అన్వేషించండి
Advertisement
Rohit Sharma:రోహిత్ శర్మ ఖాతాలో చెత్త రికార్డు, హిట్‌మ్యాన్ కెప్టెన్సీలో తొలిసారట
Rohit Sharma: మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 5 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు. ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
సౌతాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ ఘోర ఓటమితో ఆరంభించింది. సెంచూరియన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియాకు ఘోర పరాభవం తప్పలేదు. తొలి టెస్టులో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దారుణ ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలో హిట్‌మ్యాన్ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో టెస్టు క్రికెట్‌లో డకౌటైన రెండో భారత కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఉన్నాడు. 2011 ప్రోటీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ధోని డకౌట్‌గా వెనుదిరిగాడు. తాజా మ్యాచ్‌తో రోహిత్ కూడా ఈ జాబితాలోకి చేరాడు. మరోవైపు రోహిత్ శర్మ నాయకత్వంలో తొలిసారి ఇన్నింగ్స్ తేడాతో భారత్ ఓడిపోయింది. 2015 తర్వాత జట్టుకు ఎదురైన భారీ ఓటమి ఇదే. 2011 నుంచి దక్షిణాఫ్రికాపై ఇప్పుడే ఇన్నింగ్స్ తేడాతో ఓటమిని చవిచూసింది.
ప్రొటీస్ వెన్నెముకగా డీన్ ఎల్గర్
తొలుత డీన్ ఎల్గర్ భారీ శతకంతో చెలరేగడం... తర్వాత పేసర్ కగిసో రబాడ బ్యాటర్ల పతనాన్ని శాసించడంతో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో భారత్ పరాజయం పాలైంది. విరాట్ కోహ్లీ పోరాడినా టీమిండియాకు పరాజయం తప్పలేదు. దక్షిణాఫ్రికా పేసర్ల నిప్పులు చెరిగే బంతులకు భారత బ్యాటర్ల దగ్గర సమాధానమే కరువైంది. ఒక్కొక్కరుగా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. సఫారీలు తొలి ఇన్నింగ్స్‌లో 408 పరుగులకు ఆలౌటై 163 పరుగుల ఆధిక్యాన్ని సాధించారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. సౌతాఫ్రికా పేసర్లు చెలరేగడంతో 131 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ (76) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. తొలి టెస్టులో భారత్ ఓటమిపాలైనా కోహ్లీ మాత్రం అరుదైన ఘనత సాధించాడు.
ఔరా కోహ్లీ...
కోహ్లీ తొలి ఇన్నింగ్స్‌లో 38, రెండో ఇన్నింగ్స్‌లో 76 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఏడు క్యాలెండర్ సంవత్సరాల్లో 2000 వేలకుపైగా పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా అవతరించాడు. అధికారికంగా 1877 నుంచి క్రికెట్ గణాంకాలను లెక్కలోకి తీసుకుంటే మరే ఇతర బ్యాటర్ ఈ ఘనత సాధించలేదు. కోహ్లీ 2012లో 2,186 పరుగులు, 2014లో 2,286 పరుగులు, 2106లో 2,595 పరుగులు, 2017లో 2,818 పరుగులు, 2017లో 2,735 పరుగులు, 2019లో 2,455 పరుగులు చేయగా.. ఇప్పుడు ఈ ఏడాదిలో 2,006 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టే ఈ సంవత్సరం భారత్ ఆడిన చివరి మ్యాచ్ కావడం విశేషం. అయితే ఈ ఓటమికి కారణాన్ని క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ విశ్లేషించాడు. టీమ్‌ఇండియా బ్యాటర్ల షాట్ల ఎంపిక సరిగ్గా లేదని క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ విశ్లేషించాడు. బ్యాటింగ్‌కు అనుకూలంగా మారినట్లు అనిపించిన పిచ్‌పై భారత్‌ను కట్టడి చేయడం అద్భుతమేనని అన్నాడు. తొలి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత దక్షిణాఫ్రికా కాస్త అసంతృప్తికి లోనై ఉంటుందని భావించానని... కానీ రెండో ఇన్నింగ్స్‌కు వచ్చేనాటికి వారి బౌలింగ్ మరింత పదునుదేలిందని అన్నాడు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
తెలంగాణ
ఆటో
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement