ICC 2023 Awards: టీ 20 ప్రపంచకప్ ప్రారంభం కాకుండానే అవార్డులు అందుకున్న టీం ఇండియా ఆటగాళ్ళు
ICC Awards 2023: టీ 20 ప్రపంచ కప్ ప్రారంభం కాకముందే భారత క్రికెట్ జట్టు సభ్యులు అవార్డులు అందుకున్నారు. గతేడాది అత్యుత్తమ ప్రదర్శన చేసినందుకు ICC టీమ్ ఆఫ్ ది ఇయర్ క్యాప్‌లు అందజేసింది.
7 Indian Winners of ICC Awards 2023: టీ20 వరల్డ్ కప్ 2024 కోసం టీం ఇండియా న్యూయార్క్ లో దిగిన విషయం తెలిసిందే. వాళ్లు ఇంకా వామప్ మ్యాచ్‌లు కూడా ఆడకుండానే ఏడుగురు టీం సభ్యులకు ఐసీసీ అవార్డులు ప్రకటించింది. గతేడాది చేసిన అత్యుత్తమ ప్రదర్శన కుగానూ ఐసిసి ఈ అవార్డులు అందించింది. టీమ్ ఆఫ్ ది ఇయర్ క్యాప్‌లు ఆటగాళ్లు అందుకున్నారు.
ఎదురులేని సూర్యభాయ్..
టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ విభాగంలో వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ అయిన సూర్యకుమార్ యాదవ్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 861 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. అందుకే ఐసీసీ అతన్ని మెన్స్ టీ20 ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో సత్కరించింది. దీంతోపాటు అతనికి టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్ క్యాప్ కూడా అందించింది. సూర్యకుమార్ యాదవ్ తరువాత వరుసగా ఫిల్ సాల్ట్ 788 పాయింట్లతో రెండో స్థానంలో , మమ్మద్ రిజ్వాన్ 769 పాయింట్లతో 3 వ స్థానంలో ,తరువాత 4,5 స్థానాల్లో బాబర్ ఆజాం, మార్‌క్రమ్ ఉన్నారు. టీమ్ఇండియా స్టార్ ఆటగాడు ఇక టీమ్ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఓ స్థానంపైకి ఎగబాకి 714 రేటింగ్ పాయింట్లతో ఆరో స్థానానికి చేరుకున్నాడు. యువ ఆటగాడు రుతురాజ్ కూడా 11 వ స్థానంలో నిలిచాడు.
View this post on Instagram
టీ 20 బౌలింగ్ లో విభాగంలో..
బౌలింగ్ విభాగంలో ఇండియన్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ తమ తమ స్థానాలను మరింతగా మెరుగుపరచుకున్నారు. అక్షర్ పటేల్ ఓ స్థానం ఎగబాకి మూడో స్థానానికి చేరుకోగా, అర్ష్‌దీప్ సింగ్ ఏకంగా 3 స్థానాలు ఎగబాకి 16 వ స్థానానికి చేరుకున్నాడు. బౌలింగ్ లో అదరగొడుతున్న టీం ఇండియా ఆటగాడు రవి బిష్ణోయ్ 5 వ స్థానంలో ఉన్నాడు.
ఆల్రౌండర్ ఆఫ్ ది ఇయర్ రవీంద్ర జడేజా
ఐసిసి అందజేసే ఆల్రౌండర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అందుకున్నారు. జడేజా తరువాత స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ ఉండగా 6 వ స్థానంలో ఆక్సర్ పటేల్ నిలిచాడు. ఇక ఐసీసీ అందించిన వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ లో చోటు దక్కించుకున్నబ్యాటర్ లు కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, అలాగే బౌలింగ్ లో కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్లు కూడా క్యాప్స్ అందుకున్నారు.
వన్డే క్రికెట్ ఆఫ్ ది ఇయర్ కోహ్లీ
వన్డే క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును రన్ మెషిన్ కింగ్ కోహ్లీ గెలుచుకున్నాడు. వన్డే ఫార్మాట్‌లో ఆయన అసాధారణమైన ఆటతీరుకు మెచ్చి ఈ పురస్కారం వరించింది. వన్డే ప్రపంచ కప్ 2023లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గెలుచుకున్న విరాట్ కోహ్లిని వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023గా ఐసీసీ ప్రకటించింది. ప్రపంచ కప్‌లో భారత్ ఫైనల్ వరకు రావడానికి కోహ్లీ ప్రధాన కారణమని నమ్మి పురస్కారం అందజేసింది. వన్డేల్లో అత్యధిక సెంచరీల రికార్డు ఛేదించడం కూడా ఆయనకు ప్లస్ అయింది.
పాట్ కమిన్స్‌కు సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ
ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ఐసిసి మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు అందుకున్నాడు. దీంతో ఆయన సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ విజేతగా ప్రకటించింది ఐసీసీ. అన్ని ఫార్మాట్‌లో కెప్టెన్‌గా బ్యాట్‌తో బాల్‌తో రాణించడమే కాకుండా ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ గెలవడం, ఐసీసీ వన్డే వరల్డ్ కప్ విజయం, యాషెస్ ట్రోపీ నిలబెట్టుకోవడం ఇలా అద్భుతమైన ఆరు విజయాలు సాధించినందుకు ఈ అవార్డుతో సత్కరించారు.