Saurabh Tiwary: క్రికెట్‌కు మరో ధోనీ గుడ్ బై , వీడ్కోలు పలికిన సౌరభ్ తివారి
Saurabh Tiwary: టీమిండియా వెటరన్ క్రికెటర్ సౌరభ్ తివారి వీడ్కోలు పలకనున్నాడు.జార్ఖండ్‌కు చెందిన 34 ఏళ్ల తివారి రంజీ ట్రోఫీ 2024లో తన జట్టు ప్రస్థానం ముగిసిన అనంతరం ఈ నిర్ణయాన్ని వెల్లడించాడు.
Saurabh Tiwary announces retirement: టీమిండియా వెటరన్ క్రికెటర్, ఝార్ఖండ్ బ్యాటర్ సౌరభ్ తివారి(Saurabh Tiwary) వీడ్కోలు పలకనున్నాడు. 17 ఏళ్ల కెరీర్‌లో జార్ఖండ్(Jharkhand)కు ఎక్కువగా ఆడిన సౌరభ్ టీమిండియా(Team India) తరఫున మూడు వన్డేల్లో బరిలోకి దిగాడు. దాదాపు 17 ఏళ్ల పాటు జార్ఖండ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన తివారి.. టీమిండియా తరఫున, ఐపీఎల్‌లో పలు మ్యాచ్‌లు ఆడాడు. భారత్ తరఫున 3 వన్డేలు ఆడిన తివారి.. ఐపీఎల్‌లో నాలుగు ఫ్రాంచైజీల తరఫున 93 మ్యాచ్‌లు ఆడాడు. తివారికి హార్డ్ హిట్టర్‌గా పేరుంది. అతనిని అందరూ మరో ధోని అనే వారు.
జార్ఖండ్‌కు చెందిన 34 ఏళ్ల తివారి రంజీ ట్రోఫీ 2024లో తన జట్టు ప్రస్థానం ముగిసిన అనంతరం ఈ నిర్ణయాన్ని వెల్లడించాడు. హర్యానాతో జరిగిన తన ఆఖరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో జార్ఖండ్ 205 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తన చివరి రంజీ మ్యాచ్‌లోనూ 23, 3 పరుగులే చేశాడు. మణిపూర్‌తో జరిగిన గత మ్యాచ్‌లో మాత్రం అజేయ శతకం సాధించాడు.ఈ పరాజయంతో జార్ఖండ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. జాతీయ జట్టుకు ఐపీఎల్‌కు ఆడనప్పుడు ఆటను కొనసాగించడం వృథా అని సౌరభ్ తివారి అభిప్రాయపడ్డాడు. తాను తప్పుకుంటే కుర్రాళ్లకైనా అవకాశం వస్తుందని చెప్పుకొచ్చాడు. టీమిండియా టెస్ట్ టీమ్‌లో కుర్రాళ్లకు చోటుదక్కే అవకాశం ఉందని, అందుకే తాను ఆట నుంచి వైదొలిగి వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నానని తెలిపాడు. 17 ఏళ్ల పాటు దేశవాళీ క్రికెట్‌లో కొనసాగిన తివారి.. భారత్ తరఫున మూడు వన్డేలు.. ఐపీఎల్‌లో నాలుగు ఫ్రాంచైజీల తరఫున 93 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్ 2010 సీజన్‌లో ముంబై తరఫున మెరుపులు మెరిపించిన సౌరభ్ తివారి.. ఆ సీజన్‌లో 419 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనతో భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. కానీ మూడు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమై 49 పరుగులే చేశాడు. అంతర్జాతీయ స్థాయిలో విఫలమైనా.. దేశవాళీలో సత్తా చాటాడు.
34 ఏళ్ల సౌరభ్ టీమ్‌ఇండియా తరపున 2010లో 3 వన్డేలాడి 49 పరుగులు చేశాడు. 115 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 47.51 సగటుతో 8030 పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లో 93 మ్యాచ్‌ల్లో 1494 పరుగులు ఖాతాలో వేసుకున్నాడు. 116 లిస్ట్- ఎ మ్యాచ్‌ల్లో 4050 పరుగులు చేశాడు. ‘‘పాఠశాలకు వెళ్లకముందే ప్రారంభమైన ఈ ప్రయాణానికి ముగింపు పలకడం కష్టమైందే. కానీ అందుకు ఇదే సరైన సమయం. జాతీయ జట్టులో, ఐపీఎల్‌లో లేనప్పుడు యువ ఆటగాడి కోసం రాష్ట్ర జట్టులో స్థానాన్ని ఖాళీ చేయాలని భావించాను’’ అని సౌరభ్ పేర్కొన్నాడు.
అతను జార్ఖండ్ తరఫున 115 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 22 సెంచరీల సాయంతో 8030 పరుగులు చేశాడు. ఈ గణంకాలు అదే జార్ఖండ్‌కు ప్రాతినిథ్యం వహించిన టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కంటే ఎక్కువ కావడం విశేషం. తివారి కోహ్లి నేతృత్వంలోని అండర్-19 ప్రపంచకప్ (2008) గెలిచిన భారత యువ జట్టులో సభ్యుడు కావడం మరో విశేషం. . ‘ఇదే సరైన సమ యం అనుకుంటున్నా. జాతీయ జట్టుతో పాటు ఐపీఎల్ పోటీలో లేనప్పుడు రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ.. యువ ఆటగాళ్ల అవకాశాలను కాలరాయడం సరికాదు’ అని సౌరభ్ పేర్కొన్నాడు.