అన్వేషించండి

Dhoni Role Revealed: ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగనని తేల్చేసిన స్టార్ ప్లేయ‌ర్.. దూబేకు బౌలింగ్ ఇవ్వ‌క‌పోవ‌డం త‌ప్పిద‌మే.. సీఎస్కే మాజీ ప్లేయ‌ర్..

తాను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడబోనని, పూర్తి స్థాయి వికెట్ కీపర్‌గానే ఉంటానని ధోని స్వయంగా చెప్పినట్లు మాజీ ఆటగాడు సుబ్రమణ్యం బద్రీనాథ్ పేర్కొన్నాడు.

Badrinath Reveals Dhoni Stance On Impact Role: ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మాజీ బ్యాటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్.. మహేంద్ర సింగ్ ధోని పాత్రపై కీలక విషయాలను తెలిపాడు. ధోని ఇంపాక్ట్ ప్లేయర్‌గా మైదానంలోకి అడుగుపెట్టే అవకాశం లేదని, పూర్తి స్థాయి వికెట్ కీపర్‌గా 20 ఓవర్ల పాటు మైదానంలో ఉండేందుకు అతడు మొగ్గు చూపుతున్నాడని తెలిపాడు. గత ఐపీఎల్ సీజన్ లో సీఎస్కే ప్లేఆఫ్స్ కు చేరుకోలేక నిష్క్రమించిన తర్వాత రాబోయే సీజన్ కోసం ధోని భవితవ్యం, ఫిట్‌నెస్ పై విస్తృతంగా చర్చ జ‌రుగుతోంది. శారీరక శ్రమను తగ్గించుకునేందుకు ధోనిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా వాడితే జట్టుకు వ్యూహాత్మకంగా ఎంతో మేలు జరుగుతుందని బద్రీనాథ్ అభిప్రాయపడ్డాడు.

Read Also: BCCI Review Meeting: బీసీసీఐ సమీక్షా సమావేశం షురూ.. గంభీర్, గిల్, శ్రేయస్ హాజరు.. ఫ‌లితాల‌పై పోస్ట్ మార్టం..

ఫుల్ టైమ్ కీప‌ర్ గానే.. 
తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన బద్రీనాథ్, ధోని నిర్ణయాన్ని తెలిపాడు. "తాను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడబోనని ధోని నాతో స్వయంగా చెప్పాడు. అతడు తనను తాను ఫుల్ టైమ్ కీపర్‌గానే చూసుకుంటున్నాడు, అంటే మొత్తం 20 ఓవర్ల పాటు మైదానంలో ఫీల్డింగ్ చేయాల్సి ఉంటుంది. అందుకే అతడు ఇంపాక్ట్ ప్లేయర్‌గా రాడు. కానీ ఒకవేళ అతడు అలా ఆడితే అది సీఎస్కేకు టాక్టికల్ గా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నా. ధోని శరీరం ఎక్కువ సేపు ఒత్తిడిని తట్టుకోలేదని కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా ఇప్పటికే చెప్పాడు. కేవలం 16వ ఓవర్ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చి, వికెట్ కీపింగ్ మాత్రమే చేసేటప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉండటమే సరైన విధానం" అని బద్రీనాథ్ పేర్కొన్నాడు.

Read Also: Krunal Comeback Hope: అఫ్గాన్ సిరీస్‌లో దక్కని చోటు.. ఇంకా ఆశలు సజీవమేనంటూ కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్, సెలెక్షన్ తర్వాత ఆసక్తికర మలుపు

ఆ ఆరోప‌ణ‌లు స‌రికాదు.
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల శివం దూబేకు బౌలింగ్ అవకాశాలు రాలేదన్న వాదనలను బద్రీనాథ్ కొట్టిపారేశాడు. "శివం దూబే ఇండియా తరఫున రెగ్యులర్‌గా బౌలింగ్ చేస్తూ, సీఎస్కే తరఫున బౌలింగ్ చేయకపోవడానికి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కారణం కాదు. అది పూర్తిగా చెన్నై మేనేజ్‌మెంట్ వైఫల్యం. బంతితో అతడిని ఉపయోగించుకోవడంలో వారు వెనుకబడ్డారు. దూబేను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎందుకు వాడుతున్నారు? మీ స్వంత తప్పులకు నిబంధనలను నిందించడం సరైంది కాదు" అని అతడు విమర్శించాడు.

వ్యూహాత్మ‌క లోపం..
వెస్టిండీస్ స్పిన్నర్ అకిల్ హొస్సేన్‌ను జట్టు వాడుకున్న తీరుపై కూడా బద్రీనాథ్ విమ‌ర్శ‌లు చేశాడు. "అకిల్ హొస్సేన్ తుది జట్టులో కచ్చితంగా ఉండాల్సిన ఆటగాడు. కానీ సీఎస్కే అతడిని ఇంపాక్ట్ ప్లేయర్ల జాబితాలో రిజర్వ్‌గా ఉంచుతోంది. తీరా బ్యాటింగ్ కుప్పకూలినప్పుడు మరో ఎక్స్‌ట్రా బ్యాటర్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా రంగంలోకి దించుతున్నారు. దీనివల్ల హొస్సేన్ మ్యాచ్ ఆడకుండా బెంచ్‌పైనే ఉండిపోతున్నాడు. ఇది వ్యూహాత్మక లోపం తప్ప మరొకటి కాదు" అని పేర్కొన్నాడు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND VS WI Indore 2nd T20 Updates: బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
IND vs NZ ODI Series: కివీస్ టీమ్‌లో బిగ్ సర్ప్రైజ్... ఇండియాతో వ‌న్డే సిరీస్ కు జ‌ట్ల ప్ర‌క‌ట‌న‌.. ప్రతీకారానికి గిల్ సేన రెడీ!
కివీస్ టీమ్‌లో బిగ్ సర్ప్రైజ్... ఇండియాతో వ‌న్డే సిరీస్ కు జ‌ట్ల ప్ర‌క‌ట‌న‌.. ప్రతీకారానికి గిల్ సేన రెడీ!
Scrap Impact Rule: ఆల్‌రౌండర్ల కెరీర్‌ను మింగేస్తున్న ఆ నిబంధన.. =ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ తక్షణమే ఎత్తివేయాలంటూ రహానే ఫైర్
ఆల్‌రౌండర్ల కెరీర్‌ను మింగేస్తున్న ఆ నిబంధన.. =ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ తక్షణమే ఎత్తివేయాలంటూ రహానే ఫైర్
Samson Storm Reply: వరుస వైఫల్యాల తర్వాత ఊచకోత.. కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన సంజూ శాంసన్
వరుస వైఫల్యాల తర్వాత ఊచకోత.. కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన సంజూ శాంసన్
Advertisement

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Elon Musk Targets Mukesh Ambani: అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు.. ఇష్యూపై కేంద్రం క్లారిటీ
అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Action Thriller OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Embed widget