Ramiz Raja on Gill: శుభ్ మన్ గిల్ మినీ రోహిత్ లా అనిపిస్తున్నాడు- రమీజ్ రజా
Ramiz Raja on Gill: పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ మాజీ ఛైర్మన్ రమీజ్ రజా... భారత యువ క్రికెటర్ శుభ్ మన్ గిల్ పై ప్రశంసలు కురిపించాడు. ఈ యువ క్రికెటర్ తనను తాను మలచుకున్న విధానం ఆకట్టుకుందన్నాడు.
Ramiz Raja on Gill: పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ మాజీ ఛైర్మన్ రమీజ్ రజా... భారత యువ క్రికెటర్ శుభ్ మన్ గిల్ పై ప్రశంసలు కురిపించాడు. ఈ యువ క్రికెటర్ తనను తాను మలచుకున్న విధానం ఆకట్టుకుందన్నాడు. అలాగే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, గిల్ కు మధ్య ఉన్న పోలికల గురించి వివరించాడు. గిల్, రోహిత్ కు మిని వర్షన్ అని రమీజ్ పేర్కొన్నాడు.
'శుభ్ మన్ గిల్ మినీ రోహిత్ లా కనిపిస్తాడు. అతనికి ఇంకా చాలా సమయం ఉంది. తగినంత సామర్థ్యం ఉంది. సమయంతో పాటు దూకుడు కూడా అభివృద్ధి చెందుతుంది. గిల్ ఏమీ మార్చుకోవాల్సిన అవసరం లేదు.' అని తన యూట్యూబ్ ఛానల్ లో రమీజ్ రజా పేర్కొన్నాడు. రోహిత్ శర్మ లాంటి అత్యుత్తమ బ్యాటర్ భారత్ కు ఉన్నందున వారికి బ్యాటింగ్ చేయడం సులభమని రమీజ్ అన్నాడు. 'రోహిత్ హుక్ అండ్ పుల్ షాట్లు కొట్టడంలో అద్భుతమైన స్ట్రైకర్. అతను చాలా బాగా ఆడతాడు. కాబట్టి భారత్ కు బ్యాటింగ్ చేయడం సులభం' అని రమీజ్ రజా వ్యాఖ్యానించాడు.
అలాగే టీమిండియా బ్యాటింగ్ యూనిట్ లో కొన్ని టెక్నికల్ అంశాలను రమీజ్ రజా హైలైట్ చేశాడు. 'భారత టాపార్డర్ బ్యాటర్ల ఫ్రంట్ ఫుట్ బ్యాటింగ్ బలహీనంగా కనిపిస్తోంది. బ్యాక్ ఫుట్ నుంచి ఆడడం చాలా సులభం. అయితే ఒకసారి బంతి టాస్ అప్ అయితే డిఫెన్స్ ఆడాల్సి వస్తుంది. అది మంచిదికాదు' అని రజా అన్నాడు.
భారత్ విజయం
న్యూజిలాండ్- భారత్ మధ్య జరిగిన రెండో వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ 108 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మ్యాచ్ అనంతరంకివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ మాట్లాడుతూ, "మా బ్యాటింగ్ బాగా లేదు. భారత్ సరైన ఎండ్‌లో ఎక్కువ సేపు బౌలింగ్ చేసింది. ఆరోజు ఏదీ మాకు అనుకూలంగా జరగలేదు. పిచ్‌లో టెన్నిస్ బాల్ బౌన్స్ ఉంది. బౌలర్లకు ఇది సహకరిస్తుంది. దురదృష్టవశాత్తు మేము ప్రారంభంలో భాగస్వామ్యాన్ని నిర్మించలేకపోయాము." అన్నారు.
న్యూజిలాండ్ కెప్టెన్ ఇంకా మాట్లాడుతూ, "మీరు తక్కువ స్కోరులో ఐదు వికెట్లు కోల్పోయినప్పుడు, పరుగులు చేయడం అంత సులభం కాదు. ప్రతి మ్యాచ్‌లో మీరు బాగా రాణించాలనుకుంటున్నారు. గత మ్యాచ్‌లో పిచ్, ఈ మ్యాచ్‌లో పిచ్ మధ్య చాలా తేడా ఉంది. రాయ్‌పూర్‌లో జరగనున్న తదుపరి మ్యాచ్ కోసం మేం ఎదురుచూస్తున్నాము. అక్కడ బాగా ఆడాలనుకుంటున్నాం." అని పేర్కొన్నాడు.
భారత బౌలర్లు న్యూజిలాండ్‌ను 11 ఓవర్లలో 15/5కి పరిమితం చేశారు. షమీ ఆరు ఓవర్లలో కేవలం 18 పరుగులిచ్చి మూడు వికెట్లు తీయగా, సిరాజ్ ఒక వికెట్ తీశాడు. లాథమ్ మాట్లాడుతూ, "వారు అద్భుతంగా బౌలింగ్ చేశారు. లైన్ లెంగ్త్ కూడా కచ్చితంగా ఉంది. వారు మాకు సులభమైన స్కోరింగ్ ఆప్షన్లు ఇవ్వలేదు. 11వ ఓవర్‌కే సగం జట్టును కోల్పోయిన తర్వాత మ్యాచ్‌లోకి తిరిగి రావడం చాలా కష్టమైంది." అని తెలిపాడు
Ramiz Raja believes Shubman Gill is mini Rohit Sharma, but with extra time 🔥
— Sportskeeda (@Sportskeeda) January 22, 2023
Do you agree with him? 🤔#ShubmanGill #RohitSharma #RamizRaja pic.twitter.com/8eTu6VcHiN
Former PCB Chairman @iramizraja comes up with high praise for Shubman Gill 🗣 #RohitSharma #ShubmanGill #ramizraja #CricketTwitter pic.twitter.com/6r8dh72EF7
— OneCricket (@OneCricketApp) January 22, 2023