Babar Azam : గేల్, కోహ్లీ రికార్డు బద్దలు- బాబర్ అరుదైన ఘనత
Pakistans Babar Azam: పాకిస్తాన్ స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ బాబర్ ఆజాం అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 10వేల పరుగుల మైలురాయిని పూర్తి చేసుకున్న బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.
Babar Azam Beats Virat Kohli And Chris Gayle: పాకిస్తాన్ (Pakistan)స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ బాబర్ ఆజాం(Babar Azam) అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 10వేల పరుగుల మైలురాయిని పూర్తి చేసుకున్న బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. వెస్టిండీస్ ఆటగాడు క్రిస్‌గేల్, టీమ్ఇండియా కింగ్ విరాట్ కోహ్లి రికార్డులను బాబర్ బద్దలు కొట్టాడు. క్రిస్ గేల్ 285 ఇన్నింగ్సుల్లో 10 వేల మార్కును అందుకోగా... కోహ్లీ 299 ఇన్నింగ్సుల్లో 10 వేల పరుగులు చేశాడు. కానీ బాబర్ 271 ఇన్నింగ్సుల్లోనే ఆ ఘనత సాధించాడు. బాబర్ ఆజాం పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో పెషావర్ జల్మీకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కరాచీ కింగ్స్‌తో మ్యాచ్‌లో పేసర్ మీర్ హంజా బౌలింగ్‌లో రెండు పరుగులు తీయడంతో టీ20ల్లో 10వేల పరుగులను బాబర్ పూర్తి చేసుకున్నాడు. పాకిస్థాన్ తరపున షోయబ్ మాలిక్ 494 ఇన్నింగ్సుల్లో 13, 159 పరుగులు చేయగా బాబర్ 271 10 వేల పరుగులు పూర్తి చేశాడు. బాబర్ తర్వాత మహ్మద్ హఫీజ్ 348 ఇన్నింగ్స్‌లలో 7946 పరుగులు చేసి మూడో స్థానంలో ఉన్నాడు.
రిజ్వాన్ అరుదైన ఘనత
బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్(Mohammad Rizwan) అరుదైన ఘనత సాధించాడు. పాకిస్తాన్ తరుపున టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. న్యూజిలాండ్(New Zealand vs Pakistan)తో జరిగిన రెండో టీ20లో రిజ్వాన్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచులో ఆడిన మొదటి బంతికే సిక్స్ కొట్టిన రిజ్వాన్ ఈ అరుదైన రికార్డును సృష్టించాడు. మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ రికార్డును ఈ స్టార్ బ్యాటర్ బద్దలు కొట్టాడు. హఫీజ్ తన కెరీర్‌లో 76 సిక్సులు కొట్టగా 77 సిక్సులతో రిజ్వాన్ మొదటి స్థానానికి చేరుకున్నాడు. ఈ మ్యాచులో రిజ్వాన్ ఏడు పరుగులకే ఔట్ అయ్యాడు.
పాక్ తరపను టీ 20ల్లో అత్యధిక సిక్సర్లు
మహ్మద్ రిజ్వాన్ –77 సిక్సర్లు
మహ్మద్ హఫీజ్ – 76
షాహిద్ అఫ్రిది – 73
షోయబ్ మాలిక్ – 69
ఉమర్ అక్మల్ – 55
సిక్సులంటే రోహితే
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు. అన్ని ఫార్మాట్లలో 553 సిక్సర్లతో అత్యధిక సిక్సర్ల రికార్డు విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉంది. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉన్న ఈ రికార్డును టీమిండియా సారధి రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు. క్రిస్ గేల్ 551 ఇన్నింగ్స్‌ల్లో 553 సిక్సర్లు బాదగా... హిట్ మ్యాన్ మాత్రం కేవలం 473 ఇన్నింగ్స్‌ల్లోనే 554 సిక్సులు బాది ఆ రికార్డును బద్దలు కొట్టాడు. క్రిస్ గేల్‌కు.. రోహిత్ శర్మ మధ్య 78 ఇన్నింగ్స్‌ల తేడా ఉండడం విశేషం.