అన్వేషించండి
Advertisement
T20 World Cup 2024 OMN vs NAM: టీ 20 ప్రపంచకప్‌లో మ్యాచ్ టై, పసికూనల మహా పోరు
T20 World Cup 2024 OMN vs NAM: టీ 20 ప్రపంచకప్‌లో పసికూనల మధ్య జరిగిన పోరు టైగా ముగిసింది. ఒమన్ నమీబియా మధ్య జరిగిన మ్యాచ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.
T20 World Cup 2024 OMN vs NAM Scores tied: టీ 20 ప్రపంచకప్(T20 World Cup)లో పసికూనల మధ్య జరిగిన పోరు ఉత్కంఠభరితంగా సాగింది. ఒమన్ నమీబియా(OMN vs NAM) మధ్య జరిగిన మ్యాచ్ టైగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్... నమీబియా బౌలర్ల ధాటికి 109 పరుగులకే కుప్పకూలింది. నమీబియా బౌలర్ రుబెన్ ట్రంపెల్ మెన్ నాలుగు వికెట్లతో ఒమన్ పతనాన్ని శాసించాడు. ఒమన్ బౌలర్లలో ఏడుగురు బ్యాటర్లు కనీసం సింగిల్ డిజిట్‌ను కూడా దాటలేదు. అనంతరం 110 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా కూడా 109 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో నమీబియా.. తడబడింది. 109 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన దశలో నమీబియా ఒకే పరుగు చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. నమీబియా బ్యాటర్లలో జాన్ ఫ్రైలింక్ 45 పరుగులతో పోరాడి నమీబియాకు విజయాన్ని అందించాడు.
ప్రతీ పరుగు కష్టమే
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన నమీబియా... ఒమన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. పిచ్ బౌలింగ్‌కు అనుకూలిస్తున్న వేళ ఒమన్ బ్యాటర్లకు... నమీబియా బౌలర్లు చుక్కలు చూపించారు. ప్రతీ పరుగుకూ శ్రమపడేలా చేశారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ తొలి బంతికే వికెట్ తీసి ఒమన్ పతనాన్ని.. నమీబియా బౌలర్లు ప్రారంభించారు. ఒమన్ బ్యాటర్ కశ్యప్ ప్రజాపతి ఎదుర్కొన్న తొలి బంతికే వికెట్ల ముందు దొరికిపోయాడు. నమీబియా బౌలర్ రుబెన్ ట్రంపెల్ మెన్ ఈ వికెట్‌ను తీశాడు. ఆ తర్వాతి బంతికే మరో వికెట్ తీసిన ట్రంపెల్ మెన్ ఒమన్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో.. తొలి రెండు బంతులకు వికెట్ తీసిన ట్రంపెల్‌మెన్... ఒమన్‌ను చావు దెబ్బ తీశాడు. దీంతో స్కోరు బోర్డుపై ఒక్క పరుగు కూడా లేకుండా ఒమన్ రెండు వికెట్లు కోల్పోయింది. ఈ పతనం ఆగలేదు. స్కోరు బోర్డుపై పది పరుగులు చేరాయో లేదో ఒమన్ మరో వికెట్ కోల్పోయింది. నసీమ్ ఖుషీ ఆరు పరుగులు చేసి అవుటయ్యాడు. దీంతో పది పరుగులకే ఒమన్ మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ జసీమ్ మక్‌సూద్-ఖలీద్ కాలీ ఒమన్‌ను ఆదుకున్నారు. సమయోచితంగా బ్యాటింగ్ చేసిన ఈ ఇద్దరు స్కోరు బోర్డును 37 పరుగులకు తీసుకెళ్లారు. ఇక్కడే మరో వికెట్ పడడంతో ఒమన్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఖలీద్ కాళీ 34 పరుగులతో పర్వాలేదనిపించాడు. మక్‌సూద్ 22 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాటర్లందరూ చేతులెత్తేశారు. ఒమన్ బ్యాటర్లలో ఖలీద్ కాళీ మినహా ఏ ఒక్కరు 25 పరుగుల మార్క్‌ను దాటలేదు. దీంతో ఒమన్ 109 పరుగులకే కుప్పకూలింది. నమీబియా బౌలర్లలో రుబెన్ ట్రంపెల్ మెన్ నాలుగు వికెట్లతో సత్తా చాటగా...డేవిడ్ వైస్ మూడు వికెట్లు తీశాడు.
నమీబియా కష్టంగానే
110 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా కూడా లక్ష్య ఛేదనలో కష్టపడింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్ రెండో బంతికే వ్యాన్ లింగెన్‌ను ఒమన్ బౌలర్ బిలాల్ ఖాన్ అవుట్ చేశాడు. దీంతో ఒక్క పరుగు చేయకుండానే నమీబియా తొలి వికెట్ కోల్పోయింది. కానీ రెండో వికెట్‌కు నికోలస్ డేవిన్-ఫ్రైలింక్ 42 పరుగులు జోడించడంతో నమీబియా లక్ష్యం దిశగా సాగింది. ఫ్రైలింక్ 45 పరుగులు చేయడంతో నమీబియా సునాయస విజయం సాధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఒమన్ బౌలర్లు పట్టు విడవలేదు. చివరి వరకూ పోరాడారు. చివరి ఓవర్ చివరి బంతికి రెండు పరుగులు కావాల్సిన దశలో ఒకే పరుగు రావడంతో మ్యాచ్ టై అయింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion