అన్వేషించండి

Sindhu Fires on Schedule: 18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్

ఆసియా క్రీడల క్వార్టర్ ఫైనల్లో చెన్ యు ఫీ చేతిలో ఓటమి పాలైన పీవీ సింధు తగినంత రికవరీ సమయం లేకపోవడం తనపై తీవ్ర ప్రభావం చూపిందని తెలిపింది. 

Indian Shuttler Laments Tight Scheduling And Reflects On Heartbreaking Defeat:  ఆసియా క్రీడలు 2026లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రయాణం క్వార్టర్ ఫైనల్ దశలోనే ముగిసింది. ఆదివారం జరిగిన హోరాహోరీ పోరులో చైనా స్టార్ ప్లేయర్ చెన్ యు ఫీ చేతిలో 21-11, 18-21, 10-21 తేడాతో సింధు పరాజయం పాలైంది. ఈ ఓటమి తర్వాత ఆమె ఎక్స్ వేదికగా తీవ్ర భావోద్వేగానికి లోనైంది. మ్యాచ్ ముగింపునకు కేవలం మూడు పాయింట్ల దూరంలో ఉన్న సమయంలో కీలక ర్యాలీలు చేజారడం తనను ఎంతగానో బాధిస్తోందని పేర్కొంది. 18 గంటల వ్యవధిలోనే వరుసగా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి రావడం తన శారీరక సామర్థ్యాన్ని దెబ్బతీసిందని సింధు వెల్లడించింది. "నా ఆసియా క్రీడల ప్రయాణం ముగిసింది, ఈ ఓటమి నన్ను ఎంతగానో బాధిస్తోంది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ను ముగించడానికి కేవలం మూడు పాయింట్ల దూరంలో ఉన్నప్పుడు చైనా షట్లర్‌తో జరిగిన సుదీర్ఘ ర్యాలీలే మ్యాచ్ గతిని మార్చేశాయి. నాకు అవకాశం వచ్చినప్పటికీ దాన్ని చేజార్చుకోవడం బాధాకరం" అని సింధు రాసుకొచ్చింది.

Read Also: Virat Kohli Mastery Beyond Numbers: సచిన్ కంటే వేగంగా 15 వేల ర‌న్స్ మైలురాయిని దాటిన కోహ్లీ.. 74 ఇన్నింగ్స్‌ల భారీ తేడాతో పూర్తి..

అర్ధరాత్రి మ్యాచ్‌లు.. ఉదయమే క్వార్టర్ ఫైనల్ సమరం
నిర్వాహకులు నిర్ణయించిన షెడ్యూల్ ఎంత దారుణంగా ఉందో సింధు వివరించింది. "18 గంటల వ్యవధిలో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట వరకు మ్యాచ్ ఆడి, హోటల్‌కు చేరుకుని రికవరీ పనులు ముగించుకుని నిద్రపోయేసరికి తెల్లవారుజామున 3 గంటలు దాటింది. మళ్లీ ఉదయం 8:30 గంటలకే మేల్కొని క్వార్టర్ ఫైనల్ బరిలోకి దిగాల్సి వచ్చింది. ఈ పరిణామం నా ఫిట్‌నెస్‌పై తీవ్ర ప్రభావం చూపింది. అయినప్పటికీ నా పోరాట పటిమను పూర్తి స్థాయిలో ప్రదర్శించాను. చివరి క్షణాల్లో తప్పులను సరిదిద్దుకునేందుకు నా కోచింగ్ టీమ్‌తో కలిసి పనిచేస్తాను" అని తెలిపింది.

Read Also: IND VS AFG, Asian Games QF Result: బంతి పడకుండానే సెమీఫైనల్ బెర్త్.. అఫ్గాన్ తో క్వార్టర్  మ్యాచ్‌ను ముంచెత్తిన వర్షం, టాప్ ర్యాంకింగ్‌తో శ్రేయస్ సేన ముందంజ

తొలి గేమ్‌లో ఆధిపత్యం.. ఆపై అలసటతో చేతులెత్తేసిన వైనం
మ్యాచ్ ప్రారంభంలో సింధు అద్భుతమైన ఫామ్‌తో కనిపించింది. అటాకింగ్ గేమ్‌తో చెన్ యు ఫీపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి తొలి గేమ్‌ను 21-11తో ఏకపక్షంగా గెలుచుకుంది. అయితే రెండో గేమ్‌లో చైనా ప్లేయర్ సుదీర్ఘ ర్యాలీలతో సింధును బాగా అలసిపోయేలా చేసింది. 18-21తో రెండో గేమ్‌ను కోల్పోయిన సింధు, నిర్ణయాత్మక మూడో గేమ్‌లో అలసట కారణంగా 10-21తో ఓటమిని మూటగట్టుకుంది. "ఒక చేదు ఫలితం దేశం కోసం 12 ఏళ్లుగా నేను సాగించిన ప్రయాణాన్ని తక్కువ చేయలేదు. 2014 నుంచి ఇప్పటివరకు నాలుగు ఆసియా క్రీడల్లో ఇండియా తరఫున శాయశక్తులా పోరాడాను" అని సింధు పేర్కొంది.

బ్యాడ్మింటన్‌లో భారత పోరాటం ముగింపు.. షెడ్యూల్‌పై పెరిగిన అసంతృప్తి
మరో క్వార్టర్ ఫైనల్లో యువ షట్లర్ ఉన్నతి హుడా సైతం జపాన్ క్రీడాకారిణి అకానె యమగుచి చేతిలో ఓడిపోవడంతో వ్యక్తిగత విభాగంలో భారత బ్యాడ్మింటన్ కథ ముగిసింది. పురుషుల టీమ్ ఈవెంట్‌లో దక్కిన కాంస్య పతకం మాత్రమే భారత్‌కు మిగిలింది. కాగా బ్యాడ్మింటన్ షెడ్యూల్ తీరుపై ఇప్పటికే ఇండోనేషియా స్టార్ జోనాథన్ క్రిస్టీ, జపాన్ షట్లర్ కొడై నరవోక, చైనా డబుల్స్ ప్లేయర్ టాన్ నింగ్ బహిరంగంగానే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Shami Top Spells: విదేశీ పిచ్‌లపై నిప్పులు చెరిగిన  షమీ.. కెరీర్‌ను మలుపు తిప్పిన టాప్ 5 టెస్ట్ స్పెల్స్
విదేశీ పిచ్‌లపై నిప్పులు చెరిగిన  షమీ.. కెరీర్‌ను మలుపు తిప్పిన టాప్ 5 టెస్ట్ స్పెల్స్
Kohli Breaks Ponting Record: పాంటింగ్ రికార్డుకి చెక్ పెట్టిన కోహ్లీ, కివీస్‌పై ఆ ఘ‌న‌త సాధించిన ప్లేయ‌ర్ గా రికార్డు
పాంటింగ్ రికార్డుకి చెక్ పెట్టిన కోహ్లీ, కివీస్‌పై ఆ ఘ‌న‌త సాధించిన ప్లేయ‌ర్ గా రికార్డు
Rohit Sharma Record: అఫ్రిది రికార్డును బద్దలు కొట్టిన రోహిత్ .. కివీస్ పై సిక్సర్ల సునామీతో సరికొత్త చరిత్ర, గేల్ అగ్రపీఠంపై గురి
అఫ్రిది రికార్డును బద్దలు కొట్టిన రోహిత్ .. కివీస్ పై సిక్సర్ల సునామీతో సరికొత్త చరిత్ర, గేల్ అగ్రపీఠంపై గురి
Gurnoor Brar Magic:  టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. డ‌క్ వ‌ర్త్ సిస్టమ్ తో గ‌ట్టెక్కిన గిల్ సేన‌.. ఆక‌ట్టుకున్న శ్రేయ‌స్, రాహుల్, గుర్నూర్..
టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. డ‌క్ వ‌ర్త్ సిస్టమ్ తో గ‌ట్టెక్కిన గిల్ సేన‌.. ఆక‌ట్టుకున్న శ్రేయ‌స్, రాహుల్, గుర్నూర్..
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gurnoor Brar Magic:  టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. డ‌క్ వ‌ర్త్ సిస్టమ్ తో గ‌ట్టెక్కిన గిల్ సేన‌.. ఆక‌ట్టుకున్న శ్రేయ‌స్, రాహుల్, గుర్నూర్..
టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. డ‌క్ వ‌ర్త్ సిస్టమ్ తో గ‌ట్టెక్కిన గిల్ సేన‌.. ఆక‌ట్టుకున్న శ్రేయ‌స్, రాహుల్, గుర్నూర్..
MPTC Election Results: చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌ను ఖండించిన మాజీ సీఎం జగన్
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌ను ఖండించిన మాజీ సీఎం జగన్
Illegal Defense Liquor Racket: భర్తలు తెస్తారు.. భార్యలు అమ్మేస్తారు! అల్వాల్‌లో డిఫెన్స్ మద్యం అక్రమ దందా రట్టు
భర్తలు తెస్తారు.. భార్యలు అమ్మేస్తారు! అల్వాల్‌లో డిఫెన్స్ మద్యం అక్రమ దందా రట్టు
Ponnam Prabhakar: హుస్నాబాద్‌లో ఇందిరమ్మ ఇంట్లో ఘనంగా దీపావళి వేడుకలు.. పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్‌లో ఇందిరమ్మ ఇంట్లో ఘనంగా దీపావళి వేడుకలు.. పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
TGSRTC కార్మికులను నేలపై కూర్చోబెట్టి అవమానం! సిద్దిపేట డీఎంపై మంత్రి పొన్నం ఆగ్రహం
TGSRTC కార్మికులను నేలపై కూర్చోబెట్టి అవమానం! సిద్దిపేట డీఎంపై మంత్రి పొన్నం ఆగ్రహం
Misuse of RTI Act: మాజీ ప్రేయసి ఎంత మందిని ప్రేమించింది.. 1886 ప్రశ్నలతో ఆర్టీఐ దరఖాస్తులు.. యువకుడికి సమాచార కమిషన్ షాక్!
మాజీ ప్రేయసి ఎంత మందిని ప్రేమించింది.. 1886 ప్రశ్నలతో ఆర్టీఐ దరఖాస్తులు.. యువకుడికి సమాచార కమిషన్ షాక్!
MLC Mirza Rahmat Extortion: మీ వీడియోలు పోస్టు చేస్తామని ఎమ్మెల్సీకి బెదిరింపులు... రూ.5 కోట్లు డిమాండ్, ఆరుగురి అరెస్ట్
మీ వీడియోలు పోస్టు చేస్తామని ఎమ్మెల్సీకి బెదిరింపులు... రూ.5 కోట్లు డిమాండ్, ఆరుగురి అరెస్ట్
Embed widget