అన్వేషించండి

T20 World Cup Semi-Final 1: దురదృష్ట ముద్రను చెరిపేస్తూ, నవ శకాన్ని సృష్టిస్తూ సఫారీల కొత్త చరిత్ర

South Africa cricket : తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. అఫ్గానిస్థాన్‌ పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

SA reach a men's World Cup final for first time: పాపం... దక్షిణాఫ్రికా(South Africa) ఒక్కసారి ఫైనల్‌ చేరితే బాగుండు. ఇంకెన్నిసార్లు సెమీస్‌లో ఓడిపోతారో... సౌతాఫ్రికా జట్టంటేనే బ్యాడ్‌ లక్‌ జట్టు.... ఇంతమంది ఆటగాళ్లున్నా ఎందుకు ప్రతీసారి సెమీస్‌లో ఓడిపోతారో... ఒత్తిడిని తట్టుకోవడం సఫారీల వల్ల కాదేమో.. అమ్మో ఇలాంటి ఎన్ని విన్నామో... దక్షిణాఫ్రికా సెమీస్‌ చేరిన ప్రతీసారి ఇలాంటి వ్యాఖ్యలే వినిపించేవి. చివరి ప్రత్యర్థి దేశాల అభిమానులు కూడా సౌతాఫ్రికా ఒక్కసారి ఫైనల్‌ చేరితే బాగుండు అని అనుకుని ఉంటారంటే అందులో అతిశయోక్తేమీ లేదు. ఎందుకంటే సఫారీ జట్టంటేనే పోరాటం. క్లిష్ట పరిస్థితుల్లో అద్భుతంగా ఆటగాళ్లతో... అద్భుత ఆల్‌రౌండర్లతో ఆ జట్టు చాలా పటిష్టంగా కనిపించినా ఆ జట్టు ఎప్పుడూ ఫైనల్‌ చేరలేదు. 
 
ఆ చరిత్రను తిరగరాసి...
ప్రపంచ క్రికెట్‌లో అత్యంత దురదృష్టకరమైన జట్టేది అంటే క్రికెట్‌ అభిమానులు టక్కున చెప్పే పేరు దక్షిణాఫ్రికా. అద్భుతమైన ఆల్‌రౌండర్లు, దిగ్గజ ఆటగాళ్లు, భయపెట్టే బౌలర్లు ఉన్నా... ఇప్పటివరకూ ప్రొటీస్‌ ఏ ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరలేదు. 1992లో తిరిగి క్రికెట్‌లో ప్రవేశించినప్పటి నుంచి ఏడుసార్లు ప్రపంచకప్‌ సెమీస్‌ చేసిన దక్షిణాఫ్రికా..... ఏడుసార్లూ పరాజయం పాలైంది. ఒకసారి వర్షం,మరోసారి ఆస్ట్రేలియాతో టై ఇలా ఏదో ఒక రూపంలో సౌతాఫ్రికాను వెంటాడేది. సెమీస్‌ చేరిన ప్రతీసారి దక్షిణాఫ్రికాను దురదృష్టం వెంటాడేది. సెమీఫైనల్లో తడబడేది. 1992లో క్రికెట్‌లో తిరిగి వచ్చిన ఏడాదే సెమీస్‌ చేరిన ప్రొటీస్‌... ఆ తర్వాత కూడా ఆరుసార్లు సెమీస్‌ చేరింది. అయినా తుదిపోరుకు మాత్రం అర్హత సాధించలేకపోయింది. కానీ ఈసారి మాత్రం అవేమీ జరగలేదు. ఈప్రపంచకప్‌లో అద్భుతాలు సృష్టిస్తూ సెమీస్‌ చేరిన అఫ్గాన్‌ను చావుదెబ్బ కొట్టి ప్రొటీస్‌ ఫైనల్‌ చేరింది. ఎందరో దిగ్గజ ఆటగాళ్లకు సాధ్యంకాని అరుదైన ఘనతను ఇప్పుడు దక్షిణాఫ్రికా సాధించింది. గెలిచింది అఫ్గానిస్థాన్‌పైనే అయినా...ఇప్పుడు ఆ జట్టు అంత తేలిగ్గా ఏమీ లేదు. ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ లాంటి జట్లకు షాక్‌ ఇచ్చి సెమీస్‌ చేరిన ఆఫ్గాన్‌ ఏదో అద్భుతం చేసేలానే కనిపించింది. కానీ బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ప్రొటీస్‌ బౌలర్లు చెలరేగడంతో కాబూలీలు స్వల్ప స్కోరుకే పరిమితం అవ్వగా... ఆ తర్వాత ఒత్తిడి లేకుండా బ్యాటర్లు పని పూర్తి చేసి చరిత్ర సృష్టించారు. 
 
గత చరిత్రను మర్చిపోగలమా...
తిరిగి క్రికెట్‌లో రంగ ప్రవేశం చేసిన తర్వాత 1992 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాను తొలిసారి దురదృష్టం వెంటాడింది. ఈ ప్రపంచకప్‌లో సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌- దక్షిణాఫ్రికా తలపడ్డాయి. ఓ దశలో ప్రొటీస్‌ గెలుపు ఖాయమైంది. ఇక 13 బంతుల్లో 22 పరుగులు చేస్తే సౌతాఫ్రికా ఫైనల్‌ చేరుతుంది. కానీ ఈ దశలోనే వర్షం పడడంతో డక్‌వర్త్ లూయిస్ రూల్‌ ప్రకారం దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని ఒక్క బంతిలో 22 పరుగులుగా నిర్దేశించారు. దీంతో కన్నీళ్లతో ప్రొటీస్‌ ఆ ప్రపంచకప్‌ నుంచి వైదొలిగింది. 1999లో దక్షిణాఫ్రికాను మరోసారి దురదృష్టం వెంటాడిది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో రెండు జట్లు 213 పరుగులే చేయడంతో టైగా ముగిసింది. దీంతో మెరుగైన రన్‌రేట్‌ కారణంగా ఆస్ట్రేలియా ఫైనల్‌ చేరింది. క్లుసెనర్‌ చివరి దాకా పోరాడినా చివరి వికెట్‌గా డొనాల్డ్‌ రనౌట్‌ అయిన దృశ్యం ఇంకా క్రికెట్‌ అభిమానులకు గుర్తుండే ఉంటుంది. ఇలా ప్రతీసారి 2015 ప్రపంచకప్ సెమీ ఫైనల్‌లో ఓటమి కూడా ప్రొటీస్‌ను కుంగదీసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఓటమితో డివిలియర్స్‌ సహా చాలా మంది ఆటగాళ్లు మైదానంలో వెక్కివెక్కి ఏడ్చారు. ఇప్పుడు ఈ బాధలను మైమరిపిస్తూ ప్రొటీస్‌ ఫైనల్‌ చేరి చరిత్ర సృష్టించింది.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rohit Sharma : కప్పు కొట్టిన తర్వాత మట్టి తిన్న రోహిత్‌, ఎక్కడంటే?
కప్పు కొట్టిన తర్వాత మట్టి తిన్న రోహిత్‌, ఎక్కడంటే?
MP Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్ - తిరుపతిలో ఉద్రిక్తత, భారీగా మోహరించిన పోలీసులు
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్ - తిరుపతిలో ఉద్రిక్తత, భారీగా మోహరించిన పోలీసులు
Virat Kohli: అనుష్క! మేం గెలిచేశాం, వీడియో కాల్‌లో కోహ్లీ ఫ్లైయింగ్ కిస్సులు
అనుష్క! మేం గెలిచేశాం, వీడియో కాల్‌లో కోహ్లీ ఫ్లైయింగ్ కిస్సులు
T20 World Cup 2024 Final IND vs SA: ఈ విజయం అంత తేలిగ్గా దక్కలేదు, తెరవెనక మూడేళ్ల కష్టమన్న రోహిత్‌
ఈ విజయం అంత తేలిగ్గా దక్కలేదు, తెరవెనక మూడేళ్ల కష్టమన్న రోహిత్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Virat Kohli and Rohit Sharma Announces Retirement From T20I | వరల్డ్ కప్ గెలిచి రిటైరైన దిగ్గజాలుVirat Kohli 76 Runs in T20 World Cup Final | సిరీస్ అంతా ఫెయిలైనా ఫైనల్ లో విరాట్ విశ్వరూపం | ABPRohit Sharma Kisses Hardik Pandya | T20 World Cup 2024 విజయం తర్వాత రోహిత్, పాండ్యా వీడియో వైరల్|ABPAkshar Patel All Round Performance | T20 World Cup 2024 Final లో అదరగొట్టిన అక్షర్ పటేల్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rohit Sharma : కప్పు కొట్టిన తర్వాత మట్టి తిన్న రోహిత్‌, ఎక్కడంటే?
కప్పు కొట్టిన తర్వాత మట్టి తిన్న రోహిత్‌, ఎక్కడంటే?
MP Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్ - తిరుపతిలో ఉద్రిక్తత, భారీగా మోహరించిన పోలీసులు
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్ - తిరుపతిలో ఉద్రిక్తత, భారీగా మోహరించిన పోలీసులు
Virat Kohli: అనుష్క! మేం గెలిచేశాం, వీడియో కాల్‌లో కోహ్లీ ఫ్లైయింగ్ కిస్సులు
అనుష్క! మేం గెలిచేశాం, వీడియో కాల్‌లో కోహ్లీ ఫ్లైయింగ్ కిస్సులు
T20 World Cup 2024 Final IND vs SA: ఈ విజయం అంత తేలిగ్గా దక్కలేదు, తెరవెనక మూడేళ్ల కష్టమన్న రోహిత్‌
ఈ విజయం అంత తేలిగ్గా దక్కలేదు, తెరవెనక మూడేళ్ల కష్టమన్న రోహిత్‌
Bachhala Malli: బచ్చలమల్లి గ్లింప్స్... ఎవడి కోసం తగ్గాలి, ఎందుకు తగ్గాలి? అల్లరి నరేష్ మాస్ అదిరిందమ్మా!
బచ్చలమల్లి గ్లింప్స్... ఎవడి కోసం తగ్గాలి, ఎందుకు తగ్గాలి? అల్లరి నరేష్ మాస్ అదిరిందమ్మా!
Virat Kohli: దుమ్ములేపిన విరాట్ కోహ్లీ ఇన్‌స్టా పోస్ట్ - 6 గంటల్లోనే బీభత్సం!
దుమ్ములేపిన విరాట్ కోహ్లీ ఇన్‌స్టా పోస్ట్ - 6 గంటల్లోనే బీభత్సం!
HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డ్‌ వాడితే మోత మోగిపోద్ది, ఇంకెందుకంటా ఆ కార్డు?
హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డ్‌ వాడితే మోత మోగిపోద్ది, ఇంకెందుకంటా ఆ కార్డు?
Nivetha Pethuraj:  కల్పనా చావ్లా బయోపిక్‌లో నటించాలని ఉందంటోన్న 'అలవైకుంఠపురంలో' బ్యూటీ నివేదా పేతురాజ్!
కల్పనా చావ్లా బయోపిక్‌లో నటించాలని ఉందంటోన్న 'అలవైకుంఠపురంలో' బ్యూటీ నివేదా పేతురాజ్!
Embed widget