అన్వేషించండి

IND vs AUS U19: తుది సమరానికి ఆస్ట్రేలియానే, ఉత్కంఠభరిత పోరులో విజయం

ICC Under 19 World Cup 2024: వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్లో టీమిండియాను ఓడించిన కంగారులపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం యువ భారత్ జట్టుకు లభించింది.

Under-19 World Cup Final Match: ప్రపంచకప్‌ ( World Cup) ఫైనల్లో మరోసారి ఆస్ట్రేలియా-భారత్‌ (IND vs AUS )తలపడబోతున్నాయి. కానీ ఇది అండర్‌ 19 ప్రపంచకప్‌లో(ICC Under 19 World Cup 2024). వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్లో టీమిండియాను ఓడించిన కంగారులపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం యువ భారత్ జట్టుకు లభించింది. దక్షిణాఫ్రికాలోని బినోయ్‌, విల్మోర్‌పార్క్‌లో జరిగిన రెండో సెమీ ఫైనల్లో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను మట్టికరిపించిన ఆస్ట్రేలియా... యువ భారత జట్టుతో తుది పోరుకు  సిద్ధమైంది.

ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌..
అండర్-19 ప్రపంచ కప్ రెండో సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 48.5 ఓవర్లలో కేవలం 179 పరుగులకే ఆలౌటైంది. లక్ష్యాన్ని ఛేదించిన ఆస్ట్రేలియా జట్టు మరో 5 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్లు కోల్పోయి విజయ తీరానికి చేరుకుంది.
180 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 49.1 ఓవ‌ర్‌లో తొమ్మిది వికెట్లు కోల్పోయి ఛేదించింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 48.5 ఓవ‌ర్ల‌లో 179 ప‌రుగుల‌కు ఆలౌటైంది. పాకిస్తాన్ బ్యాట‌ర్ల‌లో అజాన్ అవైస్ (52; 91 బంతుల్లో 3 ఫోర్లు), అరాఫత్ మిన్హాస్ (52; 61 బంతుల్లో 9ఫోర్లు) హాఫ్ సెంచ‌రీలు చేశారు. షామిల్ హుస్సేన్ (17) ఒక్క‌డే రెండు అంకెల స్కోరు చేయ‌గా మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే ప‌రిమితం అయ్యారు. దీంతో పాకిస్తాన్ ఓ మోస్త‌రు స్కోరుకే ప‌రిమిత‌మైంది. ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో టామ్ స్ట్రాకర్ ఆరు వికెట్ల‌తో పాకిస్తాన్ ప‌త‌నాన్ని శాసించాడు. 

స్వల్ప లక్ష్య చేధనలో కష్టాలు...

 180 ప‌రుగుల స్వల్ప ల‌క్ష్య ఛేద‌న‌లో ఆస్ట్రేలియా జ‌ట్టు త‌డ‌బ‌డి నిల‌బ‌డింది. ఓపెన‌ర్ సామ్ కాన్స్టాస్ (14), కెప్టెన్ హ్యూ వీబ్‌జెన్(4), హర్జాస్ సింగ్ (0), వికెట్ కీప‌ర్ ర్యాన్ హిక్స్ (0) లు విఫ‌లం కావ‌డంతో ఆస్ట్రేలియా 59 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. అయితే.. మ‌రో ఓపెన‌ర్ హ్యారీ డిక్సన్ (50; 75 బంతుల్లో 5 ఫోర్లు), ఒలివర్ పీక్ (49; 75 బంతుల్లో 3 ఫోర్లు) కంగారులను విజయం దిశగా నడిపించారు. హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్న అనంత‌రం హ్యారీ డిక్స‌న్ ఔట్ అయ్యాడు. అత‌డిని అరాఫత్ మిన్హాస్ క్లీన్ బౌల్డ్ చేశాడు. హ్యారీ డిక్సన్-ఒలివర్ పీక్ లు ఐదో వికెట్ 43 ప‌రుగులు జోడించారు. చివర్లో బెల్, ఒలివ‌ర్ పీక్ ఔట్ కావ‌డంతో మ్యాచులో ఉత్కంఠ చెల‌రేగింది. కల్లమ్ విడ్లర్(19నాటౌట్‌), రాఫ్ మాక్‌మిల్లన్(2 నాటౌట్‌) ఆఖ‌రి వికెట్ అజేయంగా 16 ప‌రుగులు జోడించి జ‌ట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. పాకిస్తాన్ బౌల‌ర్ల‌లో అలీ రజా నాలుగు వికెట్లు తీశాడు. అరాఫత్ మిన్హాస్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఉబైద్ షా, నవీద్ అహ్మద్ ఖాన్ చెరో వికెట్ సాధించారు.  ఈ ప్రపంచకప్‌లో భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్స్‌కు చేరుకుంది. ఇప్పటివరకు మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడింది. ఈ 6 మ్యాచ్‌లు ఆడగా, అన్ని మ్యాచ్‌ల్లోనూ ఏక పక్ష విజయాలు సాధించింది. భారత యువశక్తి ఎంత పటిష్టంగా ఉందో ఈ మ్యాచ్‌ ఫలితాలను బట్టి అర్థమవుతోంది. సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టును ఓడించిన ఉదయ్ సహారన్ జట్టు ఆత్మవిశ్వాసంతో దూసుకుపోతోంది. ఇక ఫైనల్లోనూ గెలిస్తే ఆరోసారి కప్పు భారత్‌కు వస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Gambhir Coaching Split: రెండు గ్రూపులుగా విడిపోనున్న భారత కోచింగ్ స్టాఫ్.. గంభీర్ వన్డేలతోనే ఉండగా, టెస్టుల కోసం వెల్లింగ్టన్ వెళ్లనున్న మోర్కెల్, సితాన్షు
రెండు గ్రూపులుగా విడిపోనున్న భారత కోచింగ్ స్టాఫ్.. గంభీర్ వన్డేలతోనే ఉండగా, టెస్టుల కోసం వెల్లింగ్టన్ వెళ్లనున్న మోర్కెల్, సితాన్షు
Hardik - Arshdeep Swap: PBKSకు హార్దిక్..! MIకు అర్ష్‌దీప్ .. ఐపీఎల్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని మెగా ట్రేడింగ్
PBKSకు హార్దిక్..! MIకు అర్ష్‌దీప్ .. ఐపీఎల్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని మెగా ట్రేడింగ్
Arjun Rajput Century: అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
Shami Top Spells: విదేశీ పిచ్‌లపై నిప్పులు చెరిగిన  షమీ.. కెరీర్‌ను మలుపు తిప్పిన టాప్ 5 టెస్ట్ స్పెల్స్
విదేశీ పిచ్‌లపై నిప్పులు చెరిగిన  షమీ.. కెరీర్‌ను మలుపు తిప్పిన టాప్ 5 టెస్ట్ స్పెల్స్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: 9 సార్లు ఛాన్స్ ఇచ్చిన కాంగ్రెస్.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా చిన్నారెడ్డి! అసలేం జరుగుతోంది?
9 సార్లు ఛాన్స్ ఇచ్చిన కాంగ్రెస్.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా చిన్నారెడ్డి! అసలేం జరుగుతోంది?
పవన్ కల్యాణ్ అనా విడాకులు - వైరల్ అవుతోన్న చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం!
పవన్ కల్యాణ్ అనా విడాకులు - వైరల్ అవుతోన్న చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం!
Revanth Reddy KTR Personal Attack : కేసీఆర్ సైలెన్స్ - కేటీఆర్‌నే ఇక ప్రత్యర్థిగా రేవంత్ పరిగణిస్తున్నారా?
కేసీఆర్ సైలెన్స్ - కేటీఆర్‌నే ఇక ప్రత్యర్థిగా రేవంత్ పరిగణిస్తున్నారా?
AP CPS Employees: సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఓపీఎస్‌లోకి మారేందుకు అవకాశం!
సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఓపీఎస్‌లోకి మారేందుకు అవకాశం!
Pawan kalyan Divorce: షాకింగ్ విషయం తెలిపిన పవన్ కల్యాణ్.. అనా లెజ్‌నెవాతో వివాహబంధానికి వీడ్కోలు
Pawan kalyan Divorce: షాకింగ్ విషయం తెలిపిన పవన్ కల్యాణ్.. అనా లెజ్‌నెవాతో వివాహబంధానికి వీడ్కోలు
Telangana Politics: కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
Tulsi Leaves Benefits : తులసి ఆకులు రోజూ తింటే ఏమవుతుంది? జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు లాభాలివే
తులసి ఆకులు రోజూ తింటే ఏమవుతుంది? జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు లాభాలివే
Polimera 3 Viraavi : 'పొలిమేర'లో పవర్ ఫుల్ విరావి వచ్చేశాడు - యాక్షన్ కింగ్ అర్జున్ న్యూ లుక్ చూశారా?
'పొలిమేర'లో పవర్ ఫుల్ విరావి వచ్చేశాడు - యాక్షన్ కింగ్ అర్జున్ న్యూ లుక్ చూశారా?
Embed widget