అన్వేషించండి

Riyan Parag: రియాన్‌ పరాగ్‌ మెరుపు శతకం,వివ్‌ రిచర్డ్స్‌ సరసన యువ బ్యాటర్‌

Ranji Trophy: భారత్‌లో జరుగుతున్న రంజీ ట్రోఫీలో అస్సాం జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ విధ్వంసం సృష్టించాడు.

దేశవాళీలో ప్రతిష్టాత్మకమైన రంజీ ట్రోఫీ 2024( Ranji Trophy) సీజన్‌లో యువ ఆటగాళ్లు, సీనియర్‌ ఆటగాళ్లు పరుగుల వరద పారిస్తున్నారు. చత్తీస్‌ఘడ్‌(Chattisgarh) తో జరుగుతున్న మ్యాచ్‌లో అస్సాం (Assam) సారధి రియాన్‌ పరాగ్‌(Riyan Parag) విధ్వంసం సృష్టించాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో రియాన్‌ అరుదైన ఘనత సాధించాడు. చత్తీస్‌ఘడ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అస్సాం సారధి రియాన్‌ పరాగ్‌ కేవలం 56 బంతుల్లోనే సెంచరీ చేసి ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో వేగవంతమైన శతకం చేసిన భారత ఆటగాళ్లలో నాలుగో స్థానంలో నిలిచాడు. పరాగ్‌ 87 బంతుల్లోనే 11 బౌండరీలు, 12 భారీ సిక్సర్ల సాయంతో 155 పరుగులు చేశాడు. అయితే 56 బంతుల్లో సెంచరీ చేయడం ద్వారా పరాగ్‌.. విండీస్‌ దిగ్గజం వివ్‌ రిచర్డ్స్‌ సరసన చేరాడు. 1985-86 సీజన్‌లో రిచర్డ్స్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 56 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఇప్పుడు పరాగ్‌.. రిచర్డ్స్‌ రికార్డును సమం చేశాడు. భారత్‌లో ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ ఆడుతూ ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన ఆటగాళ్లలో పరాగ్‌ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో శక్తి సింగ్‌ 45 బంతులలో, వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ 48 బంతుల్లో.. యూసుఫ్‌ పఠాన్‌ 51, ఆర్‌కె బోరా 56 బంతుల్లోనే శతకం శతకాలు సాధించి పరాగ్‌ కంటే ముందున్నారు. 
 
పరాగ్‌ రాణించినా పరాజయమే
పరాగ్‌ రాణించినా ఛత్తీస్‌గఢ్‌ చేతిలో అస్సాం చిత్తుచిత్తుగా ఓడిపోయింది. మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఛత్తీస్‌గఢ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులు చేసింది. అస్సాం ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో 159 పరుగులకే ఆలౌట్‌ కాగా రెండో ఇన్నింగ్స్‌లో 254 పరుగులు చేసింది. 87 పరుగుల లక్ష్యాన్ని ఛత్తీస్‌గఢ్‌ వికెట్‌ కోల్పోకుండా ఛేదించింది. 
 
ఢిల్లీ జట్టుకు దిమ్మతిరిగే షాక్‌
దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో ఢిల్లీ జట్టుకు పెద్ద షాక్‌ తగిలింది. పటిష్టమైన ఢిల్లీ జట్టును పుదుచ్చేరి చిత్తు చేసింది. తొలి మ్యాచ్‌లోనే ఘోరా పరాభవంతో ఢిల్లీ జట్టుకు దిమ్మతిరిగిపోయింది. బలహీనంగా కనిపించిన పుదుచ్చేరి జట్టు.. ఢిల్లీలాంటి బలమైన జట్టును ఓడించడం క్రికెట్‌ విశ్లేషకులను కూడా విస్మయపరిచింది. ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ మైదానం వేదికగా జరిగిన ఎలైట్ గ్రూప్ డి మొదటి మ్యాచ్‌లో ఢిల్లీను 9 వికెట్ల తేడాతో పుదుచ్చేరి చిత్తు చేసింది. రంజీ ట్రోఫీ చరిత్రలో పుదుచ్చేరి సాధించిన అతిపెద్ద విజయాల్లో ఇదీ ఒకటని మాజీ క్రికెటర్లు అంటున్నారు.
 
పుదుచ్చేరి దెబ్బకు విలవిల
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి పుదుచ్చేరి బౌలర్లు చుక్కలు చూపించారు. గౌరవ్‌ యాదవ్‌ బౌలింగ్‌కు ఢిల్లీ బ్యాటింగ్‌ లైనప్‌ కకావికలమైంది. గౌరవ్ ఏడు వికెట్లతో ఢిల్లీ జట్టు పతనాన్ని శాసించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఢిల్లీ కేవలం 148 పరుగులకే కుప్పకూలింది.  తొలి ఇన్నింగ్స్‌లో గౌరవ్‌ యాదవ్‌ 7 వికెట్లతో సత్తా చాటాడు. ఢిల్లీ బ్యాటర్లలో హర్ష్‌ త్యాగీ(34) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పుదుచ్చేరి 244 పరుగులకు ఆలౌటైంది. దీంతో పుదుచ్చేరికి కీలకమైన 96 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. రెండో  ఇన్నింగ్స్‌లోనూ ఢిల్లీ ఆటతీరు ఏమీ మారలేదు. మరోసారి పుదుచ్చేరి బౌలర్లు రాణించడంతో రెండో ఇన్నింగ్స్‌లోనూ ఢిల్లీ 145 పరుగులకే ఆలౌటైంది.  ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్‌ యష్ ధుల్ దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 25 పరుగులు మాత్రమే చేశాడు.  దీంతో పుదుచ్చేరి ముందు కేవలం 51 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది. 51 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే పుదుచ్చేరి ఛేదించింది. రెండు ఇన్నింగ్సుల్లో పది వికెట్లు పడగొట్టిన గౌరవ్‌ యాదవ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Mahindra BE 6e Vs Tata Curvv EV: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Embed widget