
IND vs ENG: ఆ ఘనత అశ్విన్‌దే, చరిత్ర సృష్టించిన క్రికెట్ జీనియస్
IND vs ENG 2nd Test Day 4: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచులో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అశ్విన్ కొత్త చరిత్ర లిఖించాడు.

విజయం దిశగా టీమిండియా..
రెండో టెస్ట్‌లో టీమిండియా విజయం దిశగా సాగుతోంది. ఓవర్‌నైట్ స్కోరు ఒక్క వికెట్ నష్టానికి 67 పరుగులతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ లంచ్ సమయానికి 194 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది. ఇంకా విజయానికి బ్రిటీష్ జట్టు 205 పరుగుల దూరంలో ఉంది. క్రాలే మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 73 పరుగులు చేసిన క్రాలేను కుల్‌దీప్ అవుట్ చేశాడు. ఎల్బీ కోసం టీమిండియా అప్పీలు చేయగా.. అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. డీఆర్‌ఎస్ తీసుకున్న భారత్‌కు ఫలితం సానుకూలంగా వచ్చింది. దీంతో 194 పరుగుల వద్ద ఇంగ్లాండ్ ఐదో వికెట్‌ను నష్టపోయింది. వెంటనే ఇంగ్లాండ్‌కు మరో షాక్ తగిలింది. బుమ్రా బౌలింగ్‌లో బెయిర్ స్టో ఎల్బీగా ఔట్ అయ్యాడు. అంపైర్ ఔట్ ఇవ్వడంతో ఇంగ్లాండ్ డీఆర్‌ఎస్ తీసుకుంది. సమీక్షలోనూ ‘అంపైర్స్ కాల్’ రావడంతో బెయిర్‌స్టో నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. తొలి సెషన్‌లో ఇంగ్లాండ్ 127 పరుగులు చేసి ఆరు వికెట్లను కోల్పోయింది. భారత్ విజయానికి ఇంకా 4 వికెట్లు మాత్రమే అవసరం. ఇంగ్లాండ్ గెలిచేందుకు 205 పరుగులు కావాలి. తొలి మ్యాచ్‌లో సెంచరీతో కదంతొక్కిన ఓలీ పోప్ క్యాచ్‌ను స్లిప్‌లో రోహిత్ శర్మ అద్భుతంగా అందుకున్నాడు. అశ్విన్ బౌలింగ్‌లో 23 పరుగులు చేసిన ఓలీ పోప్ ఔటయ్యాడు.
గాయంతో గిల్ దూరం
ఇప్పటికే గాయాలతో సతమతమవుతున్న టీమిండియాకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే గాయాలతో కె.ఎల్.రాహుల్, రవీంద్ర జడేజా జట్టుకు దూరమవ్వగా రెండో టెస్ట్‌లో అద్భుత సెంచరీతో ఆకట్టుకున్న స్టార్ శుభ్‌మన్ గిల్‌కు గాయం కావడం ఆందోళన కలిగిస్తోంది. రెండో రోజు ఆట సందర్భంగా గిల్ కుడి చూపుడు వేలికి గాయమైంది. ఓ వైపు చేతి వేలి నొప్పితో బాధపడుతూనే సెకెండ్ ఇన్నింగ్స్‌లో అద్బుతమైన సెంచరీతో గిల్ చెలరేగాడు. అయితే ఇప్పుడు అతడికి వేలి నొప్పి ఎక్కువగా ఉండడంతో నాలుగో రోజు గిల్ మైదానంలో అడుగుపెట్టలేదు. ఈ విషయాన్ని బీసీసీఐ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. ఫీల్డింగ్‌లో శుబ్‌మన్ చేతి వేలికి గాయమైందని... నాలుగో రోజు ఫీల్డింగ్‌కు దూరంగా ఉంటాడని బీసీసీఐ ట్వీట్ చేసింది. గిల్ స్ధానంలో సర్ఫరాజ్ ఖాన్ సబ్‌స్ట్యూట్‌గా ఫీల్డింగ్‌కు వచ్చాడు. కాగా ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 104 పరుగులు చేశాడు. ఇది అతడి కెరీర్‌లో మూడో టెస్టు సెంచరీ.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

