SL vs PAK WC 2023 : 345 పరుగులు ఉఫ్ అని ఊదేసిన పాకిస్థాన్- రికార్డులు మోత మోగించిన మ్యాచ్
Sri Lanka vs Pakistan Match Highlights: 345 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ ఆదిలోనే రెండు కీలక వికెట్లను కోల్పోయింది. . అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్ అద్భుత సెంచరీలతో చెలరేగారు.
![SL vs PAK WC 2023 : 345 పరుగులు ఉఫ్ అని ఊదేసిన పాకిస్థాన్- రికార్డులు మోత మోగించిన మ్యాచ్ SL vs PAK World Cup 2023 Match Highlights Pakistan Won By 6 Wickets Against Sri Lanka Mohammad Rizwan SL vs PAK WC 2023 : 345 పరుగులు ఉఫ్ అని ఊదేసిన పాకిస్థాన్- రికార్డులు మోత మోగించిన మ్యాచ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/11/026f08ab1f8a265e9933219fcb4f4f931696990096301215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
శ్రీలంకపై పాకిస్థాన్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పాక్ ముందు 345 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది శ్రీలంక. అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్ అద్భుత సెంచరీలతో 48.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 345 పరుగులు చేసి జట్టను విజయతీరాలకు చేర్చారు. ప్రపంచకప్ చరిత్రలో ఇదే అతిపెద్ద పరుగుల ఛేజింగ్.
ప్రపంచ కప్ మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌ను ఓడించలేకపోయిన శ్రీలంక
ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు శ్రీలంక పాకిస్థాన్‌ను ఓడించలేకపోయింది. ప్రపంచకప్‌లో పాకిస్థాన్, శ్రీలంక జట్లు 8 సార్లు తలపడగా, ప్రతిసారీ పాక్ జట్టు శ్రీలంకను ఓడించింది. ఈసారి కూడా శ్రీలంకపై పాక్ విజయ పరంపర కొనసాగింది.
మహ్మద్ రిజ్వాన్, అబ్దుల్లా షఫీక్ సెంచరీలు .
పాక్ జట్టులో అబ్దుల్లా షఫీక్ 103 బంతుల్లో 113 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. అదే సమయంలో మహ్మద్ రిజ్వాన్ 121 బంతుల్లో 131 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మొదటిలోనే ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజమ్ త్వరగా పెవిలియన్‌కు చేరారు. మహ్మద్ రిజ్వాన్, అబ్దుల్లా షఫీక్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్ది విజయాన్ని అందుకున్నారు. ఇఫ్తికార్ అహ్మద్ 10 బంతుల్లో 22 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన పాక్
ఈ మ్యాచ్‌లో ఎన్నో భారీ రికార్డులు నమోదయ్యాయి. వాస్తవానికి ప్రపంచకప్ చరిత్రలోనే పాకిస్థాన్ అత్యధిక పరుగులు చేసింది. మహ్మద్ రిజ్వాన్, అబ్దుల్లా షఫీక్ 176 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రపంచకప్ చరిత్రలో పాక్‌కు ఇదే అతిపెద్ద భాగస్వామ్యం. గతంలో ఈ రికార్డు సయీద్ అన్వర్, వస్తీ పేరిట ఉండేది.
ప్రపంచకప్ మ్యాచ్ లో 4 సెంచరీలు ఇదే తొలిసారి
పాకిస్థాన్-శ్రీలంక మ్యాచ్‌లో నలుగురు బ్యాట్స్‌మెన్ సెంచరీ మార్కు దాటారు. వాస్తవానికి ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా ఒక మ్యాచ్‌లో నలుగురు ఆటగాళ్లు సెంచరీ సాధించారు. శ్రీలంక తరఫున కుశాల్ మెండిస్, సదీరా సమరవిక్రమ సెంచరీలు సాధించారు. ఛేజింగ్‌లో పాకిస్థాన్ తరఫున మహ్మద్ రిజ్వాన్, అబ్దుల్లా షఫీక్ సెంచరీలు కొట్టారు. ఈ విధంగా ఈ మ్యాచ్ లో రికార్డు స్థాయిలో 4 సెంచరీలు నమోదు అయ్యాయి.
కుమార సంగక్కరను అధిగమించిన కుశాల్ మెండిస్
షనక జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చినా శ్రీలంక బ్యాట్స్ మన్ కుశాల్ మెండిస్ రికార్డు సృష్టించాడు. కుశాల్ మెండిస్ శ్రీలంక తరఫున ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన వ్యక్తిగా నిలిచాడు. కుశాల్ మెండిస్ 65 బంతుల్లో సెంచరీ కొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు కుమార సంగక్కర పేరిట ఉండేది. 2015 ప్రపంచకప్‌లో కుమార సంగక్కర 70 బంతుల్లో సెంచరీ సాధించాడు.
ఈ విజయం తర్వాత బాబర్ అజామ్ ఏం చెప్పాడు?
పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ మాట్లాడుతూ.. మా ఆటగాళ్లు అద్భుతంగా ఆడారని అన్నాడు. ఖాస్కర్, అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్... 'తొలి 20-30 ఓవర్లలో మేం బాగా ఆడలేదు, కానీ ఆ తర్వాత రేస్‌లోకి వచ్చాం . కానీ చివరి ఓవర్లలో మా బౌలర్లు బాగా రాణించారు.
అబ్దుల్లా షఫీక్ కోసం పాక్ కెప్టెన్ ఇలా అన్నాడు...
అబ్దుల్లా షఫీక్ తన తొలి ప్రపంచకప్ ఆడుతున్నాడని బాబర్ అజామ్ అన్నాడు. కానీ ఈ ఆటగాడు పరుగులు చేయడం కోసం చూపిస్తున్న తపన ప్రశంసనీయం. నెట్స్‌లో అబ్దుల్లా షఫీక్ బ్యాటింగ్ చూడటం నాకు చాలా ఇష్టం. అందుకే నేను అబ్దుల్లా షఫీక్ ను ప్లేయింగ్ ఎలెవన్ లో చేర్చాను. అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్ భాగస్వామ్యంతో మ్యాచ్ గెలవగలిగాం. అంతేగాక, హైదరాబాద్ అభిమానులకు పాక్ కెప్టెన్ కృతజ్ఞతలు తెలిపాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)