(Source: ECI/ABP News/ABP Majha)
SA Vs AUS: దక్షిణాఫ్రికా గడ్డపై వార్నర్, హెడ్ రికార్డులు - 10 ఓవర్లలో ఎంత కొట్టారంటే?
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్ రికార్డు సృష్టించారు.
David Warner Travid Head Record: ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఐదు వన్డేల సిరీస్‌లో రెండో మ్యాచ్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్ అద్భుతమైన రికార్డు సృష్టించారు.
ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్ కేవలం 10 ఓవర్లలోనే జట్టు స్కోరును 100 పరుగులకు దాటించారు. ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా గడ్డపై వన్డే మ్యాచ్‌ల్లో ఏ జట్టూ ఈ ఘనత ఎప్పుడూ సాధించలేదు. డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్ జోడీ చరిత్ర సృష్టించింది.
డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్ భారీ రికార్డు
ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్ తొలి వికెట్‌కు 11.5 ఓవర్లలో 109 పరుగులు జోడించారు. డేవిడ్ వార్నర్ కేవలం 93 బంతుల్లోనే 106 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, మూడు సిక్సర్లు బాదాడు. కాగా ట్రావిస్ హెడ్ 36 బంతుల్లో 64 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఆటగాడు తన ఇన్నింగ్స్‌లో తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్లు కొట్టాడు. అదే సమయంలో ఈ మ్యాచ్ గురించి చెప్పాలంటే ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 392 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియా తరఫున మార్నస్ లబుషేన్ (124: 99 బంతుల్లో, 19 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీ, జోష్ ఇంగ్లీష్ (50: 37 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) అర్థ సెంచరీ సాధించారు. దక్షిణాఫ్రికా బౌలర్ల గురించి చెప్పాలంటే స్పిన్ బౌలర్ షంసి నాలుగు వికెట్లు పడగొట్టాడు. కగిసో రబడకు రెండు వికెట్లు దక్కాయి. మార్కో జాన్సెన్, ఆండీ ఫెలుక్వాయో చెరో వికెట్ తీసుకున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌లో మూడో మ్యాచ్ సెప్టెంబర్ 12వ తేదీన జరగనుంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial