మళ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన పాక్ పేసర్- టీ20 ప్రపంచకప్, చాంపియన్స్ ట్రోఫీ నెగ్గడంలో కీలకపాత్ర
గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న పాకిస్తాన్ సీనియర్ పేసర్ మహ్మద్ ఆమిర్ తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మైంట్ ప్రకటించాడు. తనిలా రిటైర్మెంట్ ప్రకటించడం ఇది రెండోసారి కావడం విశేషం.

Mohammad Amir | పాకిస్తాన్ ఏస్ పేసర్ మహ్మద్ ఆమిర్ మరోసారి అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. గతంలో అంటే 2020 డిసెంబర్ లో ఆటకు వీడ్కోలు పలికిన ఈ పేసర్.. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ కు ముందు పునరాగమనం చేశాడు. అయితే ఆ సిరీస్ లో తాను బాగానే రాణించాడు. నాలుగు మ్యాచ్ లు ఆడి ఏడు వికెట్లతో సత్తా చాటాడు. అయితే టోర్నీలో పాక్, యూఎస్, భారత్ చేతిలో ఓడటంతో లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. అప్పటి నుంచి తనను జట్టు కోసం పరిగణించడం లేదు. తను లేకుండా పాకిస్థాన్ సిరీస్ లు ఆడుతోంది ఈ నేపథ్యంలో తాజాగా రిటైర్మెంట్ ప్రకటించాడు.
టీ20 ప్రపంచకప్, చాంపియన్స్ ట్రోఫీ లో కీలకం..
2009లో అరంగేట్రం చేసిన మహ్మద్ ఆమిర్ సత్తా చాటాడు. అదే ఏడాది జరిగిన టీ20 ప్రపంచకఫ్ ను పాకిస్థాన్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. అయితే తర్వాత ఏడాది ఇంగ్లాండ్ లో స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడు. దోషిగా తేలడంతో ఐసీసీ తనపై ఐదేళ్ల నిషేధం విధించింది. దీంతో 2016లో పునరాగమనం చేసిన ఆమిర్.. తర్వాత ఏడాది జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో అదరగొట్టాడు. ముఖ్యంగా భారత్ తో జరిగిన ఫైనల్లో బుల్లెట్ లాంటి బంతులో భారత టాపార్డర్ వెన్ను విరిచాడు. దీంతో కప్పు పాకిస్థాన్ సొంతమైంది. ఆ తర్వాత అడపాదడప జట్టులోకి వస్తున్నప్పటికీ, జట్టులో రెగ్యులర్ ఆటగానిగా మారలేక పోయాడు.
కుర్రాళ్లకు అవకాశం ఇద్దామని..
ఇన్నాళ్లుగా తను పాకిస్థాన్ కు ఆడటం గౌరవంగా భావిస్తున్నట్లు ఆమిర్ తెలిపాడు. తనకు సహకరించిన పీసీబీకి, ఫ్యామిలీ మెంబర్లకు, జట్టు సభ్యులకు థాంక్స్ చెప్పాడు. రిటైర్మెంట్ కఠిన నిర్ణయమని, తాను అన్ని ఆలోచించుకునే ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్లు తెలిపాడు. జట్టులోకి యువతకు మార్గం సుగమం చేసేందుకు తాను తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. అంతర్జాతీయం అన్ని ఫార్మాట్లు కలిపి ఈ పేసర్ కు 271 వికెట్లు ఉన్నాయి. ఇక ఆమిర్ ఇంగ్లాండ్ రాజధాని లండన్ లో సెటిలయ్యేందుకే రిటైర్మెంట్ ప్రకటించినట్లు సమాచారం. ఇంగ్లీష్ గడ్డపై కౌంటీలు సహా, వివిధ లీగ్ ల్లో పాల్గొనడం కోసమే తను ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.
🚨Mohammad Amir has announced his retirement from International Cricket.
— Salman 🇵🇰 (@SalmanAsif2007) December 14, 2024
- 159 International Matches
- 271 International Wickets
- T20 WC 2009 Winner
- CT 2017 Winner
- 17 Wickets with 4.90 Economy in CWC 2019
Happy Retirement legend @iamamirofficial.❤️👏 pic.twitter.com/VlHEZph5q5
Also Read: Nz Vs Eng Test Series: పాపం కేన్ మామ, బ్యాడ్ లక్ వెంటాడింది- విచిత్రంగా ఔటైన కివీస్ మాజీ కెప్టెన్
టెస్టుల నుంచి తప్పుకోమని అక్తర్ సూచన..
మరవైపు భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా గురించి పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా టెస్టుల నుంచి తప్పుకుని, వన్డేలు, టీ20లు లాంటి పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడుకోవాలని సూచించాడు. బుమ్రా బౌలింగ్ శైలి.. పరిమిత ఓవర్ల క్రికెట్ కు సరిగ్గా సరిపోతుందని, ఇటు ఆరంభ ఓవర్లలో, అటు డెత్ ఓవర్లలో స్వింగ్ , మూవ్మెంట్ చూపిస్తూ, బ్యాటర్లను కంగార పెట్టగలడని పేర్కొన్నాడు. అయితే టెస్టుల్లో ఫిట్ నెస్ నిలుపుకోవడం సవాలుతో కూడుకున్నదని అక్తర్ గుర్తు చేశాడు. ఇందులో సుదీర్ఘ స్పెల్స్ వేయాల్సి ఉంటుందని, దీంతో పేసర్లకు ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నాడు.
Also Read: World Record Alert: బాబర్ ఆజమ్ ప్రపంచ రికార్డు - 10 మంది మాత్రమే ఉన్న ఎలైట్ క్లబ్‌లోకి ప్రవేశించిన పాక్ మాజీ కెప్టెన్




















