అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Sri Lanka Cricket Team: శ్రీలంకకు ఐసీసీ బిగ్ షాక్- వరల్డ్ కప్ బాధ్యతల నుంచి ఔట్! దక్షిణాఫ్రికాకు ఛాన్స్

Cricket World Cup 2024: లంక క్రికెట్ బోర్డుపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఐసీసీ కీలక నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. తాజాగా లంక బోర్డుకు మరో బిగ్ షాక్ ఇచ్చింది ఐసీసీ. 

Under19 Mens Cricket World Cup 2024 to be held in South Africa: శ్రీలంక క్రికెట్ బోర్డుకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇదివరకే వన్డే వరల్డ్ కప్ 2023 (ODI World Cup 2023)లో దారుణ ప్రదర్శనతో మాజీ ఛాంపియన్ శ్రీలంక టీమ్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఆ దేశ క్రికెట్ బోర్డు విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సీరియస్ అయింది. ఏకంగా లంక క్రికెట్ బోర్డుపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఐసీసీ కీలక నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. తాజాగా లంక బోర్డు (Sri Lanka Cricket Board)కు మరో బిగ్ షాక్ ఇచ్చింది ఐసీసీ. 

2024లో నిర్వహించనున్న ఐసీసీ మెన్స్ అండర్ 19 వరల్డ్ కప్ (Under19 Mens World Cup 2024) హోస్టింగ్ బాధ్యతల నుంచి లంకను తప్పించింది. ఐసీసీ బోర్డు నేడు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నిర్వహించాల్సిన పురుషుల అండర్ 19 వరల్డ్ కప్ నిర్వహణ బాధ్యతల నుంచి లంకను తప్పించారు. ఆ అవకాశాన్ని దక్షిణాఫ్రికాకు కల్పిస్తూ ఐసీసీ బోర్డు తాజాగా నిర్ణయం తీసుకుంది. దాంతో వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న అండర్ 19 వరల్డ్ కప్ ను దక్షిణాఫ్రికా నిర్వహించనుందని బోర్డు స్పష్టం చేసింది. 

ద్వైపాక్షిక సిరీస్ లతో పాటు, ICC ఈవెంట్‌లలో శ్రీలంక టీమ్ ఆడేందుకు అనుమతి ఇచ్చారు. మంగళవారం జరిగిన ఐసీసీ బోర్డు సమావేశం తర్వాత ఈ విషయాన్ని వెల్లడించారు. కానీ, లంక క్రికెట్ కి నిధులు ఐసీసీ తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ కారణంగా వచ్చే జనవరిలో జరగాల్సిన మెన్స్ అండర్ 19 ప్రపంచ కప్ నిర్వహణ నుంచి లంకను తప్పించి దక్షిణాఫ్రికాకు బాధ్యతల్ని అప్పగించింది. ఈ ఏడాది మహిళల U19 T20 ప్రపంచ కప్ నిర్వహించిన దక్షిణాఫ్రికా పురుషుల అండర్ 19 అవకాశాన్ని దక్కించుకుంది. 

వచ్చే జనవరిలో జరగనున్న U19 ప్రపంచ కప్ 15వ ఎడిషన్. చివరగా 2022లో వెస్టిండీస్‌లో జరిగిన మెగా టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. రికార్డు స్థాయిలో ఐదవసారి టైటిల్‌ను టీమిండియా సొంతం చేసుకుంది. 2024 జనవరిలో ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీలో 41 మ్యాచ్‌లు జరగనుండగా, ఫిబ్రవరిలో ఫైనల్ జరగనుంది.

ఈసారి గ్రూప్ స్టేజీ తరువాత సూపర్ సిక్స్ విధానాన్ని తీసుకొస్తుంది ఐసీసీ. సూపర్ సిక్స్ మ్యాచ్ ఫలితాలతో సెమీ ఫైనల్ టీమ్స్ ను నిర్ణయిస్తారు. అండర్ 19 వరల్డ్ కప్ లో పాల్గొనే 16 జట్లను 4 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ Aలో డిఫెండింగ్ ఛాంపియన్‌ భారత్‌తో పాటు బంగ్లాదేశ్, ఐర్లాండ్, అమెరికాలు ఉన్నాయి. గ్రూప్ Bలో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, స్కాట్లాండ్ ఉన్నాయి. గ్రూప్ Cలో ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, నమీబియా ఉన్నాయి. ఇక గ్రూప్ Dలో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, న్యూజిలాండ్, నేపాల్ టీమ్స్ సూపర్ సిక్స్ కోసం పోటీ పడనున్నాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
IPL Auction 2025 Live Streaming: నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
PM Modi Comments: రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
AUS vs IND: ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
IPL Auction 2025 Live Streaming: నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
PM Modi Comments: రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
AUS vs IND: ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
Sonia Akula Engagement: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Embed widget