అన్వేషించండి

Shreyas Iyer Comeback Story: టీమ్‌లోనే చోటు లేదన్నారు.. ఇప్పుడు ఏకంగా కెప్టెనే అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ కమ్‌బ్యాక్

అసలు టీమిండియాలోకి మళ్లీ అడుగుపెట్టడం సాధ్యమవుతుందా అనుకున్న దశ నుంచి తనను తీసుకోక తప్పని పరిస్థితి కల్పించాడు.. శ్రేయస్ అయ్యర్.. రెండున్నరేళ్ల కిందట తనను పక్కన పెట్టిన ఫార్మాట్‌కే... కెప్టెన్ అయ్యాడు

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • గాయాలు, వైఖరితో టీమిండియా స్థానం, కాంట్రాక్ట్ కోల్పోయాడు.
  • దేశవాళీ క్రికెట్, రంజీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శనతో ఫామ్‌లోకి వచ్చాడు.
  • ఐపీఎల్‌లో కేకేఆర్ కెప్టెన్‌గా టైటిల్ సాధించి నాయకత్వం నిరూపించాడు.
  • ప్రదర్శనల ఫలితంగా టీమిండియా కెప్టెన్‌గా తిరిగి బాధ్యతలు పొందాడు.

Shreyas Iyer Success Story: క్రికెట్ పిచ్‌పై బంతి ఎంత వేగంగా బౌన్స్ అవుతుందో.. అంతకంటే వెయ్యి రెట్ల వేగంతో కెరీర్‌లో బౌన్స్ బ్యాక్ అయిన లయన్ హార్ట్ స్టోరీ ఇది! ఒకానొక దశలో టీమిండియా సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయి జట్టులో స్థానం లేక, గాయాలతో సతమతమవుతూ.. కెరీర్ ముగిసిపోయిందనుకున్న చోటు నుండే, ఇప్పుడు ఏకంగా కెప్టెన్‌గా సింహాసనాన్ని అధిరోహించాడు!వినడానికి ఇదొక సినిమా స్టోరీలా ఉన్నా.. శ్రేయస్ అయ్యర్ సాధించిన రియల్ లైఫ్ హై-వోల్టేజ్ సక్సెస్ సాగా ఇది. అసలు అయ్యర్ జట్టులో చోటు ఎలా కోల్పోయాడు? తనను తాను ఎలా మలుచుకున్నాడు? సెలక్టర్లు అతన్ని తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో చూద్దాం!

టీమిండియా నుంచి అవుట్..

మూడేళ్ల కిందట టీమిండియా మిడిలార్డర్ లో కీలక బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్. టెస్టుల్లో కాకపోయినా.. వన్డే, టీ-20 లో తన స్థానం కచ్చితంగా ఉండేది. విరాట్, రోహిత్ ఎక్సిట్ తర్వాత శుభమన్, శ్రేయస్ ఆ రోల్ తీసుకుంటారు అని చాలా మంది అభిమానులు భావించారు. కానీ ఎక్కడ తేడా వచ్చిందో ఎంటో పాతాళానికి పడిపోయాడు. గాయం టీమ్‌కు దూరం చేసిందంటారు కానీ... అంతకంటే ఎక్కువుగా అతని యాటిట్యూట్ దెబ్బతీసింది. 2023 డిసెంబర్ తర్వాత శ్రేయస్ T20 ఇంటర్నేషనల్ ఆడలేదు. 2024 వైజాగ్ టెస్ట్ తర్వాత టెస్టుల్లోకి తీసుకోలేదు. మధ్యలో వన్డేలు ఆడినప్పటికీ అతని పెర్‌ఫార్మెన్స్‌ బాలేదు.. టీమ్ కూడా సరిగ్గా చాన్స్ ఇవ్వలేదు. 2024 ఏడాది మొత్తం మూడు మ్యాచ్‌లలో చాన్స్ వస్తే.. మూడింట్లో ఫెయిల్ అయ్యాడు. 2026 జనవరి న్యూజీలాండ్ సిరిస్‌లో కూడా ఫెయిలే.. 

ఇంటర్నేషనల్ కెరీర్ దెబ్బతింది ఇలా...

శ్రేయస్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు దూరం కావడానికి అతని గాయాలు-  ఓ కారణమైతే.. తను స్వయంగా చేసిన తప్పులు కూడా మరో కారణం.

  • కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు వెన్నునొప్పి వల్ల అయ్యర్ క్రికెట్‌కు దూరం అయ్యాడు..
  • విదేశీ పిచ్‌లపై షార్ట్ పిచ్ (Short-ball) బంతులను ఎదుర్కోవడంలో అయ్యర్ తడబడుతున్నాడనే విమర్శలు వెల్లువెత్తాయి. ప్రత్యర్థి బౌలర్లు దాన్నే అస్త్రంగా చేసుకుని అతన్ని టార్గెట్ చేశారు.
  • BCCI ఆగ్రహం - కాంట్రాక్ట్ రద్దు: గాయం నుంచి కోలుకున్న తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడాలన్న బోర్డు ఆదేశాలను అయ్యర్ పక్కన పెట్టాడనే టాక్ నడిచింది. రంజీలు ఆడమంటే వెన్నునొప్పి అని సాకు చెప్పిన అతను.. IPL ఆడాడు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి.  దీనికి ఆగ్రహించిన BCCI.. 2024 ఆరంభంలో అతని సెంట్రల్ కాంట్రాక్ట్‌ను రద్దు చేసింది  

     ఆ తర్వాత తనను తీసుకుంటారేమో అని ఎదురు చూశాడు కానీ.. బోర్డు పెద్దల ఆగ్రహంతో కుదరలేదు.

పడి లేచిన కెరటంలా.. 

BCCI కి తను పట్టించుకునే ఉద్దేశ్యం లేదని గుర్తించిన అయ్యర్.. తనను వాళ్లు గుర్తించక తప్పనిసరి పరిస్థితి కల్పించాలనుకున్నాడు. విమర్శలకు నోటితో కాదు.. బ్యాట్‌తోనే సమాధానం చెప్పాలని డిసైడ్ అయిన అయ్యర్, అహాన్ని పక్కన పెట్టి దేశవాళీ క్రికెట్ రూట్‌లోకి వచ్చాడు. తన సొంత జట్టు ముంబై తరపున రంజీ ట్రోఫీ బరిలోకి దిగాడు.

టీమిండియా నుంచి ఉద్వాసనకు గురైన వెంటనే అయ్యర్ తన సొంత జట్టు ముంబై తరపున రంజీ బరిలోకి దిగాడు. తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నా, ఒత్తిడిని అధిగమించి మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేశాడు. 

2024 రంజీ ట్రోఫీ సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లలో అయ్యర్ ఆడిన ఇన్నింగ్స్‌లు అద్భుతం. ముఖ్యంగా విదర్భతో జరిగిన **ఫైనల్ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 95 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడి ముంబైని రంజీ ఛాంపియన్‌గా నిలబెట్టాడు.

ఆ తర్వాతి రంజీ సీజన్లలో ఒడిషాపై కేవలం 228 బంతుల్లోనే 233 పరుగులు చేసి డబుల్ సెంచరీతో గర్జించాడు. అలాగే మహారాష్ట్రపై 142 పరుగులు సాధించి ఫామ్‌లోకి వచ్చాడు.

రెడ్-బాల్ క్రికెట్‌లో తన సత్తా ఏంటో సెలక్టర్లకు చూపించడానికి దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీని కూడా వదలకుండా ఆడాడు. 

T 20ల్లోనూ తాను తక్కువ కాదు అని నిరూపించడానికి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ లోనూ చెలరేగిపోయాడు

బ్యాట్స్‌మెన్‌గా కాదు.. లీడర్‌గా 

ఇవన్నీ ఒకెత్తైతే.. లీడర్‌గా ఐపీఎల్‌లో తన రెండో సైడ్ ఏంటో చూపించాడు అయ్యర్. 2024 IPL లో కెప్టెన్‌గా KKRకు టైటిల్‌ సాధించి పెట్టాడు. ఆ తర్వాత 2025లో పంజాబ్ అతన్ని 26కోట్ల 75లక్షలకు కొనుక్కుంది. PBKSను అతను.. ఆ టీమ్‌ను Unstopable గా మార్చాడు. అసలు అంతకు ముందు IPLలో ఉందో లేదో అన్నట్లు ఉన్న పంజాబ్ కింగ్స్ నిరుడు IPL ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఈ సీజన్‌లో మొదట్లో వరుసగా 6 మ్యాచ్‌లు గెలిచిన పంజాబ్‌ను చూసి.. మరీ ఇలా ఉన్నారేంట్రా..అని మిగతా జట్లు వణికిపోయాయి. శ్రేయస్ ఆ రేంజ్‌లో టీమ్‌ను నిలబెట్టాడు. అతని ఆట... వేట చూసిన తర్వాత ఇక టీమిండియాలోకి తీసుకోక తప్పని సరి అయింది సెలక్టర్లకు. శ్రేయస్ లీడర్‌షిప్ చూశాక కెప్టెన్సీ కూడా అతనికే అప్పగించారు. 

నాయకత్వ లోటు  

SKYను జట్టులో నుంచే తప్పించాలన్సిన పరిస్థితుల్లో  టీమిండియా టీ20 జట్టుకు సరైన లీడర్ అవసరమయ్యాడు. ఐపీఎల్‌లో వరుసగా అద్భుతాలు చేసిన అయ్యర్ కంటే బెస్ట్ కెప్టెన్ ఆప్షన్ సెలక్టర్లకు కనిపించలేదు.ఒత్తిడిలో స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ, ఇన్నింగ్స్‌ను నిర్మించే ఒక సాలిడ్ బ్యాటర్ దేశంలో అయ్యర్ కంటే మెరుగ్గా ఎవరూ లేరని గత మూడు ఐపీఎల్ సీజన్ల రికార్డులు నిరూపించాయి. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర అయ్యర్ లీడర్‌షిప్ స్టైల్‌పై పూర్తి నమ్మకం ఉండటం కూడా దీనికి కారణం.

గ్రేట్ కమ్ బ్యాక్ :
నిన్నటి వరకు 'నువ్వు జట్టుకు అవసరం లేదు' అని కాంట్రాక్ట్ రద్దు చేసిన వాళ్లే.. ఈరోజు 'నువ్వే మా టీ20 కెప్టెన్'అని బాధ్యతలు అప్పగించారు. గాయాలు, కాంట్రాక్ట్ వివాదాలు, ఫామ్ లేమి.. ఇలా అన్ని అడ్డంకులను తన బ్యాట్ పవర్ తో బౌండరీ అవతలికి బాదాడు శ్రేయస్ అయ్యర్.కచ్చితంగా ఇది వన్ ఆఫ్ ద గ్రేట్ కమ్ బ్యాక్. ఈ అవకాశాన్ని ఎలా నిలుపుకుంటాడో చూడాలి. 

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kohli Fitness Secret: కోహ్లీ ఫిట్‌నెస్ చూసి సంజూ ఫిదా.. అడిగి మ‌రీ, టిప్స్ తెలుస‌కున్న శాంసన్..  కొంత‌కాలానికే గివ్ అప్ ఇచ్చిన స్టార్ బ్యాటర్!
కోహ్లీ ఫిట్‌నెస్ చూసి సంజూ ఫిదా.. అడిగి మ‌రీ, టిప్స్ తెలుస‌కున్న శాంసన్..  కొంత‌కాలానికే గివ్ అప్ ఇచ్చిన స్టార్ బ్యాటర్!
BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
Who Is Saransh Jain.?: ఐపీఎల్ అన్ సోల్డ్ ప్లేయ‌ర్ కి టీమ్ ఇండియా టెస్ట్ కాల్-అప్.. వాషింగ్టన్ స్థానంలో సారాంశ్ జైన్ ఎంట్రీ, 11 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌!
ఐపీఎల్ అన్ సోల్డ్ ప్లేయ‌ర్ కి టీమ్ ఇండియా టెస్ట్ కాల్-అప్.. వాషింగ్టన్ స్థానంలో సారాంశ్ జైన్ ఎంట్రీ, 11 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
Healthy Night Routine : మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
Uday Krishna Reddy Arrest: పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
PCOS vs Iron Deficiency : PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే
PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే
Embed widget