా బట్లర్ ఒక్కడే 83 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ సాల్ట్ 21 బంతుల్లో 25 పరుగులు చేశాడు. దీంతో 116 పరుగుల లక్ష్యాన్ని 9.4 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో భారీ తేడాతో గెలవడంతో ఇంగ్లాండ్ సెమీస్‌కు అర్హత సాధించింది. గ్రూప్ 2 నుంచి సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా బ్రిటీష్ జట్టు నిలిచింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
ఇండియా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement