అన్వేషించండి

IND VS AFG 1st T20 Updates:  పూర్తి స్థాయి లైనప్‌తో శ్రేయస్ సేన‌.. బుమ్రాతో కొత్త జోష్, నేడు అఫ్గాన్ తో టీమిండియా తొలి టీ20

గాయాల సమస్యలను అధిగమించి బుమ్రా రాకతో పటిష్టంగా మారిన టీమ్ ఇండియాను అఫ్గాన్‌పై విజయపథంలో నడిపించేందుకు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సిద్ధమయ్యాడు.

IND VS AFG, Shreyas Iyer Ready With Full Strength Squad For Afghanistan Series:  టీమ్ ఇండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు ఆరంభంలో కఠినమైన సవాళ్లు ఎదురయ్యాయి. జూన్, జూలై నెలల్లో ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో ఒక్క విజయం కూడా నమోదు చేయలేక నిరాశపరిచినప్పటికీ, ఆదివారం అఫ్గానిస్తాన్‌తో ఢిల్లీ వేదికగా ప్రారంభమయ్యే తొలి టీ20 మ్యాచ్‌లో మొదటిసారి తన పూర్తి స్థాయి ప్రధాన జట్టుతో బరిలోకి దిగే అవకాశం అతడికి దక్కింది. టీ20 వరల్డ్ కప్ సాధించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను సెలెక్టర్లు తప్పించిన తర్వాత అనూహ్య పరిస్థితుల్లో అయ్యర్‌కు నాయకత్వ బాధ్యతలు దక్కాయి. ఆ తర్వాత భారత క్రికెట్ జట్టు తీవ్రమైన గాయాల సమస్యలతో సతమతమైంది, ఈ క్రమంలో బీసీసీఐ ఈ నెల ప్రారంభంలో అయ్యర్‌తో ఒక కీలక సమీక్షా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది.

Read Also: BBL Ownership Dilemma:  బీబీఎల్లోకి అడుగుపెట్టేందుకు ఐపీఎల్ బాస్‌ల వెనుకంజ.. మెల్‌బోర్న్ రెనెగేడ్స్ కొనుగోలుపై సస్పెన్స్.. అదే కార‌ణ‌మా..?

ఆటగాళ్ల గాయాలపై ఒత్తిడేం లేదు..
ఆటగాళ్ల  వరుస గాయాల గురించి అయ్యర్ మాట్లాడుతూ, "ఆటగాళ్లు గాయపడటం ఏమాత్రం నిరాశ కలిగించే అంశం కాదు. ఒక ప్లేయర్ నిరంతరం ఎన్ని మ్యాచ్‌లు ఆడుతున్నాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మ్యాచ్‌ల తీవ్రత చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఏదో ఒక రకంగా గాయపడటం సహజం. ఇది జట్టు కూర్పుపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. ఆ సమయంలో అందుబాటులో ఉన్న ఆటగాళ్లపై మాత్రమే మనకు నియంత్రణ ఉంటుంది. బరిలోకి దిగే ఆటగాడికి పూర్తి విశ్వాసాన్ని అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. జట్టులో బ్యాకప్ ఆటగాళ్లు కూడా అంతే కీలకం, వారు కూడా మ్యాచ్‌లను గెలిపించగలరు" అని పేర్కొన్నాడు.

Read Also: Joe Root World Record: సచిన్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్.. జో రూట్ హాఫ్ సెంచరీల సునామీతో పాకిస్తాన్ వైట్‌వాష్

జట్టులోకి బుమ్రా రీఎంట్రీ.. 
చాలా కాలం తర్వాత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా సేవలు అయ్యర్‌కు అందుబాటులోకి రావడం అతిపెద్ద ఊరటగా మారింది. "గాయం నుంచి కోలుకుని వచ్చినప్పుడు ఆటగాడికి ఎక్కువ మ్యాచ్ ప్రాక్టీస్ లభించడం చాలా ముఖ్యం. బుమ్రా ఎన్నో ఏళ్లుగా నిరంతరం అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు, అతడికి అపారమైన అనుభవం ఉంది" అని అయ్యర్ పేర్కొన్నాడు. బుమ్రా చేరికతో బౌలింగ్ విభాగం మరింత వాడిగా మారనుంది.

ఏషియన్ గేమ్స్ సన్నాహాలు.. 
సెప్టెంబర్ 19న ఆసియా క్రీడల కోసం జపాన్ బయలుదేరే ముందు భారత జట్టుకు ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్ మంచి సన్నాహకంగా ఉపయోగపడనుంది. "చాలా ఉత్సాహంగా ఉంది. ఇలాంటి మల్టీ-స్పోర్ట్స్ ఈవెంట్‌లో పాల్గొనడం నాకు ఇదే తొలిసారి. గతంలో ఆసియా క్రీడలు ఆడిన ఆటగాళ్లు మా జట్టులో ఉన్నారు. జపాన్‌తో ఆడే మ్యాచ్ చారిత్రాత్మకమైనది. హాకీ క్రీడాకారులు, ఇతర ఒలింపిక్ అథ్లెట్లతో సమయం గడపడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. సమయం దొరికినప్పుడల్లా మా దేశ అథ్లెట్లకు మద్దతుగా నిలుస్తాం" అని అయ్యర్ వెల్లడించాడు. ఇక మ్యాచ్ రాత్రి 7.30 నుంచి ఢిల్లీలో స్టార్ట్ అవుతుంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rohit Sharma Captaincy: రోహిత్  చేతికే మళ్లీ  MI పగ్గాలు దక్కనున్నాయా..! హార్దిక్ నిష్క్రమణతో కెప్టెన్ ఎంపికపై ఫ్రాంచైజీ వ్యూహాత్మక మౌనం
రోహిత్  చేతికే మళ్లీ  MI పగ్గాలు దక్కనున్నాయా..! హార్దిక్ నిష్క్రమణతో కెప్టెన్ ఎంపికపై ఫ్రాంచైజీ వ్యూహాత్మక మౌనం
Hardik - Arshdeep Deal: 18 కోట్ల భారీ డీల్‌తో పంజాబ్ కి చేరిన హార్దిక్.. ముంబై గూటికి అర్ష్‌దీప్ సింగ్.. మెగా ట్రేడ్‌ను అధికారికంగా ఖరారు చేసిన MI
18 కోట్ల భారీ డీల్‌తో పంజాబ్ కి చేరిన హార్దిక్.. ముంబై గూటికి అర్ష్‌దీప్ సింగ్.. మెగా ట్రేడ్‌ను అధికారికంగా ఖరారు చేసిన MI
Ravi Shastri Recall: వరల్డ్ కప్ మ్యాచ్‌ను మలుపు తిప్పిన పంత్ బ్రేక్.. సౌతాఫ్రికా గుండె పగిలిన వేళ, పోలాక్ కన్నీటి రియాక్షన్
వరల్డ్ కప్ మ్యాచ్‌ను మలుపు తిప్పిన పంత్ బ్రేక్.. సౌతాఫ్రికా గుండె పగిలిన వేళ, పోలాక్ కన్నీటి రియాక్షన్
Gill, Iyer Swap: వర్షార్పణమైన హామిల్టన్ వన్డే.. గిల్, రాహుల్ టెస్ట్ టీమ్‌లోకి వెళ్లడంతో నాలుగో వన్డే నుంచి శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు
వర్షార్పణమైన హామిల్టన్ వన్డే.. గిల్, రాహుల్ టెస్ట్ టీమ్‌లోకి వెళ్లడంతో నాలుగో వన్డే నుంచి శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad IT Tower: ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ ప్రారంభం.. 3000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్: మంత్రి శ్రీధర్ బాబు
ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ ప్రారంభం.. 3000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్: మంత్రి శ్రీధర్ బాబు
Bharat Summit 2026: ప్రపంచ రాజకీయాలకు వేదికగా హైదరాబాద్ ! దావోస్ తరహాలో భాగ్యనగరం అభివృద్ధి: భట్టి విక్రమార్క
ప్రపంచ రాజకీయాలకు వేదికగా హైదరాబాద్ ! దావోస్ తరహాలో భాగ్యనగరం అభివృద్ధి: భట్టి విక్రమార్క
AP Ration Items: ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. రాయితీపై నిత్యావసర సరుకులు పంపిణీ
ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. రాయితీపై నిత్యావసర సరుకులు పంపిణీ
Pushpaka Vimanam Series OTT : ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Hardik - Arshdeep Deal: 18 కోట్ల భారీ డీల్‌తో పంజాబ్ కి చేరిన హార్దిక్.. ముంబై గూటికి అర్ష్‌దీప్ సింగ్.. మెగా ట్రేడ్‌ను అధికారికంగా ఖరారు చేసిన MI
18 కోట్ల భారీ డీల్‌తో పంజాబ్ కి చేరిన హార్దిక్.. ముంబై గూటికి అర్ష్‌దీప్ సింగ్.. మెగా ట్రేడ్‌ను అధికారికంగా ఖరారు చేసిన MI
Vizag CII Partnership Summit: సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ముస్తాబైన విశాఖ.. రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా ప్రభుత్వ ఏర్పాట్లు
సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ముస్తాబైన విశాఖ.. రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా ప్రభుత్వ ఏర్పాట్లు
Rohit Sharma Captaincy: రోహిత్  చేతికే మళ్లీ  MI పగ్గాలు దక్కనున్నాయా..! హార్దిక్ నిష్క్రమణతో కెప్టెన్ ఎంపికపై ఫ్రాంచైజీ వ్యూహాత్మక మౌనం
రోహిత్  చేతికే మళ్లీ  MI పగ్గాలు దక్కనున్నాయా..! హార్దిక్ నిష్క్రమణతో కెప్టెన్ ఎంపికపై ఫ్రాంచైజీ వ్యూహాత్మక మౌనం
Priya Bhavani Shankar Marriage: పెళ్లి చేసుకున్న 'ఇరుముడి' హీరోయిన్ ప్రియా భవాని శంకర్..
పెళ్లి చేసుకున్న 'ఇరుముడి' హీరోయిన్ ప్రియా భవాని శంకర్..
Embed widget