అన్వేషించండి

ICC: పాకిస్థాన్‌కు దిమ్మతిరిగే షాక్‌, రెండు పాయింట్లు కోసేసిన ఐసీసీ

Pakistan Penalised : ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో ఘోర పరాజయం పాలైన పాకిస్థాన్‌కు ఐసీసీ దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా మ్యాచ్ ఫీజుతో పాటూ WTC పాయింట్లలో కోత విధించింది.

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో ఘోర పరాజయం పాలైన పాకిస్థాన్‌కు ఐసీసీ దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. మూడు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పెర్త్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా 360 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. నాలుగు రోజుల్లోనే ఈ మ్యాచ్‌ ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌ను 5 వికెట్ల నష్టానికి 233 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసిన ఆసీస్‌.. పాకిస్తాన్‌ ఎదుట 449 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది. 450 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్‌ 89 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆసీస్‌ 1-0 ఆధిక్యం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 487 పరుగులకు ఆలౌట్‌ కాగా.. పాక్‌ కేవలం 271 పరుగులకే పరిమితమైంది. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా.. 5 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసి డిక్లేర్‌ చేసి 450 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్ధి ముందు ఉంచింది. భారీ లక్ష్య ఛేదనకు దిగిన పాక్‌.. ఆసీస్‌ బౌలర్లు మూకుమ్మడిగా అటాక్‌ చేయడంతో 89 పరుగులకే కుప్పకూలి భారీ తేడాతో ఓటమిపాలైంది. 

ఈ ఓటమి బాధలో ఉన్న పాకిస్థాన్‌కు ఐసీసీ గట్టి షాక్‌ ఇచ్చింది. ఆసీస్‌తో తొలి టెస్టులో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా పాకిస్థాన్‌ ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించింది. అంతేనా ఇప్పటివరకు పాకిస్థాన్‌ సాధించిన ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో పాయింట్లలో రెండు పాయింట్లు కోత విధిస్తూ ఐసీసీ అధికారిక ప్రకటన జారీ చేసింది. ఐసీసీ రెండు పాయింట్లు కోత విధించడంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పాకిస్థాన్‌ రెండో స్థానానికి పడిపోయింది. 66.67 విజయాల శాతంతో టీమ్‌ఇండియా అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. పాక్‌ 61.11 విజయాల శాతంతో రెండో స్థానంలో ఉంది.  50 విజయాల శాతంతో న్యూజిలాండ్‌ మూడో స్థానంలో... 50 విజయాల శాతంతో బంగ్లాదేశ్ నాలుగో స్థానంలో 41.67 విజయాల శాతంతో ఆస్ట్రేలియా అయిదో స్థానంలో ఉన్నాయి.
 ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ చెలరేగిపోయాడు. పాకిస్థాన్‌ బౌలర్లను ఊచకోత కోస్తూ తొలి రోజే భారీ సెంచరీ బాదేశాడు. వార్నర్‌ విధ్వంసంతో తొలి టెస్ట్‌లో తొలిరోజు పాక్‌పై కంగారులు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. పాక్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న వార్నర్‌... వన్డే తరహా ఆటతీరుతో చెలరేగిపోయాడు. 211 బంతుల్లో 16 ఫోర్లు, నాలుగు సిక్సులతో 164 పరుగులు చేసి తాను ఎంతటి విలువైన ఆటగాడినో క్రికెట్‌ ప్రపంచానికి మరోసారి చాటిచెప్పాడు. వార్నర్‌ భారీ శతకంతో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 487 పరుగులు చేసింది. పాక్‌ అరంగేట్రం బౌలర్‌ ఆమిర్‌ జమాల్‌ 6 వికెట్లు పడగొట్టాడు. పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో 271 పరుగులు చేసింది. ఇమామ్‌ ఉల్‌ హాక్‌ 62 పరుగులతో రాణించాడు. ఆసిస్‌ బౌలర్లలో నాథన్‌ లియోన్‌ 3, స్టార్క్‌, కమిన్స్‌ తలో 2 వికెట్లు పడగొట్టారు. 

సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా.. 5 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసి డిక్లేర్‌ చేసింది. దీంతో పాకిస్తాన్‌ ఎదుట 450 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. అనంతరం భారీ ఛేదనలో పాకిస్తాన్‌ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. స్టార్క్‌ వేసిన తొలి ఓవర్‌లోనే వికెట్‌ కోల్పోయిన పాకిస్తాన్‌.. తర్వాత కూడా క్రమం తప్పకుండా వికెట్లు నష్టపోయింది. కెప్టెన్‌ షాన్‌ మసూద్‌ను హెజిల్‌వుడ్‌ ఔట్‌ చేయగా ఇమామ్‌ ఉల్‌ హక్‌ ను స్టార్క్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆదుకుంటాడనుకున్న బాబర్‌ ఆజమ్‌ 14 పరుగులకే వెనుదిరిగాడు. సౌద్‌ షకీల్‌ 24 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. పాకిస్తాన్‌ చివరి ఆరుగురు బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమవడంతో ఆ జట్టుకు ఘోర పరాభవం తప్పలేదు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్‌ల్లో పాకిస్తాన్‌కు ఇది వరుసగా 15వ ఓటమి కావడం విశేషం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi AP Tour: ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Chevireddy vs. Balineni :  చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
iPhone 15 Pro Max Offer: ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర అంత తక్కువా - భారీ డిస్కౌంట్ ఇచ్చిన యాపిల్!
ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర అంత తక్కువా - భారీ డిస్కౌంట్ ఇచ్చిన యాపిల్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi AP Tour: ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Chevireddy vs. Balineni :  చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
iPhone 15 Pro Max Offer: ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర అంత తక్కువా - భారీ డిస్కౌంట్ ఇచ్చిన యాపిల్!
ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర అంత తక్కువా - భారీ డిస్కౌంట్ ఇచ్చిన యాపిల్!
Bengalore: సినిమా బిచ్చగాడు కాదు రియల్ - బెంగళూరు రోడ్లపై కనిపించే ఈ బెగ్గర్ లైఫ్ స్టోరీ వింటే కన్నీళ్లాగవు !
సినిమా బిచ్చగాడు కాదు రియల్ - బెంగళూరు రోడ్లపై కనిపించే ఈ బెగ్గర్ లైఫ్ స్టోరీ వింటే కన్నీళ్లాగవు !
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Ambati Rambabu On PusPha 2: కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
Embed widget