Team India : కొట్టండి డీజేలు, కట్టండి ఫ్లెక్సీలు, వేయండి డ్యాన్స్‌లు, విశ్వ విజేతలు వచ్చేస్తున్నారు!
T20 World Cup 2024: teem ఇండియా ఆటగాళ్ళు బార్బడోస్ లో చిక్కుకున్న నేపథ్యంలో బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. టీ 20 ప్రపంచకప్ భారత్‌కు వచ్చేస్తోందని బీసీసీఐ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
Rohit Sharma And His Team: టీ 20 ప్రపంచకప్(T20 World Cup 2024) గెలిచి కోట్ల మంది అభిమానుల మనసులు గెలుచుకున్న టీమిండియా ఆటగాళ్లు బార్బడోస్ నుంచి స్వదేశానికి తిరిగి ప్రయాణమయ్యారు. బీసీసీఐ(BCCI) ప్రకటించిన దానిపై ప్రకారం టీమిండియా(Team India) ఆటగాళ్లు బార్బడోస్ నుంచి తిరిగి స్వదేశానికి పయనమయ్యారు. తిరిగి రావడం కాస్త ఆలస్యమైనా భారత ఆటగాళ్లు బార్బడోస్(Barbados) నుంచి బయలుదేరారని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. బార్బడోస్‌లో తుఫాను కాస్త శాంతించడంతో... భారత ఆటగాళ్లు బీసీసీఐ ప్రత్యేక విమానంలో భారత్‌కు పయనమయ్యారు. జూన్ 29న టీ 20 ప్రపంచకప్ గెలిచి విశ్వ విజేతలుగా నిలిచిన నాటి నుంచి భారత క్రికెట్ జట్టు బార్బడోస్‌లోనే చిక్కుకుపోయింది. తుఫాను కారణంగా టీమ్ ఇండియా బార్బడోస్‌లోనే ఉండవలసి వచ్చింది. తుఫాను బీభత్సం సృష్టిస్తుండడంతో బార్బడోస్ విమానాశ్రయాన్ని మూసేయడంతో పాటు బార్బడోస్‌లో కర్ఫ్యూ లాంటి పరిస్థితి నెలకొంది. నిన్న బార్బడోస్ నుంచి టీమ్ ఇండియా బయలుదేరాల్సి ఉండగా... తుపాను వల్ల ఆలస్యమైంది. కానీ తుపాను కాస్త విరామం ఇవ్వడంతో భారత జట్టు అక్కడి నుంచి బయల్దేరింది.
It's coming home 🏆#TeamIndia pic.twitter.com/Pxx4KGASb8
— BCCI (@BCCI) July 3, 2024