అన్వేషించండి

Sunil Gavaskar Warning: ముగింపునకు అగార్కర్ శకం, కొత్త బాస్ రాక వేళ గవాస్కర్ ఘాటు వ్యాఖ్యలు

అజిత్ అగార్కర్ పదవీకాలం ముగుస్తున్న వేళ బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పదవి ముళ్ల కిరీటం లాంటిదని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ హెచ్చరించాడు.

Sunil Gavaskar Details Hidden Pressures Of National Selection Committee Role:  భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్ పదవీకాలం ముగింపు దశకు చేరుకుంది. అక్టోబర్ 4 తర్వాత తదుపరి కార్యాచరణను బోర్డు అధికారికంగా వెల్లడిస్తుందని బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా ఇప్పటికే ప్రకటించారు. 2023 జూలైలో బాధ్యతలు చేపట్టిన అగార్కర్ హయాంలో భారత్ అద్భుత విజయాలను సాధించింది. వన్డే ప్రపంచకప్ ఫైనల్ చేరడంతో పాటు రెండు టీ20 ప్రపంచకప్‌లు, ఆసియా కప్, ఛాంపియన్స్ ట్రోఫీ టైటిళ్లను గెలుచుకుంది. అయితే ఇదే సమయంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్టులు, టీ20ల నుంచి తప్పుకోవడం, రవిచంద్రన్ అశ్విన్ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం, మహమ్మద్ షమీని పక్కన పెట్టడం లాంటి కఠిన నిర్ణయాలు కూడా జరిగాయి. తదుపరి చీఫ్ సెలెక్టర్ రేసులో పార్థివ్ పటేల్, ప్రజ్ఞాన్ ఓజా పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా, రాబోయే న్యూజిలాండ్ పర్యటనకు కొత్త బాసే జట్టును ఎంపిక చేస్తాడనే వార్తలపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తాజాగా స్పందించాడు.

Read Also: Virat Kohli Mastery Beyond Numbers: సచిన్ కంటే వేగంగా 15 వేల ర‌న్స్ మైలురాయిని దాటిన కోహ్లీ.. 74 ఇన్నింగ్స్‌ల భారీ తేడాతో పూర్తి..

అదో ముళ్ల కిరీటం.. 
జాతీయ సెలెక్షన్ కమిటీ చైర్మన్ పదవి ఎంత గౌరవప్రదమైనదో, అంతే ప్రమాదకరమైనదని గవాస్కర్ పేర్కొన్నాడు. "ఆ కుర్చీలో కూర్చున్న వ్యక్తి వీపుపై ఒక టార్గెట్ బోర్డు అమర్చినట్లే ఉంటుంది. అంపైరింగ్, వికెట్ కీపింగ్, కామెంట్రీ విభాగాల తరహాలోనే ఇదీ సాగుతుంది. మీరు చేసిన తొమ్మిది మంచి పనులను జనం వెంటనే మర్చిపోతారు. కానీ మీరు చేశారని భావించే ఒక్క తప్పును వంద రెట్లు పెద్దదిగా చేసి పదేపదే విమర్శిస్తారు. అందుకే ఆ పదవి చేపట్టే వ్యక్తికి ఎప్పుడూ నిరంతర ఒత్తిడి తప్పదు" అని గవాస్కర్ విశ్లేషించాడు. 

Read Also: Sindhu Fires on Schedule: 18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్

తెరవెనుక అసలు రాజకీయం.. 
సెలెక్షన్ కమిటీ అంతర్గత వ్యవహారాల గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదని గవాస్కర్ వివరించాడు. "కమిటీలోని ఇతర సెలెక్టర్లు కొన్ని నిర్ణయాలను చైర్మన్‌పై బలవంతంగా రుద్దుతారు. కానీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సింది మాత్రం ఆయనే కావడంతో అన్ని విమర్శలు చైర్మన్ మీదే పడతాయి. వెనుక ఉండి తప్పులు చేసేది ఇతర సభ్యులైనప్పటికీ, నిందలు మాత్రం మెయిన్ ప‌ర్స‌న్ కే చుట్టుకుంటాయి. గతంలో కెప్టెన్ కూడా సెలెక్షన్ మీటింగ్‌లో ఉన్నప్పుడు, కొందరు సెలెక్టర్లు బయటకు వచ్చి తమ అభిమాన మీడియా వ్యక్తులతో రహస్యంగా మాట్లాడుతూ అప్రియమైన నిర్ణయాల నెపాన్ని కెప్టెన్‌పై నెట్టేసేవారు. నా కెరీర్‌లోనూ ఇలా ఎన్నోసార్లు జరిగింది" అని పాత అనుభవాలను గుర్తుచేశాడు.

భవిష్యత్ చీఫ్ సెలెక్టర్‌కు వార్నింగ్..
రాబోయే కొత్త చీఫ్ సెలెక్టర్ ఎవరైనా సరే ఒక చేదు నిజాన్ని గుర్తించాలని గవాస్కర్ సూచించాడు. "కొత్త చైర్మన్‌గా ఎవరు బాధ్యతలు చేపట్టినా, ఆటగాడిగా అతడు ఎంతటి ప్రజాదరణ పొందిన దిగ్గజమైనా సరే, పదవీకాలం ముగిసి బయటకు వచ్చే సమయానికి అతడి ఖాతాలో ప్లస్‌ల కంటే మైనస్‌లే ఎక్కువగా నమోదవుతాయి. ప్రజల దృష్టిలో తప్పుడు అభిప్రాయాలే మిగిలిపోతాయి" అని హెచ్చరించాడు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

KL Rahul Milestone: సచిన్, కోహ్లీ సరసన చేరేందుకు అడుగు దూరంలో రాహుల్.. సేనా దేశాల్లో తొలి భారత ఓపెనర్‌గా అరుదైన రికార్డు
సచిన్, కోహ్లీ సరసన చేరేందుకు అడుగు దూరంలో రాహుల్.. సేనా దేశాల్లో తొలి భారత ఓపెనర్‌గా అరుదైన రికార్డు
Gautam Gambhir Coach: సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
Yashasvi Jaiswal Trade: రాయల్స్ ను వీడాలని  జైస్వాల్ సంచలన నిర్ణయం..! రిటైన్ చేసుకున్నా ట్రేడింగ్ కోసం ఫ్రాంచైజీల వేట, రేసులో లక్నో ఢిల్లీ కోల్‌కతా జట్లు
రాయల్స్ ను వీడాలని  జైస్వాల్ సంచలన నిర్ణయం..! రిటైన్ చేసుకున్నా ట్రేడింగ్ కోసం ఫ్రాంచైజీల వేట, రేసులో లక్నో ఢిల్లీ కోల్‌కతా జట్లు
Usman Khawaja Scandal:  ఖవాజాపై నిప్పులు చెరిగిన మాజీ క్రికెట‌ర్, బాన్‌క్రాఫ్ట్ సంచలన ఆరోప‌ణ‌ల‌తో రంగంలోకి క్రికెట్ ఆస్ట్రేలియా
ఖవాజాపై నిప్పులు చెరిగిన మాజీ క్రికెట‌ర్, బాన్‌క్రాఫ్ట్ సంచలన ఆరోప‌ణ‌ల‌తో రంగంలోకి క్రికెట్ ఆస్ట్రేలియా
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Bharath: ఏపీకి పెట్టుబడుల మంత్రం బ్రాండ్ చంద్రబాబు.. సూపర్ సిక్స్ 100 శాతం అమలు: మంత్రి టీజీ భరత్
ఏపీకి పెట్టుబడుల మంత్రం బ్రాండ్ చంద్రబాబు.. సూపర్ సిక్స్ 100 శాతం అమలు: మంత్రి టీజీ భరత్
CM Revanth Reddy: ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
Kia Carens Clavis EVని డిటో దింపేసిన కొత్త Hyundai Neira.. ఫీచర్లు, రేంజ్, ఇండియా లాంచ్ వివరాలు
Hyundai Neira MPV ఇంటీరియర్ అదిపోయింది.. 7 సీట్లు, పానోరమిక్‌ సన్‌రూఫ్, Bose సౌండ్ సిస్టమ్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Revanth Reddy Love Story: ప్రేమ కోసం బైక్‌పై ఢిల్లీకి వెళ్లిన రేవంత్‌రెడ్డి.. సీఎం లవర్ బాయ్ మూమెంట్ వైరల్!
ప్రేమ కోసం బైక్‌పై ఢిల్లీకి వెళ్లిన రేవంత్‌రెడ్డి.. సీఎం లవర్ బాయ్ మూమెంట్ వైరల్!
Bigg Boss Season 10 Today November 20th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: డైరెక్ట్ 13వ వారంలోకి కెప్టెన్ అమన్ మసూద్! ముకేశ్‌ చేష్టలకు ఫాలోవర్స్ అసహనం!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: డైరెక్ట్ 13వ వారంలోకి కెప్టెన్ అమన్ మసూద్! ముకేశ్‌ చేష్టలకు ఫాలోవర్స్ అసహనం!
Embed widget