India vs Australia T20: ఇక టీ 20 సమరం షురూ, విశాఖ చేరుకున్న భారత్-ఆస్ట్రేలియా జట్లు
Ind Vs Aus T20 : గురువారం వైజాగ్ వేదిగా ఐదు టీ 20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే వైజాగ్ చేరుకున్న భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ జట్లు ప్రాక్టీస్ ప్రారంభించాయి.
Vizag T20 Match News: అలా భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్(, ODI World Cup 2023) ముగిసిందో లేదో టీమిండియా(Team india) యువ జట్టు ఆస్ట్రేలియా(Australia)తో టీ 20 సమరానికి సిద్ధమైంది. అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ యువ మంత్రం జపిస్తూ ఇప్పటికే సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో జట్టును ప్రకటించింది. గురువారం వైజాగ్ వేదిగా ఐదు టీ 20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే వైజాగ్ చేరుకున్న భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ జట్లు ప్రాక్టీస్ ప్రారంభించాయి. 23న వైజాగ్‌లో తొలి టీ 20, 26న తిరువనంతపురం, 28న గుహవటి, డిసెంబర్ 1న రాయపూర్, 3న బెంగళూరులో ఐదు టీ 20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఏడాదిగా టీ20 మ్యాచ్‌లకు సారథ్య బాధ్యతలు వహిస్తున్న హర్తిక్ పాండ్యా ప్రపంచకప్ మ్యాచ్‌లో గాయపడడంతో ఆటకు దూర మయ్యాడు. ఈ సిరీస్‌లో కూడా దూరం కావడంతో వైస్ కెప్టెన్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మూడు మ్యాచ్‌లకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రోహిత్‌శర్మ, విరాట్ కోహ్లి ఈ సిరీస్‌లో ఆడడం లేదు. ప్రపంచకప్‌లో తన ప్రతిభను చాటిన మరో ఆటగాడు శ్రేయస్ అయ్యర్ మూడు మ్యాచ్‌లు ఆడడం లేదు. 4, 5వ మ్యాచ్‌లో ఆడనున్నాడు.
నవంబర్ 23, 26, 28, డిసెంబర్ 1, 3 తేదీల్లో.. టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ టీ 20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్టు.. 15 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది. కీపర్ మాథ్యూ వేడ్‌కు సారధ్య బాధ్యతలు కట్టబెట్టింది. జట్టులో వార్నర్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మ్యాక్స్‌వెల్, స్టోయినిస్, జంపాలకు స్థానం దక్కింది. ఆసిస్ జట్టులో చాలా వరకు వరల్డ్‌కప్‌లో ఆడుతున్న ఆటగాళ్లే ఉన్నారు. అయితే కమ్మిన్స్, స్టార్క్, హేజల్‌వుడ్, కెమరూన్ గ్రీన్, మిచెల్ మార్ష్ లకు విశ్రాంతి ఇచ్చారు. దీంతో జట్టులో మాథ్యూ వేడ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినీస్, జాష్ ఇంగ్లీస్, జాసన్ బెరన్‌డార్ఫ్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లీస్, స్పెన్సర్ జాన్సన్, తన్వీర్ సంఘా, సీన్ అబాట్ ఉన్నారు.
ఇక ఈ క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వచ్చే ప్రేక్షకులు పోలీసులకు సహకరించాలని విశాఖ డీసీపీ కోరారు. మ్యాచ్ ప్రారంభం కంటే ముందుగానే వచ్చి ఎవరి సీట్లలో వారు కూర్చోవాలని వాహనాలు పార్కింగ్ విషయంలో నిబంధనలు పాటించాలనారు. స్టేడియానికి విలువైన వస్తువులు, ఎక్కువ మొత్తంలో నగదు తీసుకురావద్దని విశాఖ పోలీసులు సూచించారు. సెక్యూరిటీ పరంగా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నామని.. టికెట్లపై ఒక ప్రత్యేక మార్కు ఉండేలా డిజైన్ చేశామని,స్కాన్‌లో ఆ మార్కు రాకపోయినా, కలర్ జిరాక్స్ టికెట్లు తీసుకొచ్చినా అనుమతించేది లేదని స్పష్టం చేశారు. దానికి ఎవరూ బాధ్యత వహించరని, ఎటువంటి కారణాలు చెప్పినా మ్యాచ్ కు అనుమతించేది లేదు సరికదా అలా వచ్చిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆస్ట్రేలియా(Austrelia) క్రికెట్(Cricket) జట్టుకు ఈ ఏడాది స్వర్ణ యుగమనే చెప్పాలి. అసలు ఏ మాత్రం అంచనాలు లేకుండా కంగారులు వన్డే ప్రపంచకప్(World cup) ను కూడా కైవసం చేసుకున్నారు. ఫైనల్లో అద్భుత ఆటతీరుతో భారత్(Bharat)ను కంగుతినిపించి ఆరోసారి ప్రపంచ కప్‌ను సాధించారు. అయితె ప్యాట్ కమిన్స్ నేతృత్వంలోని జట్టు ఈ ఏడాది అద్భుతమే చేసింది. ఒక్క ఏడాదిలో ఏకంగా మూడు కప్పులను కైవసం చేసుకుని గోల్డెన్ ఇయర్‌గా మార్చుకుంది. యాషెస్ సిరీస్‌ను నిలబెట్టుకోవడమే కాకుండా టెస్ట్ ఛాంపియన్ షిప్, వన్డే ప్రపంచకప్‌లను కైవసం చేసుకుని ఈ ఏడాదిని ఆస్ట్రేలియా చిరస్మరణీయం చేసుకుంది.