అన్వేషించండి

T20 World Cup 2024: దిగ్గజ ఆటగాళ్లు వీడ్కోలుకు సిద్ధమేనా?, కోహ్లీ నుంచి డికాక్‌ వరకు 10 మంది గుడ్‌బై !

T20 World Cup: వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న టీ 20 వరల్డ్ కప్ లో పలు సంచలనాలు నమోదవుతున్నాయి. అయితే ఈ ప్రపంచ కప్ తరువాత మాత్రం కొంతమంది దిగ్గజ ఆటగాళ్ళు రిటైర్ అయ్యే అవకాశం ఉంది.

T20 World Cup Facts: దిగ్గజ ఆటగాళ్ల రిటైర్‌మెంట్‌ ప్రకటించే సమయం ఆసన్నమైందా? అభిమానులు బాధపడ్డా... మరో ప్రపంచకప్‌ ఆడాలనే కోరుకుంటున్నా సరే ప్రస్థుత పరిస్థితులు చూస్తుంటే మాత్రం క్రికెట్‌ ప్రపంచం ఆశ్చర్యపోయేలా దిగ్గజ ఆటగాళ్లు తమ రిటైర్‌మెంట్‌ను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఈ టీ 20 ప్రపంచకప్‌లో సుమారు పది మంది కీలక ఆటగాళ్లు పొట్టి క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నట్లు తెలుస్తోంది. ఇందులో చాలామంది ఆటగాళ్లు క్రికెట్‌పై తమదైన ముద్ర వేశారు.  ఇదే చివరి టీ20 ప్రపంచ కప్‌గా భావిస్తున్న ఆటగాళ్ల జాబితాను ఓసారి పరిశీలిస్తే...

1‌) డేవిడ్ వార్నర్ ( David Warner)
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ వయస్సు ఇప్పుడు 38 ఏళ్లు. పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న వార్నర్‌కు ఇదే చివరి ప్రపంచకప్‌ అని భావిస్తున్నారు. వచ్చే టీ20 ప్రపంచకప్‌లో డేవిడ్ వార్నర్ ఆడడం చాలా కష్టం. కాబట్టి డేవిడ్ వార్నర్‌కు ఇదే టీ20 ప్రపంచకప్ అని భావిస్తున్నారు
 
2‍) జోస్ బట్లర్ ( Jos Buttler)
ఇంగ్లండ్‌ బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌ కూడా ఫామ్‌ లేమితో సతమతమవుతున్నాడు. పొట్టి క్రికెట్‌లో పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. 33 ఏళ్ల బట్లర్‌కు ఇదే చివరి టీ20 ప్రపంచకప్‌ అని చాలామంది భావిస్తున్నారు. 
 
3‌) జానీ బెయిర్‌స్టో ( Jonny Bairstow)
ఇంగ్లండ్‌ ఆటగాడు బెయిర్‌స్టో  కూడా పరుగులు చేసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ఐపీఎల్‌లో కూడా బెయిర్‌ స్టో వరుసగా విఫలమయ్యాడు. ఈ టీ 20 ప్రపంచకప్‌లోనూ బెయిర్‌ స్టో మెరుగ్గా రాణించడం లేదు. 34 ఏళ్ల జానీ బెయిర్‌స్టో చివరిసారిగా టీ20 ప్రపంచకప్‌లో ఆడుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.
 
4) మార్కస్ స్టోయినిస్ ( marcus stoinis)
ఆస్ట్రేలియా ఆటగాడు మార్కస్ స్టోయినిస్‌కు కూడా ఇదే చివరి ప్రపంచకప్‌ కావచ్చు. స్టోయినిస్‌ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో తరచుగా విఫలమవుతున్నాడు. ఇప్పటికే స్టోయినిస్ వయస్సు 35 సంవత్సరాలు. వచ్చే ప్రపంచకప్‌ నాటికి స్టోయినిస్ వయస్సు 37 ఏళ్లకు చేరుతుంది. ఆ వయసులో స్టోయినిస్‌ జట్టులోకి రావడం చాలా కష్టం.
 
5‌) మిచెల్ స్టార్క్ (Mitchell Starc)
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ కూడా ఫిట్‌నెస్ సంబంధిత సమస్యలతో పోరాడుతున్నాడు. స్టార్క్‌ వయస్సు ఇప్పటికే 35 సంవత్సరాలు. అందువల్ల వచ్చే టీ20 ప్రపంచకప్ వరకు మిచెల్ స్టార్క్ ఆడటం చాలా కష్టం. 
 
6‌) విరాట్ కోహ్లీ (Virat Kohli)
ఈ టీ 20 ప్రపంచకప్‌లో విరాట్‌ కోహ్లీ వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. టీ 20 క్రికెట్‌లో కోహ్లీ స్ట్రైక్ రేట్, ఫామ్‌పై నిరంతరం ప్రశ్నలు ఉత్పన్నమవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం కోహ్లీ వయసు 36 ఏళ్లు. కోహ్లీ ఫిట్‌నెస్ అద్భుతంగా ఉన్నప్పటికీ, రాబోయే టీ20 ప్రపంచకప్‌లో ఆడేందుకు కోహ్లీకి వయసే ఆటంకం కలిగించవచ్చు.
 
7) రోహిత్‌ శర్మ (Rohit Sharma)
భారత కెప్టెన్ రోహిత్ శర్మ వయసు 37 ఏళ్లు దాటాయి. బ్యాటింగ్‌లో రోహిత్‌ గతంలో మాదిరిగా రాణించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ శర్మకు తదుపరి టీ20 ప్రపంచకప్ వరకు ఆడడం అంత సులువు కాదు. 
 
8) ట్రెంట్ బోల్ట్ (Trent Boult)
న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. బ్యాటర్లను బాగానే ఇబ్బంది పెడుతున్నాడు. బౌల్ట్‌కి ఇదే చివరి టీ 20 ప్రపంచకప్‌ అని చాలామంది భావిస్తున్నారు. బౌల్ట్‌ వయస్సు దాదాపు 35 ఏళ్లు. 
 
9) కేన్ విలియమ్సన్ (Kane Williamson)
న్యూజిలాండ్‌ బ్యాటర్‌ కేన్ విలియమ్సన్ వయసు దాదాపు 34 ఏళ్లు. ఇదే కాకుండా విలియమ్సన్‌ టీ 20 ఫార్మాట్‌కు తనను తాను మార్చుకునేందుకు కష్టపడుతున్నాడు. ఇప్పటికే కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ను కాదన్నాడు. ఇక వచ్చే టీ 20 ప్రపంచకప్‌లో విలియమ్సన్‌ను చూడడం కష్టమే.
 
10) క్వింటన్ డి కాక్ (Quinton de Kock)
దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ క్వింటన్ డి కాక్ చివరి T20 ప్రపంచకప్‌లో ఆడుతున్నాడు. ఇదే తనకు చివరి టీ 20 వరల్డ్‌కప్‌ అని ఇప్పటికే డికాక్‌ ప్రకటించాడు. దీని తర్వాత తాను దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించనని చాలాసార్లు సూచించాడు. ఈ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ వచ్చే టీ20 ప్రపంచకప్‌లో ఆడే అవకాశాలు చాలా తక్కువ.
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Jana Nayagan:విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
​​US Student Visa :భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Embed widget