Joe Root World Record: సచిన్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్.. జో రూట్ హాఫ్ సెంచరీల సునామీతో పాకిస్తాన్ వైట్‌వాష్
పాకిస్తాన్‌తో జరిగిన మూడో టెస్టులో జో రూట్ 69వ అర్ధ శతకంతో సచిన్ రికార్డును అధిగమించగా, ఇంగ్లాండ్ 3-0తో క్లీన్‌స్వీప్ సాధించి, సిరీస్ సొంతం చేసుకుంది.

ENG VS PAK, Joe Root Breaks Legendary Sachin Tendulkar Test Milestone: ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో పాకిస్తాన్‌తో జరిగిన ఆఖరి టెస్టులో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ సరికొత్త చరిత్ర నెలకొల్పాడు. టీమ్ ఇండియా దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అత్యధిక టెస్ట్ అర్ధ సెంచరీల ప్రపంచ రికార్డును అతడు తిరగరాశాడు. పాకిస్తాన్ నిర్దేశించిన 130 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో రూట్ కేవలం 39 బంతుల్లోనే 9 ఫోర్లతో 62 పరుగులు చేసి నాటౌట్‌గా జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో టెస్టుల్లో తన హాఫ్ సెంచరీల సంఖ్యను 69కి చేర్చాడు. దీంతో ఇప్పటివరకు 68 అర్ధ సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగిన సచిన్ టెండూల్కర్‌ను రూట్ దాటేయడం విశేషం. ఈ జాబితాలో శివనారాయణ్ చంద్రపాల్ 66 ఫిఫ్టీలతో మూడో స్థానంలో ఉండగా, అలాన్ బోర్డర్, రాహుల్ ద్రవిడ్ చెరో 63, రికీ పాంటింగ్ 62 అర్ధ సెంచరీలతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు.
రూట్ అరుదైన ఘనత..
ఈ మ్యాచ్ ద్వారా జో రూట్ మరో అరుదైన ఘనతను కూడా తను సాధించాడు. ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో వెయ్యి టెస్ట్ పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. లార్డ్స్, మాంచెస్టర్, ది ఓవల్ మైదానాల తర్వాత రూట్ వెయ్యి పరుగులు దాటిన నాలుగో వేదికగా ఎడ్జ్‌బాస్టన్ నిలిచింది. లార్డ్స్‌లో 2203 పరుగులు, మాంచెస్టర్‌లో 1128 రన్స్, ది ఓవల్‌లో 1050 పరుగులు చేసిన అతడు నాలుగు వేర్వేరు స్టేడియాల్లో వెయ్యికి పైగా రన్స్ బాదిన ఎలైట్ జాబితాలో స్థానం దక్కించుకున్నాడు. గతంలో సౌతాఫ్రికా దిగ్గజ ఆల్‌రౌండర్ జాక్వెస్ కల్లిస్, ఆస్ట్రేలియా గ్రేట్ రికీ పాంటింగ్ మాత్రమే ఈ ఘనత సాధించగా, వారి సరసన నిలిచిన మూడో క్రికెటర్‌గా రూట్ అరుదైన మైలురాయిని చేరాడు.
Read Also: Dhoni CSK Stake: CSKలో 25 శాతం వాటా అడిగాడా..? ధోని షేర్ల వ్యవహారంపై మేనేజ్‌మెంట్ క్లారిటీ!!
ఎట్టకేలకు 200+ పరుగులను దాటిన పాక్..
మ్యాచ్ విషయానికి వస్తే మొదటి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ కేవలం 133 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ 75, జేమీ స్మిత్ 69, డాన్ లారెన్స్ 65, ఎమిలియో గే 60, ఆలీ రాబిన్సన్ 50 పరుగులతో రాణించడంతో 453 పరుగులు చేసి 320 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ అద్భుతంగా పుంజుకుని 449 పరుగులు సాధించింది. మాజీ కెప్టెన్ షాన్ మసూద్ 95, బాబర్ ఆజం 76 రన్స్ చేయగా, అరంగేట్ర బ్యాటర్ రజావుల్లా 81 రన్స్ సాధించాడు. తొమ్మిదో వికెట్‌కు మహమ్మద్ అబ్బాస్ 42 పరుగుల సహకారంతో రజావుల్లా 121 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇంగ్లాండ్‌కు 130 పరుగుల టార్గెట్ విధించాడు. ఇక ఈ టూర్ లో తొలిసారి 200+ పరుగుల మైలురాయిని పాక్ చేరుకున్నట్లయ్యింది.
క్లీన్ స్వీప్...
స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లాండ్ కేవలం రెండు వికెట్లు కోల్పోయి కంప్లీట్ చేసింది. జో రూట్ 62 నాటౌట్, జోర్డాన్ కాక్స్ 59 నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో హెడింగ్లీ, లార్డ్స్ టెస్టుల్లో సాధించిన విజయాలతో కలిపి ఇంగ్లాండ్ 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి, పాక్ ను చావుదెబ్బ తీసింది.
Before You Go
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
ట్రెండింగ్ వార్తలు



















