అన్వేషించండి

MS Dhoni, Suresh Raina Retirement: ధోనీ రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన వెంటనే రైనా కూడా గుడ్ బై.. విషయం తెలిసి MSD రియాక్ష‌న్ ఏంటంటే ?

MS Dhoni  రిటైర్మెంట్ ప్రకటించిన కాసేపటికే తన అల్విదా ప్రకటించిన నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని తాజాగా జరిగిన సంభాషణలో రైనా వెల్లడించాడు.

Suresh Raina Retirement Secret Revealed: భారత క్రికెట్‌లో ఎంఎస్, ధోనీ, సురేశ్ రైనా బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియా టీమ్‌తో పాటు Chennai Super Kingsలో దాదాపు దశాబ్దానికి పైగా కలిసి ప్రయాణించిన ఈ ఇద్దరు 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు ఒకే రోజు గుడ్‌బై చెప్పి, అభిమానుల‌కు షాకిచ్చారు. ధోనీ సాయంత్రం 7:29 గంటలకు సోషల్ మీడియా ద్వారా తన రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. కొద్దిసేపటికే రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. అయితే తాను కూడా అదే రోజు రిటైర్ అవుతానని ధోనీకి చెప్పినప్పుడు అతడు ఆశ్చర్యపోయాడని రైనా ఇప్పుడు వెల్లడించాడు.

Read Also: Jasprit Bumrah Fitness: బుమ్రాకు బ్యాక‌ప్ పేసర్ ను రెడీ చేస్తున్న బీసీసీఐ..  ఆ యువ బౌల‌ర్ పై ఫోకస్ పెట్టిన టీమ్ మేనేజ్మెంట్

కుటుంబం కోసం నిర్ణ‌యం..

మాజీ ఇండియా బ్యాటర్ ఆకాశ్ చోప్రాతో మాట్లాడిన రైనా తన నిర్ణయం వెనుక కుటుంబం కూడా ఒక ముఖ్యమైన కారణమని వెల్ల‌డించాడు. క్రికెట్ కోసం ఆటగాడిగా ఎంతో త్యాగం చేయాల్సి వస్తుందని, దేశం కోసం ఆడటంతో పాటు తల్లిదండ్రులు కూడా ఎన్నో త్యాగాలు చేస్తారని గుర్తుచేశాడు. అయితే ఆ సమయంలో తన వయసు 32 లేదా 33 ఏళ్లుగా ఉన్నా, కుటుంబంతో ఎక్కువ సమయం గడపాల్సిన అవసరం ఉందని భావించినట్లు రైనా తెలిపాడు. ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అత‌ని ద‌గ్గ‌రికి వెళ్లి తన నిర్ణయం కూడా పూర్తయిందని చెప్పగా, అస్స‌లు నువ్వేం చేశావంటూ ధోనీ ఆశ్చర్యపోయాడని గుర్తుచేశాడు. ఆ సమయంలో ఇద్దరూ CSK బయోబబుల్‌లో ఉన్నారు. కరోనా కారణంగా 2020 IPL సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు UAEలో నిర్వహించడంతో, అక్కడి నుంచి టోర్నమెంట్ కోసం UAEకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

Read Also: Dhoni Role Revealed: ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగనని తేల్చేసిన స్టార్ ప్లేయ‌ర్.. దూబేకు బౌలింగ్ ఇవ్వ‌క‌పోవ‌డం త‌ప్పిద‌మే.. సీఎస్కే మాజీ ప్లేయ‌ర్..

తన కోసం ధోనీ త్యాగం..

ధోనీతో తన బంధం గురించి కూడా రైనా ఆసక్తికర విషయాలు చెప్పాడు. తనకు బ్యాటింగ్ ఆర్డర్‌లో పై స్థానంలో అవకాశం రావడానికి ధోనీ తన స్థానాన్ని త్యాగం చేశాడని తెలిపాడు.సౌర‌వ్ గంగూలీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో ధోనీ పై స్థానంలో బ్యాటింగ్ చేసేవాడు. అయితే రైనా, యువ‌రాజ్ సింగ్ ల‌కు ఎక్కువ అవకాశాలు ఇచ్చేందుకు ధోనీ తన స్థానాన్ని మార్చుకున్నాడని రైనా చెప్పాడు. తనపై ధోనీ చూపించిన నమ్మకం తనను మరింత కష్టపడేలా చేసిందని రైనా తెలిపాడు. ఫీల్డింగ్ అయినా బౌలింగ్ అయినా, బ్యాటింగ్ అయినా పూర్తి డెడికేష‌న్ తో టీమ్ కోసం ఆడాలని అప్పుడే నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. తన కోసం ఎవరైనా ఇంత త్యాగం చేస్తే తిరిగి ఏదైనా ఇవ్వాలనే భావన ఉండాలని  చెప్పాడు. డబ్బు అందరికీ ఉండొచ్చని, కానీ ఇత‌రుల కోసం త్యాగాలు చేసేంత పెద్ద మనసు అంద‌రికీ ఉండ‌బోద‌ని పేర్కొన్నాడు. ధోనీతో తన స్నేహం అలా ఏర్పడిందని, ఆ బంధం ఎప్పటికీ కొనసాగుతుందని రైనా చెప్పాడు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Shami Snub Drama: భువీని ఆద‌రించి, షమీని ఎందుకు విస్మ‌రించారు..! కివీస్ టూర్ లో వెటరన్ పేసర్ కు సెలెక్టర్ల మొండిచేయి..
భువీని ఆద‌రించి, షమీని ఎందుకు విస్మ‌రించారు..! కివీస్ టూర్ లో వెటరన్ పేసర్ కు సెలెక్టర్ల మొండిచేయి, రవిశాస్త్రి సంచలన కామెంట్స్
PCB Commentary Ban: ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
Gambhir Setup Flaw: ఓటములకు గంభీర్ వ్యూహమే కారణం.. గవాస్కర్ సంచలన విశ్లేషణ, హార్దిక్ కోసం వెతుకులాటపై ఘాటు వ్యాఖ్యలు
ఓటములకు గంభీర్ వ్యూహమే కారణం.. గవాస్కర్ సంచలన విశ్లేషణ, హార్దిక్ కోసం వెతుకులాటపై ఘాటు వ్యాఖ్యలు
Yashasvi Jaiswal Selection Mystery: రెండు సెంచరీలు కొట్టినా జట్టులో చోటు నిల్.. జైస్వాల్ కు సెలెక్టర్ల మొండిచేయి,  కొత్త అవతారంలోకి..
2 సెంచరీలు కొట్టినా జట్టులో చోటు నిల్.. జైస్వాల్ కు సెలెక్టర్ల మొండిచేయి,  కొత్త అవతారంలోకి మారిన స్టార్ ఓపెనర్..!
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana on El Nino Conditions: ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ అప్రమత్తం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ అప్రమత్తం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
Deputy CM Pawan Kalyan: పల్లె పండుగ రోడ్డు తవ్వేసిన వైసీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులకు పవన్ కళ్యాణ్ ఆదేశం
పల్లె పండుగ రోడ్డు తవ్వేసిన వైసీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులకు పవన్ కళ్యాణ్ ఆదేశం
Telangana Congress: గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు- హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు- హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ
ETV Win OTT : ఈటీవీ విన్‌లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ - రాబోయే రెండు నెలల్లో సూపర్ మూవీస్ / వెబ్ సిరీస్
ఈటీవీ విన్‌లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ - రాబోయే రెండు నెలల్లో సూపర్ మూవీస్ / వెబ్ సిరీస్
Tiger Shroff : టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
Renault Duster Hybrid లాంచ్.. 29 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు ధర హైదరాబాద్‌లో ఎంతంటే
Renault Duster Hybrid లాంచ్.. 29 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు ధర హైదరాబాద్‌లో ఎంతంటే
PCB Commentary Ban: ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
Embed widget